ఉచిత ఒపెన్ సోర్స్ ఆండ్రాయిడ్ అప్లికేషన్లు ఇన్ స్టాల్ చేయడానికి

 ఆండ్రాయిడ్ ఫోన్లు మరియు టాబ్లెట్లలో ఒపెన్ సోర్స్ అప్లికేషన్లు ఇన్ స్టాల్ చేయడానికి వాటిని ఆటో అప్ డేట్ చేయడానికి ఉపయోగపడు అప్ స్టోర్ అప్లికేషన్ F-Droid. తాజా వెర్షను F-Droid.apk ఫైల్ ని ఇక్కడ నుండి డౌన్లోడ్ చేసుకొని ఇన్ స్టాల్ చేసుకోవచ్చు. పూర్తిగా ఒపెన్ సోర్స్ అప్లికేషన్లు మాత్రమే దొరకడమే ఈ F-Droid అప్ స్టోర్ ప్రత్యేకత. అంతేకాకుండా గూగుల్ ప్లే స్టోర్ లో స్థానం కోల్పోయిన కొన్ని ఉపయోగపడే అప్లికేషన్లు కూడా దీనిలో దొరుకుతాయి.
F-Droid ఆప్ స్టోర్

మీ అంతర్జాల విహరణం(ఇంటర్ నెట్ బ్రౌజింగ్) వేగవంతం చేసే సాఫ్ట్ వేర్ ఉచితంగా

 మనం అంతర్జాల విహరణం(ఇంటర్ నెట్ బ్రౌజింగ్) చేసినపుడు వెబ్ పేజిలో మనకి కావలసిన విషయం తో పాటు అనేక వ్యాపార ప్రకటనలు(యాడ్స్), పాప్ అప్ లు తెరవబడి మనల్ని విసిగిస్తుంటాయి. అంతేకాకుండా అవి కూడా మన ఇంటర్ నెట్ ని వాడుకోవడం వలన మనకి కావలసిన వెబ్ పేజి నెమ్మదిగా తెరవబడును. ఇంటర్ నెట్ బ్రౌజింగ్ లో ఈ అవాంచిత వ్యాపార ప్రకటనలు(యాడ్స్), పాప్ అప్ లు తొలగించి నట్లయితే మనం మన ఇంటర్ నెట్ బాండ్ విడ్త్ ని మనం పూర్తిగా వాడుకోవచ్చు. ఈ అవాంచిత వ్యాపార ప్రకటనలు(యాడ్స్), పాప్ అప్ లు తొలగించే యాడ్ బ్లాక్ ప్లస్ అను ఒపెన్ సోర్స్ సాఫ్ట్ వేర్ ఉచితంగా పొందవచ్చు. ఈ సాఫ్ట్ వేర్ మనం వాడే వెబ్ విహారిణి(వెబ్ బ్రౌసర్) కి పొడిగింత(యాడ్ ఆన్) లా ఇన్ స్టాల్ చేసుకొని అవాంచిత వ్యాపార ప్రకటనలు లేకుండా చేసుకోవచ్చు. ఈ యాడ్ ఆన్ ఎలా ఉపయోగించాలో ఈ టపాలో వివరించబడింది. ప్రపంచంలో ఎక్కువగా వాడబడుతున్న బ్రౌసర్ యాడ్ ఆన్లలో మెట్టమొదటి స్థానం దీనిదే. ఈ సాఫ్ట్ వేర్ ఫైర్ ఫాక్స్, క్రోం, ఒపెరా, ie వంటి వెబ్ బ్రౌసర్లు మరియు ఆండ్రాయిడ్ లోను ఇన్ స్టాల్ చేసుకోవచ్చు. ఇది పనిచేయు విధానాన్ని క్రింది విడియో లో చూడవచ్చు.

మీ పిల్లలలో విజ్ఞానాన్ని పెంచే సాఫ్ట్ వేర్ ఉచితంగా

 మన కంప్యుటరుని ప్లానిటోరియంగా మార్చుకోవడానికి స్టేల్లారియం అను ఉచిత ఓపెన్ సోర్స్ అనువర్తనం ఉపయోగపడుతుంది. ప్లానిటోరియంలో వలే మన కంప్యుటరునందే స్టేల్లారియంని ఉపయోగించి ఆకాశం, గ్రహాలు, నక్షత్రాలను చూడవచ్చు. పిల్లలకి విజ్ఞానాన్ని పెంపొందించడానికి తోడ్పడును. అన్నిరకాల ఆపరేటింగ్ సిస్టంలలో పనిచేస్తుంది. ఇక ఉబుంటు  వాడేవారు ఉబుంటు సాఫ్ట్వేర్ సెంటర్ నుండి నేరుగా స్తాపించుకోవచ్చు. పూర్తి విశిష్టతలకోసం మరియు డౌన్లోడ్ చేసుకోవడంకోసం స్టేల్లారియం సైటుని దర్శించండి.

