చైనా ఆపిల్‌గా పిలవబడే Xiaomi విడుదలచేసిన Mi3 ఇంకా భారతదేశంలో వినియోగదారులను చేరుకోకుండానే(ఈ రోజు నుండి ప్‌కార్ట్ అమ్మకాలు మొదలైనాయి. మొదలైన 39 నిమిషాలలోనే స్టాక్ అయిపోయింది.) మరో రెండు చవక ఫోన్‌లను విడుదలచేయడానికి రంగం సిద్దం చేసుకుంది. ఈ ఫోన్‌లు కూడా ధర తక్కువగా ఉండి మంచి స్పెసిఫికేషన్‌తో
రాబోతున్నాయి. స్పెసిఫికేషన్లు మరియు ధర పరంగా చూస్తే ఫోన్లు చాలా బాగున్నట్టే కాని వాటి వాస్తవ పనితీరు, నాణ్యత ఎలాఉందో విడుదలైతే కాని చెప్పలేం.
రాబోతున్నాయి. స్పెసిఫికేషన్లు మరియు ధర పరంగా చూస్తే ఫోన్లు చాలా బాగున్నట్టే కాని వాటి వాస్తవ పనితీరు, నాణ్యత ఎలాఉందో విడుదలైతే కాని చెప్పలేం.
- ధర 6999/-
- 1.6 GHz క్వాడ్రకోర్ క్వాలకం స్మార్ట్‌డ్రాగన్ 400 సిపియు, ఆడ్రినో 305 జిపియు.
- 1జిబి రామ్, 8 జిబి ప్లాష్ మెమోరీ, 64 జిబి వరకు యస్‌డి కార్డ్ కి మద్దతు
- 4.7 ఇంచుల ఐపియస్ తాకే తెర, రిజొల్యూషన్ 1280 x 720, 312 ppi
- 2000 యమ్‌ఎహెచ్ లిథియం ఆయాన్ బ్యాటరీ.
- డ్యూయల్ సిమ్ (జియెస్‌యమ్+సిడియెమ్‌ఎ)
- ముందు 1.6, వెనుక 8 మెగాపిక్సెళ్ళ కెమేరా ప్లాష్‌తో
- యుయస్‌బి ఒటిజి
Redmi Note:
Redmi Note |
- ధర 9999/-
- 1.7 GHz ఆక్టకోర్ మీడియా టెక్ సిపియు, ఎఆర్‌యం మాలి 450 జిపియు
- 2 జిబి రామ్, 8 జిబి మెమోరీ, యస్‌డికార్డ్ 32 జిబి వరకు మద్దతు
- 5.5 ఇంచుల ఐపియస్ తాకే తెర, రిజొల్యూషన్ 1280 x 720
- 3100 యమ్‌ఎహెచ్ లిథియం పాలిమర్ బ్యాటరీ.
- డ్యూయల్ సిమ్ (జియెస్‌యమ్+సిడియెమ్‌ఎ)
- ముందు 5 , వెనుక 13 మెగాపిక్సెళ్ళ కెమేరా ప్లాష్‌తో
- యుయస్‌బి ఒటిజి