ఉత్తమ మెయిల్ క్లయింట్ ఉచితంగా

 సాధారణంగా ప్రొఫెషనల్ ఆఫీస్ సూట్ తో మాత్రమే మెయిల్ క్లయింట్ వస్తుంది. ఇది ఎంతో ఖర్చుతో కూడుకున్నది. వాణిజ్య మెయిల్ క్లయింట్లకు దీటయిన ప్రత్యామ్నాయంగా తండర్ బర్డ్ అను స్వేచ్ఛా సాఫ్ట్వేర్ని చెప్పుకోవచ్చు. దీనిని ఫైర్ ఫాక్స్ ని తయారుచేసిన లాభాపేక్ష లేని సంస్థ అయిన మొజిల్లా వారు తయారుచేసారు. ఎన్నో విశిష్టతలతో పాటు భద్రత పరంగా కూడా మేటి అయిన ఈ తండర్ బర్డ్ ఉచితంగా లభిస్తుంది. ఉబుంటు లో అప్రమేయంగా ఇది ఇన్ స్టాల్ చేయబడి ఉంటుంది. ఇది మెయిల్ క్లయింట్ గానే కాకుండా RSS ఫీడ్ రీడర్ గాను,అవసరానికి వెబ్ బ్రౌసర్ గా కూడా పనిచేస్తుంది. తండర్ బర్డ్ ని విండోసు, మాక్ మరియు లినక్స్ ఆపరేటింగ్ సిస్టములలో ఇన్ స్టాల్ చేసుకోవచ్చు. ఫైర్ ఫాక్స్ మాదిరిగానే చాలా రకాల యాడ్ ఆన్లు తండర్ బర్డ్ కి కూడా అందుబాటులో ఉన్నాయి.




16 తెలుగు డిక్షనరీలు ఉచితంగా

 ఏదైనా తెలుగు లేదా అంగ్ల పదానికి అర్ధం కావలసినపుడు మనం నిఘంటువు పై ఆధారపడుతుంటాము.దీనికి కొంత సమయం తీసుకుంటుంది.అయితే మనకి కావలసినపుడే చిటికెలో మనకి కావలసిన పదానికి అర్ధం మనముందుంచితె?అదీ ఒకటి కాదు 16 నిఘంటువులను వెతికి మన ముందుఉంచితే?చాల బాగుంటుంది కదు!
 మరెందుకు ఆలస్యం తానా వారి అంధ్ర భారతి తెలుగు నిఘంటువుని చూడండి.ఇక్కడ ఉన్న శోధనలో మనం తెలుగు లేదా అంగ్ల పదాన్ని ఇచ్చినపుడు వెంటనే 16 నిఘంటువులను వెతికి క్షణాల్లో అర్ధాలను మన ముందుంచును.శోధనలో మనం నేరుగా తెలుగులో (ఫోనెటిక్)కూడా టైప్ చేయవచ్చు.మనం అక్షరాలను టైప్ చేస్తుండగానే గూగుల్ మాదిరిగా దానికి సంభందించిన పదాలను చూపిస్తుంది.
 తొందరలో మరిన్ని నిఘంటువులను జతచేయ బోతున్నారు.ఈ పక్రియని వేగవంతం చేయడానికి మన మద్దతు కోరుతున్నారు.రండి మన తెలుగు వారికీ ఎంతో ఉపయోగపడే ఈ తెలుగు నిఘంటువుకి తోడ్పాటునిద్దాం.

తప్పక చూడవలసిన భారత ప్రగతి ద్వారం

 భారత ప్రగతి ద్వారం(India Development Gateway) అనే ఈ వెబ్ పోర్టల్ భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన సమాచార, సాంకేతిక పరిజ్ఞాన శాఖ, భారత ప్రభుత్వం వారి సహకారంతో ప్రగతి సంగణన వికాస కేంద్రం (సి-డాక్, హైదరాబాద్) వారు దీనిని అభివృద్ధి చేస్తున్నారు.భారత ప్రగతి ద్వారం అనే పధకం ద్వారా దేశ  వ్యాప్తంగా గ్రామీణ, సామాజిక అభివృద్ధికి దోహదంచేసే విధంగా బహుళ భాషా వెబ్ పోర్టల్ ను అభివృద్ధి చేస్తున్నారు. ఈ  వెబ్ పోర్టల్ లో  వ్యవసాయం, ప్రాధమిక విద్య, ఆరోగ్యం, ఇ-పాలన, ఇంధన వనరుల రంగాలకు సంబంధించిన సమాచారాన్ని గ్రామీణ ప్రజలకు అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు.

భారత ప్రగతి ద్వారం  అని పిలువబడే ఈ వెబ్ పోర్టల్ నిజ జీవితంలో అందరికీ అవసరమయ్యే , నమ్మకమైన సమాచార ఉత్పత్తులను, సేవలను గ్రామీణ భారతానికి వారి వారి స్థానిక భాషల్లో అందజేస్తుంది.  ఇంటర్నెట్ వాడకం, ఇతర సమాచార పరిజ్ఞాన ఉపకరణాల వాడకం, జ్ఞానాన్ని పంచుకోవడం ద్వారా ప్రజలు వారి జీవనోపాధులను  మెరుగుపరుచుకోవడానికి  ఈ పోర్టల్ అవకాశం కల్పిస్తుంది. 