ప్రతి రోజు విలువైన ఆండ్రాయిడ్ అప్లికేషన్లు ఉచితంగా మీ కోసం

 ఉచితంగా ఆండ్రాయిడ్ అప్లికేషన్లు లభిస్తున్నప్పటికి కొన్న వెర్షన్లలో ఉన్న అన్ని ఫీచర్లు ఉచిత వెర్షన్లలో పనిచేయవు. అంతేకాకుండా ఉచిత వెర్షన్లలో అనవసరపు ప్రకటనలు(యాడ్) విసిగిస్తుంటాయి. మరి మనం పూర్తి వెర్షన్ని కొనుక్కోవలసిందేనా? 
 అవసరం లేదు. ప్రతి రోజు విలువైన ఆండ్రాయిడ్ అప్లికేషన్లు ఉచితంగా మనం పొందవచ్చు. మనం చేయవలసిందల్లా అమేజాన్ ఆప్ స్టోర్ ని ఇక్కడ నుండి డౌన్లోడ్ చేసుకొని ఇన్ స్టాల్ చేసుకోని, దానిలో నమోదు(రిజిస్టర్) చేసుకోవడమే. అప్పటి నుండి ప్రతి రోజు ఒక కొనే ఆండ్రాయిడ్ అప్లికేషను కొననవసరం లేకుండానే ఉచితంగా పొందవచ్చు. అప్లికేషన్ ని ప్రచారం చేసుకోవడం లో బాగంగా మనకి ఉచితంగా అప్లికేషను అందించబడును. దీనిని ప్లే స్టోర్ కి ప్రత్యామ్నాయంగా వాడుకోవచ్చు.

అమేజాన్ ఆప్ స్టోర్

మీ ఆండ్రాయిడ్ ఫోన్ తో యుట్యూబ్ వీడియోలు డౌన్లోడ్ చేయ్యాలనుకుంటున్నారా?

 సాధారణంగా ఆండ్రాయిడ్ ఫోన్ వాడేవారు గూగుల్ ప్లే లో వెతికి సులభంగా ఎన్నో రకాల అప్లికేషన్లు ఉచితంగా ఇన్ స్టాల్ చేసుకుంటారు. కాని గూగుల్ నిబంధనల వల్ల ప్లే స్టోర్ నుండి యుట్యూబ్ వీడియో డౌన్లోడర్ అప్లికేషన్లు తొలగించబడినాయి. యుట్యూబ్ వీడియో డౌన్లోడర్ ఫర్ ఆండ్రాయిడ్ అన్న అప్లికేషన్ ఇన్ స్టాల్ చేసుకోవడం ద్వారా మనం  యుట్యూబ్ వీడియోలు డౌన్ లోడ్ చేసుకోవచ్చు. 



 యుట్యూబ్ వీడియో డౌన్లోడర్ ఫర్ ఆండ్రాయిడ్ .apk అన్న ఫైల్ని పై లింకు నుండి డౌన్లోడ్ చేసుకోవాలి. ఈ అప్లికేషన్ ఆండ్రాయిడ్ 3 మరియు తదుపరి వెర్షన్లలో పనిచేస్తుంది. ఈ అప్లికేషన్ని ఉపయోగించి యుట్యూబ్ లో వీడియోలు ఏఏ ఫార్మాట్లలో అందుబాటులో ఉన్నాయో ఆయా ఫార్మాట్లలో మనం వీడియోలు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా వీడియో నుండి ఆడియోని వేరుచేసి mp3 గా మార్చుకోవచ్చు.  
  "allow installing apps from unknown sources other than Google play" అన్న ఆప్షన్ని ఎంచుకొని తరువాత పైన డౌన్లోడ్ చేసుకొన్న .apk ఫైల్ని ఇన్ స్టాల్ చేసుకోవాలి. యుట్యూబ్ వీడియో డౌన్లోడర్ ఫర్ ఆండ్రాయిడ్ ని ఏదైనా అప్లికేషన్ యొక్క షేర్ ఆప్షన్లో నుండి తెరవవచ్చు. క్రింది చిత్రంలో చూపినట్లు యుట్యూబ్ వీడియోలు డౌన్లోడ్ చేసుకోవచ్చు.

యుట్యూబ్ వీడియో డౌన్లోడర్ ఫర్ ఆండ్రాయిడ్ పనిచేయు విధానము