కరప్ట్ అయిన కంప్యూటరు నుండి డాటా బ్యాకప్ తీసుకోవడం,ఆపరేటింగ్ సిస్టం డ్రైవ్ పరిమాణాన్ని తగ్గించడం ఎలా?

   ఇప్పుడు వస్తున్న కంప్యూటర్లలో హార్డ్‌డిస్క్ మొత్తం ఒకే డ్రైవ్‌గా ఉండి దానిలోనే ఆపరేటింగ్ సిస్టం ఇన్‌స్టాల్ చేయబడి ఉంటుంది. మనం మన డాటాని కూడా అందులోనే దాచుకోవాల్సి వస్తుంది. ఎప్పుడైనా ఆపరేటింగ్ సిస్టం పనిచేయనపుడు తిరిగి ఇన్‌స్టాల్ చేయించుకోవడానికి వెళ్ళినపుడు డాటా తిరిగి రాదు లేదా డాటా బ్యాకప్ తీయడానికి మరికొంత డబ్బులవుతాయని షాపువాడు అడుగుతుంటాడు. ఇటువంటప్పుడు మనం సులభంగా షాపుకి తీసుకువెళ్ళకుండానే డాటా ఎలా బ్యాకప్ తీసుకోవాలో, అసలు ఈ సమస్య రాకుండా ముందుగానే ఆపరేటింగ్ సిస్టం డ్రైవ్‌ని కుదించుకొని డాటా కోసం మరొక డ్రైవ్‌ని ఏర్పాటుచేసుకొని మనకు కావలసినపుడు మన డాటాకి హానికలగకుండా ఆపరేటింగ్ సిస్టం ఎలా ఇన్‌స్టాల్ చేసుకోవచ్చో ఈ వీడియోలో చూడవచ్చు.

ఆపరేటింగ్ సిస్టం ఇన్‌స్టాల్ చేసుకొనే ముందు తీసుకోవలసిన జాగ్రత్తలు

  సాధారణంగా విండోస్‌తో వచ్చే కంప్యూటర్లలో మరొక ఆపరేటింగ్ సిస్టం ఇన్‌స్టాల్ చెయ్యడానికి చూసినపుడు డాటా మరియు విండోస్ ఆపరేటింగ్ సిస్టం కోల్పోతున్నాము అని ఫిర్యాదు చేస్తూ ఉచిత ఆపరేటింగ్ సిస్టంలను నిందిస్తూ ఉంటారు. మనం ఇన్‌స్టాల్ చేసుకొనే ముందు తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా డాటా మరియు డబ్బులు పెట్టీ కొన్న ఆపరేటింగ్ సిస్టంని కోల్పోకుండా కాపాడుకోవచ్చు. తద్వారా ఇన్‌స్టాలేషన్ సమయంలో మనకి తెలియక ఏదైనా తప్పుగా చేసినప్పటికి మన డాటాని మరియు ఆపరేటింగ్ సిస్టంని ఎలా తిరిగి పొందాలో ఈ వీడియోలో చూడవచ్చు. 

మీ కొత్త కంప్యూటర్లో మీకు నచ్చిన ఆపరేటింగ్ సిస్టం ఇన్‌స్టాల్ అవ్వట్లేదా?

 కొత్తగా కొన్నటువంటి కంప్యూటరులో మనం మునుపటిలా మనకు నచ్చిన ఆపరేటింగ్ సిస్టం ఇన్‌స్టాల్ చెయ్యడానికి ప్రయత్నించినపుడు ఇన్‌స్టాల్ కాకపోవడం ఈమధ్య సాధారణంగా జరుగుతుంది. అదేవిధంగా సీడీ, డీవీడీ మరియు పెన్‌డ్రైవ్‌ల నుండి నేరుగా లైవ్ ఆపరేటింగ్ సిస్టం వాడుకోవడం కూడా సాధ్యం కావడం లేదు. దీనికి కారణం కొత్తగా వస్తున్నటువంటి కంప్యూటర్లలో మనకు బయోస్ సెటప్ లోకి ప్రవేశించడానికి మరియు బూట్ డివైజ్ ని ఎంచుకోవడానికి ఎటువంటి ఆప్షనులు చూపించకుండా నేరుగా విండోస్ లోకి వెళ్ళిపోతు ఉండడం కారణం. మనం వేరే ఆపరేటింగ్ సిస్టం ఇన్‌స్టాల్ చేసుకోవడానికి లేదా లైవ్ ఆపరేటింగ్ సిస్టం వాడుకోవడానికి అడ్డుగా ఉన్న ఈ సమస్యకు పరిష్కారాన్ని ఈ వీడియోలో చూడవచ్చు.

వేగవంతమైన వెబ్‌ బ్రౌజర్ సరికొత్త రూపంతో విడుదలైంది

 వేగవంతమైన మరియు ఉచిత ఒపెన్ సోర్స్ వెబ్‌ బ్రౌజర్ ఇప్పుడు కొత్త ఫీచర్లతో కొత్త వెర్షనుగా విడుదలైంది. అదే ఫైర్‌ఫాక్స్ 29. ఈ వెర్షనులో ఫైర్‌ఫాక్స్ ఆస్ట్రలిస్ అను సరికొత్త రూపంతో విడుదలైంది. మొజిల్లా ఫైర్‌ఫాక్స్ మనకి అన్ని రకములైన ఆపరేటింగ్ సిస్టంలలో పనిచేస్తుంది. అదేవిధంగా తెలుగుతో సహా 80 కి పైగా భాషలలో మనకి అందుబాటులో ఉంది. మనకు కావలసిన ఆపరేటింగ్ సిస్టంకి మనకి కావలసిన భాషలో ఇక్కడ నుండి దిగుమతి చేసుకోవచ్చు.
 
ఫైర్‌ఫాక్స్ కొత్త రూపం ఆస్ట్రలిస్

ఫ్లాష్‌ప్లేయర్ లేకుండానే యుట్యూబ్ వీడియోలు చూడడం ఎలా?

 సాధారణంగా మనం యుట్యూబ్ వీడియోలు చూడడానికి ఫ్లాష్‌ప్లేయర్లను ఇన్‌స్టాల్ చేసుకుంటాము. ఇప్పుడు ప్లాష్‌ప్లేయర్ లేదా ఎటువంటి బ్రౌజర్ ప్లగిన్‌లు ఇన్‌స్టాల్ చేయనక్కరలేకుండానే యుట్యూబ్ వీడియోలను చూసెయ్యవచ్చు. అదెలాగో ఈ వీడియోలో చూడవచ్చు.