ప్రస్తుతానికి భారత ప్రగతి ద్వారం  కొన్ని ముఖ్యమైన అంశాలు - అంటే ఆరోగ్యం(నీరు, పారిశుధ్యంతో సహా), ప్రాథమిక విద్య, వ్యవసాయం, గ్రామీణ శక్తి వనరులు, పరిసరాలు, ఇంకా ఇ-పాలన వంటి అంశాలపై దృష్టి సారిస్తోంది. ఈ వెబ్ పోర్టల్  వల్ల గ్రామీణ ప్రజలకూ, ప్రభుత్వానికీ, తదితర సంస్థలకు, ఇంకా విద్యా సంస్థలకు మధ్య ఉండే అంతరాన్ని బాగా తగ్గించవచ్చు అనేది భారత ప్రగతి ద్వారం భావన. గ్రామీణాభివృద్ధిని సాధించడానికి ప్రజలు, సంస్థలు,  అనుభవజ్ఞులు  నలుమూలల నుంచి పరస్పర సహకారంతో అందరూ పాల్గొని పూర్తి ప్రజాస్వామిక, ప్రజామిత్ర సమాచార సాంకేతిక పరిజ్ఞానాన్ని రూపోందించడమే భారత ప్రగతి ద్వారం అంతిమ లక్ష్యం.

భారత ప్రభుత్వ సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ప్రగతి సంగణన వికాస కేంద్రం (సి-డాక్), మార్చి 1988 లో శాస్త్ర, సాంకేతిక సంస్థగా ఏర్పడినది. సి-డాక్ ఒక పరిశోధన మరియు అభివృద్ది సంస్థ. ఇది ఎలక్ట్రానిక్స్, ప్రగతి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీతో పాటు పరమ్ వంటి సూపర్ కంప్యూటర్లకు సంబంధించిన వివిధ ఉత్పత్తులు, పరిష్కారాలను రూపకల్పన చేయడం, అభివృద్ది చేయడం మరియు వాటిని ఉపయోగంలోకి తీసుకు రావడం చేస్తుంది. సి-డాక్ హైదరాబాద్ ఇ-సెక్యూరిటీ, ఇ-లెర్నింగ్, సప్లై చెయిన్ మేనేఙ్ మెంట్, ఓపెన్ సోర్స్ సాప్ట్ వేర్ , వి.యల్.యస్.ఐ మరియు సిస్టమ్స్ డిఙైన్ వంటి వాటి పైన పరిశోధనలు చేస్తుంది.


రైతులకోసం e-వ్యవసాయం

 ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రతిఫలాలను రైతులకు కూడా అందించే సదుద్దేశంతో అంధ్రప్రదేశ్ ప్రభుత్వ వ్యవసాయశాఖ వారు రైతుల కోసం ఒక వెబ్ సైటుని రూపొందించారు.ఎపిఅగ్రిస్ నెట్ అనే ఈ సైటులో రైతులకు ఉపయోగపడే భూసార పరిక్షల  వివరాలు,పంటల సాగులో మెళుకువలు,పంటలకు వాడవలసిన ఎరువులు,రైతుల అనుభవాలు,ఎరువుల ధరలు వంటి అనేక విషయాలను తెలుగులో అందుబాటులో ఉంచారు.

మీ కంప్యూటరులో సంపూర్ణమైన మీడియా సెంటర్ అనుభవం కోసం

 మీ కంప్యూటరుని సంపూర్ణమైన మీడియా సెంటర్ గా మార్చుకోవాలంటే మీరు తప్పనిసరిగా XBMC మీడియా సెంటర్ ని ఇన్ స్టాల్ చేసుకోవలసిందే. XBMC మీడియా సెంటర్ ఉచితంగా లభించే స్వేచ్ఛా సాఫ్ట్వేర్. ఇది లాభాపేక్ష లేని కార్యకర్తల సమూహంచే స్వచ్ఛందంగా అభివృధ్ది చేయబడినది. వాణిజ్య మీడియా సెంటర్ సాఫ్ట్వేర్లు కూడా దీని ముందు దిగదుడుపే. అన్ని రకాల ఆపరేటింగ్ సిస్టములలో ఇన్ స్టాల్ చేసుకోవచ్చు. అన్ని రకాల మీడియా ఫార్మాట్లకు మద్దతు గలదు. సంగీతం, సినిమాలు మరియు ఫొటోలను వివిధ మూలాల నుండి(రిమూవబుల్ మీడీయా, హార్డ్ డిస్క్, నెట్ వర్క్) చూడవచ్చు. మన పనులు సులభతరం చేయడానికి వివిధ రకాల యాడ్ ఆన్ లను కూడా జతచేసుకోవచ్చు.