బెస్ట్ సీడి/డీవీడి/బీడి రైటింగ్ సాఫ్ట్ వేర్

 K3b(కెడె బర్న్ బెబి బర్న్) అనేది ఉబుంటు మరియు అన్ని లినక్స్ ఆధారిత ఆపరేటింగ్ సిస్టం లకి మంచి డిస్క్ రైటింగ్ సాఫ్ట్ వేర్. నీరో లాంటి వాణిజ్యపరమైన సాఫ్ట్ వేర్ ల కి దీటుగా పని చేస్తుంది.ఇది ఫైర్ ఫాక్స్,ఉబుంటు,వియల్సి ల వలె ఉచిత మరియు ఓపెన్ సోర్స్ సాఫ్ట్ వేర్. ఉబుంటుసాఫ్ట్ వేర్ సెంటర్ నుండి నేరుగా స్థాపించుకోవచ్చు 
    

విశిష్టతలు:

  • సీడి,డీవీడి,బ్లూరే మద్దతు
  • డాటా డిస్క్ తయారి
  • ఆడియో డిస్క్ తయారి
  • వీడియో డిస్క్ తయారి
  • డాటా మరియు ఆడియో డిస్క్ తయారి(Mixed Mode CD)
  • eMovix తయారి
  • డిస్క్ నకలు తీయుట
  • డిస్క్ ను చెరిపివేయుట
  • ISO ఇమేజ్ మద్దతు

కావలసినవన్ని ఒకేసారి

 ఉబుంటు ఇన్ స్టాల్ చేసిన తరువాత ఇన్ స్టాల్ చేయవలసిన అనువర్తనాలు,మీడియా కోడాక్ లన్ని సులభంగా ఒకేసారి ఇన్ స్టాల్ చేసుకోవడానికి బ్లీడింగ్ ఎడ్జ్ అనే ఈ చిన్న స్క్రిప్ట్ ఉపయోగపడుతుంది. మొదట ఇక్కడ నుండి స్క్రిప్ట్ ని డౌన్లోడ్ చేసుకొని దానిని క్రింద చూపించినట్లుగా రన్ చేయాలి.డౌన్లోడ్ చేసుకొన్న ఫైల్ (BleedingEdge12_4_19.sh) ప్రాపర్టీస్ లో పర్మిషన్ టాబ్ లో ఎక్సిక్యూట్ ని ఎంచుకొని ప్రాపర్టీస్ విండో ని ముసివేయాలి.తరువాత బ్లీడింగ్ ఎడ్జ్ ఫైల్ ని డబుల్ క్లిక్ చేసినపుడు రెండవ చిత్రములో చూపినట్లుగా అడుగును.అపుడు Run In Terminal ని నొక్కవలెను.


కావలసిన సాఫ్ట్వేర్లను ఎంచుకొని OK నొక్కినపుడు సాఫ్ట్వేర్లన్ని ఇన్ స్టాల్ అవుతాయి.

ఉబుంటు చేతిపుస్తకం

 ఉబుంటు 12.04 ని వాడు విధానము అనే ఈ చేతి పుస్తకం ఉబుంటు ఆపరేటింగ్ సిస్టం గురించి చాలా సులభమైన పద్దతి లో బొమ్మలతో వివరిస్తుంది.మీరు కంప్యూటర్ పై రోజువారీ చేసే పనులను ఉబుంటు లో ఎలా చేయాలో వివరిస్తుంది. దీనిని అన్ని వర్గాల వారికీ అర్థం అయ్యేట్లు వ్రాసారు.ఈ పుస్తకమును ఓపెన్ సోర్సు లైసెన్స్ లో ఉబుంటు కమ్యూనిటీ సభ్యులు వ్రాసారు.అందువల్ల మీరు దీన్ని ఉచితంగా వాడుకోవచ్చు.అంతేకాకుండా మీకు నచ్చినన్ని సార్లు  దిగుమతి చేసుకోవచ్చు,మనకు నచ్చినట్లు మార్చుకోవచ్చు,అందరితో పంచుకోవచ్చు.


                         ఉబుంటు 12.04 చేతి పుస్తకం డౌన్లోడ్


ఈ చేతి పుస్తకాన్ని మీ స్తానిక భాషలో చూడాలనుకుంటే మీరు అయినా ఇక్కడ చేరి అనువదించవచ్చు.

చిటికలో పిడిఎఫ్ ఫైల్ ని తయారుచేసుకోండి

  పిడిఎఫ్ ఫైళ్ళను తయారుచేయడానికి రకరకాల పద్దతులు వాడుతుంటాము.ఉబుంటు వాడేవారు ఎటువంటి సాఫ్ట్వేర్లు అధనంగా ఇన్ స్టాల్ చేయనక్కరలేకుండానే ఈవీడియోలో చూపించినట్లు చిటికలో చాలా సులభంగా పిడిఎఫ్ ఫైల్ ని తయారుచేసుకోవచ్చు.

