ఫోన్ రూట్ చెయ్యబడిందో లేదో తెలుసుకోవడం ఎలా?

 రూట్ చేసిన ఫోన్ కూడా మామూలు ఫొన్ లాగే ఉంటుంది. దానిని గుర్తించడానికి ఫోన్ లో ప్రత్యేకమైన గుర్తులు ఏమి ఉండవు. సాధారణంగా కొత్తగా ఫోన్ కొన్నప్పుడు రూట్ అకౌంట్ లాక్ చేయబడి ఉంటుంది. మనం పాత మొబైల్ వేరే వాళ్ళ దగ్గర నుండి కాని ఆన్ లైన్ లో కాని కొన్నపుడు ఆ మొబైల్ రూట్ చేయబడి ఉందో లేదో తెలుసుకోవాలి. ఎందుకంటే రూట్ చేసిన ఫోన్ లో ఏవైనా హనికర అప్లికేషన్లు (సమాచారాన్ని దొంగిలించే లేదా నాశనం చేసే) ఉంచి మనకి అంటగట్టవచ్చు. లేదా తక్కువ కాన్ఫిగరేషన్ ని ఎక్కువగా చూపించి మోసం చేయవచ్చు. అందువలన సెకండ్ హెండ్ పరికరాలు కొనే ముందు తప్పని సరిగా రూట్ చేయబడి ఉందో లేదొ చూసుకోవాలి. సాధారణంగా రూట్ చేయబడిన ఫోన్ లో "సుపర్ సు" అనే అప్లికేషన్ ఇన్ స్టాల్ చేయబడి ఉంటుంది. దానిని బట్టి మనం రూట్ చేయబడిన ఫోన్ ని గుర్తించవచ్చు. కానీ కొన్ని పద్దతులలో సుపర్ సు ఉండకపోవచ్చు. అలాంటప్పుడు మొబైల్ కాని టాబ్లెట్ కాని రూట్ చేయబడిందో తెలిపే ఈ అప్లికేషన్ ను ఇన్ స్టాల్ చేసి తెలుసుకోవచ్చు. 


 ప్లే స్టోర్ నుండి రూట్ చెకర్ బేసిక్ అన్న అప్లికేషన్ని ఇన్ స్టాల్ చేసుకోవాలి. అప్లికేషన్ ఇన్ స్టాల్ అయిన తరువాత ఆ అప్లికేషన్ని తెరిచి "వెరిఫై రూట్ యాక్సిస్" అన్న బటన్ ని నొక్కితే మనకి మన డివైస్ రూట్ చేయబడిందో లేదో చూపిస్తుంది.

ఆండ్రాయిడ్ రూట్ చేయడం అంటే ఏమిటి? రూట్ చేయడం వలన లాభాలు, నష్టాలు

ఆండ్రాయిడ్ రూట్ చేయడం అంటే ఏమిటి? 

 

  మన కంప్యూటర్లో ఏవిధంగా అయితే అడ్మినిస్ట్రేటర్ మరియు గెస్ట్ అకౌంట్ లు ఉంటాయో అలాగే ఆండ్రాయిడ్ ఫోన్లో కూడా ఉంటాయి. మనకి ఫోన్ తయారీదారుడు అడ్మినిస్ట్రేటర్ అకౌంట్ ని లాక్ చేసి గెస్ట్ అకౌంట్ అనుమతి మాత్రమే ఇస్తాడు. అంటే మనం మన ఫోన్ లో గెస్ట్ అకౌంట్ లోకి మాత్రమే వెళ్ళగలం అన్నమాట. లినక్స్ ఆపరేటింగ్ సిస్టం లో అడ్మినిస్ట్రేటర్ అకౌంట్ ని రూట్ అకౌంట్ అని అంటారు. సిస్టం అడ్మినిస్ట్రేటర్ పనులు చేయాలంటే మనం రూట్ అకౌంట్ కి లాగిన్ కావాల్సిందే. ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం కూడా లినక్స్ ఆధారిత ఆపరేటింగ్ సిస్టం కావడం వలన ఆండ్రాయిడ్ అడ్మినిస్ట్రేటర్ అకౌంట్ ని రూట్ అకౌంట్ అని అంటారు. రూట్ అకౌంట్ లోకి ప్రవేశించేటట్లు మన ఫోన్ ని చేయడమే రూటింగ్. రూటింగ్ చేయడం వలన ఆపరేటింగ్ సిస్టం ఫైళ్ళను కూడా మనం మార్చవచ్చు.

