వియల్సి ప్లేయర్ గురించి సరదా వీడియో

 వియల్సి ప్లేయర్ గురించి కంప్యూటర్ వాడేవారికి పరిచయం చెయనవసరం లేదు. ఎందుకంటే అంతగా ప్రసిధ్ది చెందినది ఈ ఉచిత స్వేచ్ఛా సాఫ్ట్‌వేర్. దాని గురించిన ఒక సరదా వీడియో మీకోసం.

విద్యార్ధులకి, ఉపాధ్యాయులకి మరియు పరిశోధకులకి ఉపయోగపడే ఉచిత సాఫ్ట్ వేర్

  మానవాళి మనుగడకు ఆయువు పట్టయిన జీవశాస్త్ర ప్రయోగాలు కొత్తపుంతలు తొక్కుతున్న ఈ రోజుల్లో ప్రయోగాలు మనిషి కంటికి కనిపించని సూక్ష్మ స్థాయిలో జరుగుతున్నాయి. సూక్ష్మ స్థాయి అణునిర్మాణలను మన కళ్ళ ముందు ఆవిష్కరించే ఈ ఉచిత సాఫ్ట్ వేర్ విద్యార్ధులకి, ఉపాధ్యాయులకి మరియు పరిశోధకులకి ఉపయోగపడుతుంది. ప్రముఖ 3D మోడలింగ్ ఉచిత స్వేచ్ఛా సాఫ్ట్‌వేర్ అయిన బ్లెండర్ పై నిర్నించిన ఈ బయో బ్లెండర్ కూడా ఉచిత స్వేచ్ఛా సాఫ్ట్‌వేర్. జీవ రసాయన విద్యార్ధులకి, ఉపాధ్యాయులకి మరియు పరిశోధకులకి ఉపయోగపడే విధంగా రూపొందించబడినది. బయో బ్లెండర్ ని ఉపయోగించి శాస్త్రీయ సమాచారం ఆధారంగా ఉన్నత ప్రమాణాలతో 3D అణు ఆకృతులను నిర్మించవచ్చు. అంతేకాకుండా విశ్వవ్యాప్త శాస్త్రజ్ఞుల మరియు పరిశోధకులచే ఏర్పరచబడిన ప్రపంచంలో అతి పెద్ద ప్రోటీన్ల సమాచార బాండాగారం అయిన ప్రోటీన్ డాటా బ్యాంక్ నుండి నేరుగా అణు ఆకృతులని నిర్మాణాలని వాటి సాంకేత పదం ఆధారంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అణు నిర్మాణం, అమరికల ఆధారంగా అణు ధర్మాలను వాటి కదలికలను విశ్లేషించవచ్చు. బయో బ్లెండర్ని ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు.



ప్రోటీన్ల సమాచార బాండాగారం (ప్రోటీన్ డాటా బ్యాంక్)

 ప్రోటీన్ల సమాచార బాండాగారం (ప్రోటీన్ డాటా బ్యాంక్) లేదా www.pdb.org అనేది వివిధ రకాల ప్రోటీన్లు, ఎంజైములు,డిఎన్ఎ, ఆర్ ఎన్ ఎ మరియు సంక్లిష్ట అణు నిర్మాణాలను గురించి, వాటి నిర్మాణం మరియు వాటి అమరికల గూర్చి వివరించే సమాచారాన్ని కలిగి ఉన్న ఆన్ లైన్ నిధి. ఇక్కడ విద్యార్ధులకి, ఉపాధ్యాయులకి మరియు పరిశోధకులకి ఉపయోగపడే విలువైన సమాచారం పొందుపరచబడిఉంది. విశ్వవ్యాప్త శాస్త్రజ్ఞుల మరియు పరిశోధకులచే ఏర్పరచబడిన ప్రపంచంలో అతి పెద్ద ప్రోటీన్ల సమాచార బాండాగారం అయిన ప్రోటీన్ డాటా బ్యాంక్ నందు ఇప్పటివరకు 93624 అణువుల నిర్మాణాలు చేర్చబడ్డాయి. మనకి కావలసిన అణువులను సులభంగా వెతకడానికి అనువుగా అమర్చారు. అణువులలో పరమాణువుల వరసలను, వాటి అమరికని, ముడుతలని 3D గా చూడవచ్చు, వాటిని విశ్లేషించవచ్చు మరియు ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్రోటీన్ డాటా బ్యాంక్ నుండి డౌన్లోడ్ చేసుకోన్న .pdb ఫైళ్ళను బయో బ్లెండర్ అను ఉచిత స్వేచ్ఛా సాఫ్ట్‌వేర్ ని ఉపయోగించి విశ్లేషించవచ్చు, మార్చవచ్చు. ఇక్కడ ఉన్న సమాచారం ఉపాధ్యాయులు, విద్యార్ధులకి ఆసక్తి కలిగే విధంగా బోధించడానికి కూడా ఉపయోగపడుతుంది.
మానవ హిమోగ్లోబిన్

కొత్తగా రాబోతున్న ఆండ్రాయిడ్ వెర్షన్ కిట్ కాట్

  ప్రపంచంలో ఎక్కువగా వాడబడుతున్న మొబైల్ ఆపరేటింగ్ సిస్టం ఆండ్రాయిడ్. గూగులోడు ఆండ్రాయిడ్ వెర్షన్ ప్రతిదానికి ఏదో ఒక తినుబండారం పేరు పెడుతుండడం మనకి తెలిసిందే. ఆండ్రాయిడ్ 4.1 (జెల్లి బీన్) తరువాత 5.0(కి లైం పీ) అని రకరకాల ఉహాగానాలు వచ్చాయి. కాని తరువాతి వెర్షన్లని ఆండ్రాయిడ్ 4.2 మరియు 4.3 వెర్షన్లను జెల్లి బీన్ గానే విడుదలచేసారు. తరువాతి వెర్షను కూడా 5.0 కాకుండా 4.4 కిట్ కాట్ అని ప్రకటించారు. ఏ ఆండ్రాయిడ్ వెర్షన్ కి ఏ తినుబండారం పేరు పెట్టారో ఇక్కడ చూడవచ్చు.

ఉచిత విద్యా వనరులు

 భారత ప్రభుత్వ మానవవనరుల మంత్రిత్వశాఖ వారు జాతియ ఉచిత విద్యా వనరుల భాండాగారాన్ని ఏర్పాటు చేసారు. నిర్మాణంలో ఉన్న ఈ డిజిటల్ భాండాగారం యొక్క ముఖ్య ఉధ్దేశము పాఠశాల విద్యార్థులు మరియు  ఉపాధ్యాయులు   కోసం అన్ని తరగతులు వారికి అన్ని విషయాలను బోధించడానికి అనువైన వనరులని ఉచితంగా ఒకేచోట అందరికి అందుబాటులో తీసుకురావడం. వీడియో, ఆడియో వంటి వివిధ డిజిటల్ రూపాల్లో ఉన్న పాఠ్యాంశాలను ఒక్క దగ్గరకి చేర్చి వెతకడానికి సులభంగా అమర్చి ఆన్ లైన్ లో అందుబాటులో ఉంచుతారు. అందుకు వివిధ సబ్జెక్టులలో నిపుణుల మరియు ఉపాధ్యాయుల సహకారం కోరుతున్నారు. ఆసక్తి గలవారు వివరాలకు ఇక్కడ చూడండి.

జాతియ ఉచిత విద్యా వనరుల భాండాగారం