కొన్ని రోజుల క్రితం కొంత మంది వాడుకర్లకి మాత్రమే అందుబాటులోకి వచ్చిన వాట్స్‌యాప్ వాయిస్ కాలింగ్ ఇప్పుడు అందరికి అందుబాటులోకి వచ్చింది. ఈ సదుపాయాన్ని వాడుకోవడానికి మన ఫోనులో వాట్స్‌యాప్ యొక్క సరికొత్త వెర్షను అనగా ప్లేస్టోర్ నుండి ఇన్‌స్టాల్ చేయబడిన 2.11.528 వెర్షను గాని లేదా వాట్స్‌యాప్ వెబ్‌సైటు నుండి
దింపుకొన్న 2.11.531 వెర్షను గాని ఇన్‌స్టాల్ చేయబడి ఉండాలి. అంతేకాకుండా ఇప్పటికే వాయిస్ కాలింగ్ సదుపాయం వాడుతున్నవారు మనకు కాల్ చేయవలసి ఉంటుంది. మొదటిసారి మనం కాల్ అందుకున్న తరువాత ఒక్క చాట్ ఆప్షనును చూపించే అప్లికేషను కాస్తా క్రింది చిత్రంలో చూపించినట్లు కాల్స్, చాట్ మరియు కాంటాట్స్ అని మూడు టాబ్‌లుగా విడిపోతుంది. అప్పటినుండి మనం కూడా వాయిస్ కాలింగ్ సదుపాయాన్ని వాడుకోగలుగుతాము. మనం కాల్ చేసే వారికి కూడా తప్పని సరిగా పైన పేర్కొన్న సరికొత్త వెర్షను ఉండాలి.