మీ పెన్ డ్రైవ్ లోకి పెద్ద ఫైళ్ళు కాపి అవడంలేదా?

 ఈ రోజుల్లో హెచ్ డి వీడియోలు తీయగల కెమేరాలు సరసమైన దరల్లో అందుబాటులో ఉండడం వల్ల అందరి దగ్గరా ఉంటున్నాయి. వీటిలో తీసిన వీడియో పరిమాణం పెద్దదిగా ఉండడం వలన మనం పెన్ డ్రైవ్ లేదా మెమొరి కార్డులలో ఖాళీ ఉన్నప్పటికి ఒకొక్కసారి కాపి కావు. ఒకోసారి కాపి అయినప్పటికి పూర్తిగా కాకపోవడం వల్ల ఆ ఫైలు తెరుచుకోదు. అంతే కాకుండా ఈ మధ్య వచ్చే సినిమాలు కూడా హెచ్ డి లో ఉండి పెద్ద పరిమాణంలో ఉంటున్నాయి. ఒకే ఫైలు 4 జిబి కన్నా ఎక్కువగా ఉంటే ఈ సమస్య వస్తుంటుంది. దీనికి కారణం మన పెన్ డ్రైవ్ యొక్క ఫైల్ సిస్టం. సాధారణంగా పెన్ డ్రైవ్ లు fat పైల్ సిస్టంలో ఫార్మాట్ చేయబడిఉంటాయి. ఈ పురాతన ఫైల్ సిస్టం యొక్క పరిమితుల వలన 4 జిబి కన్నా పెద్ద పరిమాణం గల ఫైలు కాపి కాదు. అప్పుడు మనం మన పెన్ డ్రైవ్ ని ఫార్మాట్ చేసుకొనేటప్పుడు ntfs ఫైల్ సిస్టం లో చేసుకోవాలి. అప్పుడు ఎటువంటి ఇబ్బంది లేకుండా 4 జిబి కన్నా పెద్ద ఫైళ్ళు కూడా పెన్ డ్రైవ్ లోకి కాపి చేసుకోవచ్చు.

ఉబుంటులో ntfs ఫైల్ సిస్టం ఫార్మాట్


విండోస్ లో ntfs ఫైల్ సిస్టం ఫార్మాట్

మరో ఆపరేటింగ్ సిస్టం రాబోతుంది

 ఇప్పటికే మనకు అందుబాటులో ఎన్నో ఆపరేటింగ్ సిస్టంలు ఉన్నాయి. వాటిలో ఉచితంగా లభించేవి చాలా ఉన్నాయి. కానీ ప్రజలలోకి వెళ్ళినవి చాలా తక్కువే అని చెప్పుకొవచ్చు. కాని ఇప్పడు రాబోతున్న ఆపరేటింగ్ సిస్టం ప్రజాదరణ పొందే అవకాశాలు చాలా ఎక్కువ. ఎందుకంటే దాని తయారిదారు వాల్వ్ సాఫ్ట్ వేర్. ఇది ఎప్పుడు వినలేదా. ఇది కంప్యూటర్ గేమింగ్ దిగ్గజం. వీళ్ళు తయారు చేసిన స్టీం అన్న గేమింగ్ ఫ్లాట్ ఫాం గురించి వేరే చెప్పనక్కరలేదు. ఎందుకంటే ఆకంపెనీ పేరు కన్నా స్టీం బాగా ప్రాచూర్యం పొందింది. అదే స్టీం పేరు మీద తొందరలో ఆపరేటింగ్ సిస్టం విడుదలచేయబోతున్నారు. లినెక్స్ పై నిర్మించబడే ఈ స్టీం ఒయస్ ప్రత్యేకించి టీవి మరియు లివింగ్ రూం కొరకు అని తయారీదారు చెబుతున్నారు. ఇక గేమింగ్ గురించి చెప్పనక్కరలేదు.తొందరలోనే అందుబాటులోకి రాబోతున్న ఈ ఆపరేటింగ్ సిస్టం ఉచితంగా లభించును. పూర్తి సమాచారం ఇక్కడ చూడవచ్చు.

