ఉబుంటు వాడేవారు స్కైప్ 2.2 నుండి నేరుగా 4.0 కి అప్డేట్ చేసుకోవడానికి అవకాశం లేదు. అందువలన మొదట స్కైప్ 2.2ని పూర్తిగా తొలగించిన తరువాత ఇక్కడ నుండి స్కైప్ 4.0 ని దింపుకొని ఇన్ స్టాల్ చేసుకోవాలి. స్కైప్ 4.0 ఇన్ స్టాలేషన్ ఫైల్ skype-ubuntu_4.0.0.7-1_i386.deb ఈ విధంగా .deb పొడిగింతతో ఉంటుంది. ఈఫైల్ ని
డబుల్ క్లిక్ చేసినపుడు క్రింది చిత్రంలో వలె ఉబుంటు సాఫ్ట్వేర్ సెంటర్ తో తెరుచుకొంటుంది.
అపుడు ఇన్ స్టాల్ ని నొక్కినపుడు సిస్టము పాస్వర్డ్ అడుగును. పాస్ వర్డ్ ఇచ్చినపుడు స్కైప్ ఇన్స్టాల్ అవుతుంది.డబుల్ క్లిక్ చేసినపుడు క్రింది చిత్రంలో వలె ఉబుంటు సాఫ్ట్వేర్ సెంటర్ తో తెరుచుకొంటుంది.