ఉబుంటు
లో యునిటీ డెస్క్ టాప్ అప్రమేయంగా వాడబడుతుంది. యునిటీ వచ్చిన తరువాత
డెస్క్ టాప్ ని మనకు నచ్చినట్లు మార్చుకోవడానికి అవకాశం
తగ్గింది. ఉబుంటు 12.04 లో యునిటీ అదనపు విశిష్టతలతో పాటు మరింతమెరుగ్గా, వాడుటకు సరళంగా మరియు మరింత స్థిరంగా తీర్చిదిద్దారు. అంతేకాకుండా వాడుకరి
మార్చుకోవడానికి కొంత వెసులుబాటు కూడా కల్పించారు.
మార్చుకోవడానికి కొంత వెసులుబాటు కూడా కల్పించారు.
System
settings -> Appearance లో పైన చిత్రాలలో చూపినట్లు ధీం
మార్చుకోవడానికి, లాంచర్ పరిమాణాన్ని మార్చుకోవడానికి మరియు లాంచర్ యొక్క
ప్రవర్తన మార్చుకోవడానికి కొంత అవకాశం కల్పించారు. కానీ యునిటీ డెస్క్ టాప్
ని పూర్తిగా మనకు నచ్చినట్లు మార్చుకోవడానికి ఇతర అనువర్తనాలను
వాడావలసిందే. అందుబాటు లో ఉన్న వాటిలో సులభమైనది మై యునిటీ. దీనిని
ఉబుంటు సాప్ట్వేర్ సెంటర్ నుండి ఇన్స్టాల్ చేసుకోవచ్చు. దీనిని ఉపయేగించి
లాంచర్, డాష్, పేనల్, డెస్క్ టాప్, ఫాంట్లు మరియు ధీం మనకునచ్చిన విధంగా
మార్చుకోవచ్చు. క్రింది చిత్రాలలో మై యునిటీ ద్వారా మార్చుకోదగ్గ ఇచ్చికాలను
గమనించండి.