మన రక్తంలో ఇంకిపోయిన సంస్కృతి

 పైరేటెడ్ అన్నది మనకు తెలియంది కాదు. అది అనాదిగా వస్తున్న మన ఆచారం. ఇప్పుడు అది కొత్త పుంతలు తొక్కింది. విడుదలకి ముందే పైరేటెడ్ చేయడం అంటే మామూలు విషయం కాదు. అది బాగా వారికి దగ్గరి వారివల్లే అవుతుంది. అదెలా ఉన్నా సాఫ్ట్ వేర్ పైరసి దీనికి ఎన్నో రెట్లు పెద్దది. దానికి పరిష్కారం ఒక్క ఒపెన్ సోర్స్ మాత్రమే. ప్రజల సమాచారాన్ని నిక్షిప్తం చేసుకున్న ఆధార్ కేంధ్రంలో ఉన్న కంప్యూటర్ లో కూడా పైరేటెడ్ ఆపరేటింగ్ సిస్టం. ముఖ్యంగా ప్రజల బధ్రత కోసం చేపట్టిన ఆధార్ పరమార్ధం నెరవేరినట్లేనా. ఈ చిన్న ఉధాహరణ చాలు మనం ఎక్కడున్నామో చెప్పడానికి.
 ఈ రోజుల్లో ఎన్నో ఆపరేటింగ్ సిస్టం లు మనకి అందుబాటులో ఉన్నాయి. అయినప్పటికి ఇంకా మనం ఆపరేటింగ్ సిస్టం లు కొనుక్కోవలసిన అవసరం తప్పటంలేదు. దీనికి కారణం అనేక అపోహలు, లేని పోని ప్రచారాలు అని వేరే చెప్పక్కరలేదు. ఎన్నో ఉచిత ఆపరేటింగ్ సిస్టం లు మనకి అందుబాటులో ఉన్నప్పటికి పైరేటెడ్ ఆపరేటింగ్ సిస్టం వాడడానికే జనాలు మొగ్గు చూపడం మనం ఒప్పుకోవలసిన విషయం. ధనవంతమైన కంపెనీల మార్కెట్ విస్థరణ ప్రణాళికలలో భాగంగా పైరేటెడ్ ఆపరేటింగ్ సిస్టం వాడుకరులు కంపెనీలకు ప్రచార సాధనాలుగా మారుతున్నారు. పైరేటెడ్ సాఫ్ట్ వేర్ వాడడంలో మనదే అగ్రతాంబూలం అన్నది కఠోర సత్యం. ఉచితంగా దొరుకుతున్న దానిపై మనకు చులకన, దొంగదానిపై మోజు ఎక్కువ. 
 ఇది ఇలా ఉంటే తాము వాడుతున్నది పైరేటెడ్ సాఫ్ట్ వేర్ అని, తామువాడే దానికి ప్రత్యామ్నాయాలు ఉన్నాయని తెలియక చాలామంది పైరేటెడ్ సాఫ్ట్ వేర్ కి గురవుతున్నారు. పైరేటెడ్ సాఫ్ట్ వేర్ కి బలైన వారిని, ఇంకా బలి కాకుండా కాపాడడానికే ఒపెన్ సోర్స్ సాఫ్ట్ వేర్. ఒపెన్ సోర్స్ సాఫ్ట్ వేర్ల గురించి అందరికి తెలుగులో తెలియచెప్పడానికే ఈబ్లాగు. ఈ బ్లాగు ఉపయోగపడగలదని మీకు అనిపించినచో బ్లాగు యొక్క జి+ మరియు ఫేస్ బుక్ పేజిలను అందరికి పంచండి.