రూట్ చేయడం వలన లాభాలు:

 

  • అప్లికేషన్లలో మరియు వెబ్ బ్రౌజర్ లో యాడ్స్ రాకుండా చేయ్యవచ్చు.
  • తెలుగు మరియు మనకు నచ్చిన ఫాంట్లను ఇన్ స్టాల్ చేయవచ్చు.
  • ఫోన్ ప్రాసెసర్ వేగం పెంచడం, బ్యాటరీ పనితీరు మెరుగుపరచడం చేయవచ్చు.
  • ఫోన్ కొన్నఫుడు వచ్చిన థీం మరియు అప్లికేషన్లని తొలగించవచ్చు.
  • రూట్ ఫోన్లలో మాత్రమే పని చేసే అప్లికేషన్లని ఇన్ స్టాల్ చేసుకోవచ్చు.
  • అప్ డేట్లు లేని ఫోన్లకి తాజా వెర్షన్ ఆండ్రాయిడ్ రాం ని ఇన్ స్టాల్ చేసుకోవచ్చు.
  • మనకి నచ్చిన కస్టం రాం ఇన్ స్టాల్ చేసుకోవచ్చు.
  • మనకి నచ్చిన ఐకాన్లని థీం లని ఇన్ స్టాల్ చేసుకోవచ్చు.
  • మన ఫోన్ లేదా టాబ్లెట్ ని పూర్తిగా మన ఆధీనంలోకి తెచ్చుకోవచ్చు.
  • ఫోన్ ఇంటర్నల్ మెమోరీ తక్కువ గా ఉన్నపుడు డీఫాల్ట్ ఆప్స్ కూడా యస్ డి కార్డ్ లోకి మార్చుకోవచ్చు.
  • పెన్ డ్రైవ్ ను ఫోన్ నుండి వాడుకోవచ్చు.

రూట్ చేయడం వలన నష్టాలు:

 

  • రూట్ చేయడం వలన వారెంటీ వర్తించదు. కనుక వారెంటీ గడువు అయిపోయిన తరువాత రూట్ చేసుకోవడం మంచిది.
  • రూట్ చేసేటప్పుడు మన డాటా కోల్పోవచ్చు కనుక డాటా అనగా ఫోన్ నంబర్లు, మెసేజ్ లు అన్ని బాక్ అప్ తీసుకోవాలి.
  • రూట్ చేసేటప్పుడు పొరపాటు జరిగితే ఫోన్ మొత్తానికి పని చేయక పోవచ్చు. కనుక పూర్తిగా తెలిసి ఉంటేనే రూట్ చేయడం ఉత్తమం.

మీ బ్లాగు వీక్షణలను పెంచడానికి

 మీబ్లాగును వీక్షకులకి చేరువచేయడానికి, వీక్షణలను పెంచడానికి మరియు ఆకర్షణీయంగా మార్చుకోవాలను కుంటున్నారా? అయితే ఇది మీకోసమే.
 ఏదైనా ఒక టపాను చూసిన తరువాత దానికి సంబందించిన మరిన్ని టపాలు కనిపించే విధంగా చేయడం ద్వారా వీక్షకులు మన బ్లాగును వదలకుండా చేయవచ్చు. రిలేటెడ్ పోస్ట్స్ అన్న విడ్జెట్ ని మన బ్లాగు టపా చివరన ఉంచడం ద్వారా ఆ టపాకి సంబందించిన ఇతర టపాలను కూడా ఆకర్షణీయంగా వీక్షకుడికి కనిపించేటట్లు చేయడం వలన మన బ్లాగు చూసేవారికి అనుకూలంగా మార్చవచ్చు. తద్వారా బ్లాగు వీక్షణలు పెంచుకోవచ్చు. మనకి వివిధ రకాల రిలేటెడ్ పోస్ట్స్ విడ్జెట్లు అందుబాటులో ఉన్నాయి. వాటిలో ఉత్తమమైనది లింక్ విత్ ఇన్.

ఉచిత స్వేచ్ఛా సాఫ్ట్వేర్లు బ్లాగులో రిలేటెడ్ పోస్ట్స్ విడ్జెట్

 లింక్ విత్ ఇన్ మిగిలిన రిలేటెడ్ పోస్ట్స్ విడ్జెట్ల మాదిరి మనం కావలసిన విధంగా ఎక్కువగా మార్చుకోలేనప్పటికి కూడా ఎటువంటి సైన్ అప్ అవసరం లేకపోవడం, యాడ్స్ లేకపోవడం, వేగంగా లోడ్ అవడం, ఎటువంటి కోడింగ్ పరిజ్ఞానం లేనివారు కూడా అతి తక్కువ సమయంలో సులభంగా ఇన్ స్టాల్ చేసుకోగలగడం మరియు అన్ని రకాల బ్లాగులకు తగిన విధంగా అమరిపోవడం వలన దీని గురించి వ్రాయడం జరిగింది.


