తక్కువ ధరలో ఎగువ శ్రేణి ఫీచర్లని అందించి జనాధరణ పొందిన ఆండ్రాయిడ్ ఫోన్ మోటో జి. భారతదేశంలో ఫ్లిప్‌ఫార్ట్ ద్వారా విడుదలైన ఆరునెలల్లో పది లక్షల ఫోన్లు అమ్ముడైన ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 4.3 తో మొదట విడుదలైనది. ఆ తరువాత గత పిబ్రవరిలో ఆండ్రాయిడ్ కిట్‌కాట్ 4.4.2 కి అప్‌డేట్ విడుదలచేసారు. తాజాగా ఇప్పుడు సరికొత్త
ఆండ్రాయిడ్ వెర్షన్ అయిన ఆండ్రాయిడ్ 4.4.4 కిట్‌కాట్ కి అప్‌డేట్ విడుదలైంది. అలాగే మోటో జి కి సోదరుడైన మోటో ఇ కి పది రోజుల క్రిందటే 4.4.4 అప్‌డేట్ విడుదలచేయబడింది.
|
మోటో జి ఆండ్రాయిడ్ కిట్‌కాట్ 4.4.4 |
167 యంబి ఉన్న ఈ అప్‌డేట్ మనం వేగవంతమైన నెట్ ఉన్నప్పుడే అంటే వైఫి లేదా 3జి నెట్ ఉన్నపుడే చేసుకోవలసిఉంటుది. ఈ అప్‌డేట్ లో మన కంటికి కనిపించే మార్పు సరికొత్త ఫోన్ డయలర్ మరియు కాంటాక్ట్స్, వీడియో రికార్డింగ్ చేస్తున్నపుడు మధ్యలో ఆపుకుని మరలా రికార్డింగ్ చేసుకోగలగడం మరియు మోటో సెక్యూరిటీ అలర్ట్ మాత్రమే. మిగిలిన అన్ని మునుపటిలానే ఉంటాయి. అయితే ఫోన్ పనితిరు, బద్రత సంభందించిన విషయాలలో మెరుగుపరిచినట్టు చేంజ్‌లాగ్ లో మనం చూడవచ్చు.
మన ఫోన్‌కి నెట్ అందుబాటులో ఉంటే మనకి అప్‌డేట్ నోటిఫికేషన్ వస్తుంది. లేకపోతే మనం సెట్టింగ్స్ లో యబౌట్ ఫోన్‌లో సిస్టం అప్‌డేట్ లోకి వెళ్ళినపుడు కొత్త వెర్షన్ అందుబాటులో ఉంది డౌన్‌లోడ్ చేయమంటారా అని చూపిస్తుంది. మనం చేయవలసిందల్లా అడిగినదానికల్లా ఒకే చెయ్యడమే క్రింది చిత్రాలలో చూపించినట్లు.
|
డౌన్‌లోడ్ అయిన తరువాత ఫోన్ రిస్టార్ట్ చేయాలా అని అడుగుతుంది. ఒకేని నొక్కగానే ఫోన్ రిస్టార్ట్ అవుతుంది |
|
రిస్టార్ట్ అయిన తరువాత ఇలాకనిపిస్తుంది |
|
అప్‌డేట్ ఇన్‌స్టాల్ అయిన తరువాత ఫోన్ మళ్ళి రిస్టార్ట్ అయి ఇలా చూపిస్తుంది |
|
ఆకర్షణీయంగా మారిన ఫోన్ పరిచయాలు |
|
కాల్ జాబితా |
|
ఫోన్ డయలర్ |
|
వీడియో రికార్డింగ్ చేసేటప్పుడు కొత్తగా వచ్చిన పాజ్ బటన్ |