వెబ్ పేజిని మొత్తం ఫొటో తియడానికి

 సాధారణంగా మనం కంప్యూటర్ తెరపై ఉన్నదాన్ని ఫోటో తీయడానికి మన కీబోర్డ్ లో ఉన్న ప్రింట్ స్క్రీన్ ను ఉపయోగిస్తుంటాము. మనం ఏదైనా ఒక వెబ్ పేజిని చూస్తున్నపుడు ప్రింట్ స్క్రీన్ ను ఉపయోగించి ఫొటో తీస్తే అది మనకు తెర మీద కనిపించే వెబ్ పేజి యొక్క భాగాన్ని మాత్రమే ఫొటో తీస్తుంది. మనం వెబ్ పేజి మొత్తాన్ని ఫొటో తీయాలంటే ఎలా?
 షట్టర్ అనే ఒపెన్ సోర్స్ సాఫ్ట్ వేర్ ని ఉపయోగించి మనం సులభంగా వెబ్ పేజి మొత్తాన్ని ఫొటో తీయవచ్చు. షట్టర్ అనేది శక్తివంతమైన ఆధునికమైన స్క్రీన్ షాట్లు తీయడానికి ఉపయోగించే సాఫ్ట్ వేర్. దీనిని ఉపయోగించి  పూర్తి డెస్క్ టాప్, విండో, డెస్క్ టాప్ లో ఎంచుకున్న మేర స్క్రీన్ షాట్ తీయడమే కాకుండా తీసిన స్క్రీన్ షాట్లను మనకు కావలసినట్లు మార్చుకొని నేరుగా వివిధ ఆన్ లైన్ ఫొటో వెబ్ సైట్లకి ఎగుమతి చేయవచ్చు. షట్టర్ ని గురించి మరిన్ని వివరాలు ఇక్కడ చూడవచ్చు.
 షట్టర్ ని మనం ఇన్ స్టాల్ చేయునపుడు ఉబుంటు సాఫ్ట్ వేర్ సెంటర్ లో గ్నోం వెబ్ ఫొటో అన్న యాడ్ ఆన్ ని ఎంచుకుని ఇన్ స్టాల్ చేసుకుంటే చాలు. ఎలా అన్నది ఈ చిత్రంలో చూడవచ్చు.
ఉబుంటు సాఫ్ట్ వేర్ సెంటర్ నుండి షట్టర్ ని ఇన్ స్టాల్ చేయడం
 షట్టర్ ని ఇన్ స్టాల్ చేసిన తరువాత క్రింద చిత్రాలలో చూపినట్లు చేయడం ద్వారా మనం మొత్తం వెబ్ పేజిని స్క్రీన్ షాట్ తీయవచ్చు.
షట్టర్
షట్టర్ ని ఉపయోగించి మొత్తం వెబ్ పేజిని స్క్రీన్ షాట్ తీయడం
 మనం వెబ్ బ్రౌసర్ ని ఉపయోగించకుండానే మనకి కావలసిన వెబ్ చిరునామాను ఇక్కడ ఇవ్వడం ద్వారా మొత్తం వెబ్ పేజిని స్క్రీన్ షాట్ తీయవచ్చు. షట్టర్ తోతీసిన పూర్తి వెబ్ పేజిని ఇక్కడ చూడవచ్చు.
షట్టర్ తో తీయబడిన బ్లాగు మొత్తం స్క్రీన్ షాట్

తొందరలో విడుదలకాబోతున్న ఉబుంటు 13.10 వాల్ పేపర్లు

 ఉబుంటు ప్రతి వెర్షన్ తో పాటు కొన్ని వాల్ పేపర్లు డిఫాల్ట్ గా వస్తుంటాయి. వాటిని ఎంపిక చేయడానికి జనాల మధ్య పోటి పెట్టి వచ్చిన వాల్ పేపర్లలో మంచివాటిని ఎంపికచేసి ఉబుంటు సిడీ ఇమేజిలో ఉంచుతారు. వచ్చే నెల 17 న రాబోతున్న ఉబుంటు 13.10 వాల్ పేపర్లని మనం ఇప్పుడే క్రింది లంకెల నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు.
ఉబుంటు 13.10 డిఫాల్ట్ వాల్ పేపర్