గూగుల్ క్రోం

 ప్రస్తుతం ప్రపంచంలో ఎక్కువగా వాడబడుతున్న వెబ్ బ్రౌసర్ గూగుల్ క్రోం.లినక్స్ ఆపరేటింగ్ సిస్టం వాడేవారికోసం కూడా గూగుల్ వారు గూగుల్ క్రోం వెబ్ బ్రౌసర్ ని అందుబాటులో ఉంచారు.దీనిని గూగుల్ క్రోం డౌన్లోడ్ పేజి నుండి డౌన్లోడ్ చేసుకొని ఇన్ స్టాల్ చేసుకోవచ్చు.
క్రోమియం                                                                         క్రోం

 అయితే మరి ఈ క్రోమియం ఏమిటి?
క్రోమియం వెబ్ బ్రౌసర్ అనేది గూగుల్ క్రోం ఆదారిత ఓపెన్ సోర్స్ వెబ్ బ్రౌసర్.దీనిని మనం ఉబుంటు సాఫ్ట్వేర్ సెంటర్ నుండి ఇన్ స్టాల్ చేసుకోవచ్చు.ఇది గూగుల్ క్రోం కి ప్రతిబింబం లా ఉంటుంది.క్రోం యాడ్ ఆన్లు అన్ని క్రోమియం వెబ్ బ్రౌసర్లో కూడా పనిచేస్తాయి.


ఒపేరా వెబ్ బ్రౌసర్

 ఉబుంటు లో ఒపేరా వెబ్ బ్రౌసర్ ని సులభంగా ఇన్ స్టాల్ చేసుకోవచ్చు.మొదట క్రింద ఉన్న డౌన్లోడ్ లంకె నుండి ఒపేరా వెబ్ బ్రౌసర్ ఇన్ స్టలేషన్ ఫైల్ ని డౌన్లోడ్ చేసుకొవలెను.ఒపేరా వెబ్ బ్రౌసర్ ఇన్ స్టలేషన్ ఫైల్(opera_12.00.1467_i386 .deb) ఈవిధంగా .deb పొడిగింతతో ఉంటుంది.డౌన్లోడ్ చేసుకొన్న అ ఫైల్ ని డబుల్ క్లిక్ చేసినపుడు ఉబుంటు సాఫ్ట్వేర్ సెంటర్ తో తెరుచుకొంటుంది.అపుడు ఇన్ స్టాల్ బటన్ ని నొక్కి పాస్ వర్డ్ ఇచ్చినపుడు ఒపేరా వెబ్ బ్రౌసర్ ఇన్ స్టాల్ అవుతుంది.


 గమనిక:ఒపేరా వెబ్ బ్రౌసర్ లో తెలుగుకు మద్దతు లేదు.

తేలికైన పిడిఎఫ్ రీడర్

  పిడిఎఫ్ ఫైళ్ళను చదువడానికి మనం సాధారణంగా అడోబ్ రీడర్ ని వాడుతుంటాము.ఉబుంటులో ఎటువంటి పిడిఎఫ్ రీడర్ ఇన్ స్టాల్ చేయనవసరం లేకుండానే మనం  పిడిఎఫ్ ఫైళ్ళను చదువుకోవచ్చు. ఉబుంటు లో పిడిఎఫ్ ఫైల్ ని క్లిక్ చేయగానే డాక్యుమెంట్ వ్యూయర్(ఎవిన్స్) అనబడు అనువర్తనము తో పిడిఎఫ్ ఫైల్ తెరవబడును.ఎవిన్స్ గ్నోం డెస్క్ టాప్ ఆదారిత అన్ని లినక్స్ పంపకాలలో అప్రమేయంగా ఉంటుంది.ఇది చాలా తేలికైన,తక్కువ పరిమాణాము గల పిడిఎఫ్ రీడర్.ఎవిన్స్ ని ఉపయోగించి PDF,Postscript,djvu,tiff, dvi,XPS,SyncTex support with gedit మరియు comics books (cbr,cbz,cb7 and cbt) డాక్యుమెంట్లను చదువవచ్చు.
 ఎవిన్స్ విండోస్ మరియు లినక్స్ ఆపరేటింగ్ సిస్టం లలో పనిచేస్తుంది.

భారతీయ భాషలు వ్రాయడానికి

 భారతీయ భాషలు వ్రాయడానికి Indic Input Extension అను ఫైర్ ఫాక్స్ యాడ్ అన్ ఉపయోగపడుతుంది.దీనిని ఉపయోగించి భారతీయ భాషలను ఇన్ స్క్రిప్ట్ మరియు ఫోనిటిక్ పద్దతులలో వ్రాయవచ్చు.దీనిని తెలుగు వాడయిన ప్రసాద్ సుంకరి గారు తయారు చేయడం విశేషం.దీనిని ఇక్కడ నుండి మీ ఫైర్ ఫాక్స్ కి జత చేయవచ్చు.యాడ్ అన్ బార్ లో ఉన్న ఇండిక్ ఇన్ పుట్ మెనూ నుండి ఇన్ పుట్ విధానమును ఎంచుకోవచ్చు.

చివరి అవకాశం

 సిస్టం 76 లాప్ టాప్ మరియు నోకియా N9 ఫోన్ గెలవడానికి చివరి అవకాశం.సమాజానికి సాఫ్ట్వేర్లని ఉచితంగా అందిస్తూనే విలువైన బహుమతులు గెలవవచ్చు.ఉబుంటు అనువర్తనాల తయారీ పోటి(Ubuntu App Creation Contest) ఇంకా పది రోజుల సమయం ఉంది.తెలుగు సాఫ్ట్వేర్ వీరులారా త్వరపడండి.మన సత్తా చూపించే అవకాశం మనముందుంది.కొత్త డెవలపర్లు సహాయం కోసం ఈ వీడియో పాఠాలని చూడండి.

Adding Unity Integration to Your App

Adding Ubuntu One Integration to Your App

Adding Social Media Support to Your App

Adding Multimedia Support to Your App

Packaging your App in Ubuntu

Submitting Your App to the Ubuntu Software Center