ఫోన్ అన్నది ఫోన్ మాట్లాడుకోవడానికే మాత్రమే కాకుండా ఆటలు ఆడడానికి, ఫొటోలు, వీడియోలు తీయడానికి మరియు చూడడానికి, నెట్ చూడడనికి, దార్లు వెతుక్కోవడానికి మరియు టికెట్లు బుక్ చేసుకోవడానికి వంటి వివిధ అవసరాలకు ఉపయోగించడం సాధారణమైపోయింది. దానికి తగ్గట్టుగా ఫోన్ తయారీదారులు కూడా రోజుకో కొత్త మోడల్ తో వివిధ ఫీచర్లతో ఫోన్లను తయారుచేయడం, విడుదలచేయడం జరుగుతుంది. మెన్నటి వరకు హెచ్ డి ని ఇప్పుడు ఫుల్ హెచ్ డి అని డ్యూయల్ కోర్, క్వాడ్ర కోర్ ,2 జిబి రాం , ఎక్కువ మెగా పిక్సల్ కెమేరాలు అంటూ రకరకాల ఫీచర్లతో మన ముందుకొస్తున్నాయి.
ఇప్పుడు కొత్తగా ఎటువంచితే అటు వంగే ఫోన్లు తయారీ మొదలు పెట్టారు. స్మార్ట్ ఫోన్ దిగ్గజం సాంసంగ్ ముందుగా గెలాక్సి రౌండ్ అని వంగే ఫోన్ని తయారుచేస్తున్నామని ప్రకటించింది. దానికి పోటిగా యల్ జి వాడు జి ఫ్లెక్స్ అని మరొక వంగే ఫోన్ని ప్రకటించాడు. ఇంకా విడుదలకాని ఈ ఫోన్ల వయ్యారాలను క్రింది చిత్రాలలో చూడవచ్చు.
సాంసంగ్ రౌండ్ |
యల్ జి ఫెక్స్ |
ఏన్ని ఫీచర్లు కలిగిఉన్న ఫోన్లను తెచ్చినా నిలిచి ఉండే బ్యాటరీ సామర్ధ్యం, వేడెక్కకుండా ఉండడం, ఫోను తరచూ ఆగిపోకుండా ఉండడం, జారిపడిన పెద్దగా దెబ్బతినకుండా ఉండే ఫోన్లనే వినియోగదారుడు మొదట ఆదరిస్తాడన్నది సత్యం. కనుక మొబైల్ ఫోన్ తయారీదారులు వంపులు వయ్యారాల పై కన్నా వినియోగదారునికి ఉపయోగపడే విధంగా కనీస అవసరాలైన నిలిచి ఉండే బ్యాటరీ సామర్ధ్యం, వేడెక్కకుండా ఉండడం, ఫోను తరచూ ఆగిపోకుండా ఉండడం, పొరపాటున జారిపడిన పెద్దగా దెబ్బతినకుండా ఉండే ఫోన్లని తయారు చేయడంపై దృష్టి పెట్టాల్సిన ఆవశ్యకత ఉంది.