  లింక్ విత్ ఇన్ ఇన్ స్టాల్ చేసుకోవడానికి మొదట ఇక్కడ మన బ్లాగు చిరునామా,మన బ్లాగు ఫ్లాట్ ఫామ్ మరియు మెయిల్ ఐడి ని ఇచ్చి గెట్ విడ్జెట్ ని నొక్కాలి. అపుడు క్రింది చిత్రంలో చూపినట్లు వెబ్ పేజి తెరవబడును. ఆ వెబ్ పేజిలో ఇన్ స్టాల్ విడ్జేట్ అన్న లంకెని నొక్కితే మన బ్లాగు లేఅవుట్ సెట్టింగ్స్ కి వెళుతుంది. అక్కడ నుండి విడ్జెట్ ని మనం ఇన్ స్టాల్ చేసుకోవచ్చు.

లింక్ విత్ ఇన్ ఇన్ స్టాల్ చేయు విధానం
 మరెందుకు ఆలస్యం మీ బ్లాగు పేజి వీక్షణలను పెంచుకోండి.

పిల్లలను పెద్దలను ఆకట్టుకునే అధిక నాణ్యత కలిగిన చిన్న యానిమేషన్ సినిమా ఉచితంగా

 ఉబుంటు, బ్లేండర్ మరియు గింప్ వంటి ఉచిత సాఫ్ట్వేర్లను ఉపయోగించి తయారుచేసిన చిన్న యానిమేషన్ సినిమా బిగ్ బక్ బన్ని. అధిక నాణ్యత కలిగిన ఈ సినిమా మాటలు లేనప్పటికి పిల్లలను ఇట్టే ఆకట్టుకుంటుంది. ఈ సినిమాని హెచ్ డి టీవి లో చూస్తే దీని నాణ్యత పెద్దవాళ్ళను కూడా ఆకట్టుకుంటుంది. ఈ సినిమాని ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎటువంటి ఆంక్షలు లేకుండా ఎవరికైనా ఇవ్వవచ్చు. ఇక్కడ నుండి బిగ్ బక్ బన్ని సినిమాను మనకు కావలసిన ఫార్మాట్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు.

 

Mac కేనా డాక్?

 మన సిస్టంలో ఇన్ స్టాల్ చేయ్బడిఉన్న వివిధ అప్లికేషన్లు తెరవడానికి  సాధారణంగా డెస్క్ టాప్ ఇకాన్, మెనూ, టాస్క్ బార్, లాంచర్ వంటి వివిధ పధ్ధతులు వాడుతుంటాము. అప్లికేషన్లు తెరవడానికి తమాషా అయిన కంటికి ఇంపైన మరొక విధానమే డాక్. ఆపిల్ వాడి ఖరీదైన ఆపరేటింగ్ సిస్టం అయిన మాక్ ద్వారా ఈ డాక్ బాగా ప్రసిధ్ది చెందినది. అంత ఖరీదు పెట్టలేని, ఉచిత ఆపరేటింగ్ సిస్టం వాడేవారికి డాక్ లేదా? 
 ఉచితంగా దొరికే డాక్ లు చాలా ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనది కైరో డాక్. ఇది పూర్తిగా ఉచితమే. ఇది ఉచిత స్వేచ్చా సాఫ్ట్ వేర్. ఎవరైనా ఉచితంగా ఇన్ స్టాల్ చేసుకోవచ్చు. ఇది డెబియన్, ఉబుంటు, మింట్, మరియు ఫెడోరా వంటి అన్ని ఉచిత ఆపరేటింగ్ సిస్టం లలో పనిచేస్తుంది. దీనిని మనం వాడుతున్న ఆపరేటింగ్ సిస్టం యొక్క సాఫ్ట్ వేర్ సెంటర్ అప్లికేషన్ నుండి ఇన్ స్టాల్ చేసుకోవచ్చు. కైరో డాక్ కి రకరకాల థీంలు అందుబాటులో ఉన్నాయి. అంతేకాకుండా ఇకాన్లు రూపం,పరిమాణం, కదలికలు, వాటిని నొక్కినపుడు అవి ప్రవర్తించే విధానం మరియు విండో తెరవబడు విధానం వంటి అన్ని లక్షణాలు మనకు నచ్చినట్లు మార్చుకోగలగడం లెక్కలేనన్ని ఆప్షన్లు కలిగి ఉండడం కైరో డాక్ ని మిగిలిన వాటి నుండి ప్రత్యేకంగా నిలబెడుతున్నాయి. కైరో డాక్ తక్కువ కాన్ఫిగరేషన్ గల సిస్టం లలో కూడా బాగా పనిచేస్తుంది.
ఉబుంటులో కైరో డాక్
గ్నోం డెస్క్ టాప్ పై కైరో డాక్