గూగుల్, మోటోరోలా సంస్థల బడ్జెట్ ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్ మోటోజి. మొదటిసారిగా ఎగువ శ్రేణి స్పెసిఫికేషన్ గల ఫోన్‌లను మధ్య శ్రేణి ధరలో అందించిన ఫొన్. అంతేకాకుండా గూగుల్ నెక్సస్ పరికరాల తరువాత వేగంగా ఆండ్రాయిడ్ అప్‌డేట్లు విడుదలయ్యే ఫోన్ కూడా ఇదే. విడుదలైనప్పటి నుండి ప్రపంచవ్యాప్తంగా మంచి ఆదరణ పొందిన ఈ ఫోన్
ఆరునెలల క్రితం భారతదేశంలో ఫ్లిప్‌కార్ట్ ద్వారా మాత్రమే ఆన్‌లైన్ అమ్మకాలను మొదలుపెట్టి ఇప్పటివరకు పది లక్షల ఫోన్‌ల మైలురాయిని దాటింది. విడుదలైనప్పటి నుండి ఒకటే ధరతో అమ్ముడు పోవడం, ఫ్లిప్‌కార్ట్ లో అత్యధిక సానుకూల రివ్యూలు రావడం వంటి విశేషాలు ఈ ఫోన్ సొంతం. నాణ్యత ఉంటే ప్రచారం అవసరం లేకుండానే ప్రజలు ఆధరిస్తారనడానికి మోటో జి అమ్మకాలు చక్కటి ఉధాహరణ. అయితే ఈనెల 22న రాబోతున్న క్సయోమి మి3 మరియు క్సయోమికి చెందిన మరో రెండు ఫోన్‌ల వలన మోటో జి అమ్మకాలు నెమ్మదించే అవకాశాలు ఉన్నాయి.

ఫ్లిప్‌ఫార్ట్‌లో పది లక్షల మోటోజి ఫోన్‌ల అమ్మకాలు పూర్తయిన సందర్బంగా పెట్టిన ఆఫర్ |