కంప్యూటర్ ద్వారా మనం ఒక వెబ్ సైటును తెరిచినపుడు మన వెబ్ బ్రౌజర్ వెబ్ పేజి యొక్క పూర్తి రూపాన్ని మనకు దానంతట అదే మన తెర పరిమాణమునకు అనుగుణంగా మార్చి మనకు చూపిస్తుంది. అందువలన కంప్యూటర్లో మనకి వెబ్ సైటు యొక్క మొబైల్ రూపం కనిపించదు. ఫోన్లకి అనువుగా ఉండడం కోసం వెబ్ సైటు యొక్క మొబైల్ రూపం మామూలు వెబ్ పేజికన్నా తక్కువ డాటాని వాడుకుంటు తొందరగా లోడ్ అవుతుంది. కనుక నెట్ తక్కువ వేగం కలిగిన వారు వెబ్ సైట్ల యొక్క మొబైల్ రూపాన్ని ప్రయత్నించవచ్చు. మొబైల్ ద్వారా అంతర్జాలం చూడడం బాగా పెరిగిన ఈరోజుల్లో అన్ని ప్రముఖ వెబ్ సైటులు మరియు బ్లాగులు ప్రత్యేకంగా మొబైల్ రూపాన్ని కూడా అందిస్తున్నాయి. మీరు మీ బ్లాగును మొబైళ్ళకి అనుగుణంగా మార్చుకోవాలనుకుంటే ఇక్కడ చూడండి. ఒక వెబ్ సైటు యొక్క మొబైల్ రూపాన్ని మనం డెస్క్ టాప్ లో చూడాలనుకుంటే వెబ్ చిరునామా చివరన ?m=1 అని ఇవ్వాలి. ఉధాహరణకు www.spveerapaneni.blogspot.com సైటు మొబైల్ రూపాన్ని మనం చూడాలనుకుంటే www.spveerapaneni.blogspot.com/?m=1 అని వెబ్ చిరునామాని ఇవ్వాలి.
వెబ్ సైట్ యొక్క మొబైల్ రూపం తక్కువ ఆప్షన్లతో వేగంగా లోడ్ అయ్యేవిధంగా ఉండడం వలన డెస్క్ టాప్ వెర్షనులో ఉన్న అన్ని ఆప్షన్లు మొబైల్ రూపంలో అందుబాటులో ఉండవు. మనం మొబైల్ నుండి ఒక వెబ్ సైటుని తెరిచినపుడు ఆ సైటు యొక్క మొబైల్ రూపం అందుబాటులో ఉంటే మన మొబైల్ బ్రౌజర్ ఆ సైటు యొక్క మొబైల్ రూపాన్ని మాత్రమే చూపించును. మనం ఎప్పుడైనా అవసరం ఉండి మొబైల్లో వెబ్ సైటు యొక్క డెస్క్ టాప్ వెర్షన్ని చూడాలనుకుంటే మన మొబైల్ బ్రౌజర్ లో "request desktop site" అన్న ఆప్షన్ని క్రింది చిత్రంలో చూపించినట్లు ఎంచుకుంటే సరి.
మొబైల్లో వెబ్ సైటు యొక్క డెస్క్ టాప్ వెర్షన్ని చూడాలనుకుంటే |