వీడియోలను పంచుకోవడానికి ఉపయోగపడే వెబ్‌సైట్లలో గూగుల్ వారి యూట్యూబ్‌దే ప్రధమస్థానం. ఇప్పుడు గూగుల్ పిల్లల కోసం ప్రత్యేకంగా యూట్యూబ్ ఆండ్రాయిడ్ అప్లికేషనును అభివృద్ది చేస్తుంది. యూట్యూబ్ కిడ్స్ గా పిలవబడే ఈ అప్లికేషను కేవలం పిల్లలకు ఉపయోగపడే అంటే విద్యని, విజ్ఞానాన్ని మరియు వినోదాన్ని అందించే వీడియోలను మాత్రమే అందిస్తుంది. అంతేకాకుండా
పెద్దలకు మాత్రమే వీడియోలు దీనిలో రావు. ఈ అప్లికేషను యొక్క రూపం కూడా పిల్లలను ఆకట్టుకునేటట్లు ఉండడమే కాకుండా వారు సులువుగా వెతకడానికి అనువుగా, టైప్ చేయనవసరం లేకుండా మాటల ద్వారా కూడా వీడియోలను వెతికే విధంగా ఉండబోతుంది. మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే పిల్లలు ఎంతసేపు వీడియోలు చూడవచ్చునో తల్లిదండ్రులు నియంత్రిచగలగడం.

ఈ యూట్యూబ్ కిడ్స్ ఆండ్రాయిడ్ అప్లికేషను ఈ నెల 23 నుండి ఉచితంగా ప్లేస్టోర్‌లో అందుబాటులోకి రానుంది.