మనం అంతర్జాలంలో విహరిస్తున్నపుడు మనకు కావలసిన ఉపయోగపడే సమాచారం కనిపించినపుడు దానిని ముద్రించుకోవడం లేదా మన కంప్యూటరులో బధ్రపరచుకుంటు ఉంటాము. మనం వెబ్ విహరిణి నుండి ముద్రించు కోవాలని చూసినపుడు మనం తరచు ఎదుర్కొనే సమస్య మనకు అవసరం లేని సమాచారంతో(వ్యాపార ప్రకటనలు) సరిగా లేని పేజి అమరికతో ఒక పేజితో పోయేది రెండు మూడు పేజిలు వృధా అవుతుంటాయి. ఇప్పుడు మీరు చదవబోయే చిన్న చిట్కా వలన పొందికైన పేజి అమరికతో పాటు సరిగ్గా సాధికారంగా మనకు కానలసిన సమాచారాన్ని మాత్రమే ముద్రించుకోవడం ద్వారా మనం గణనీయంగా పేజిలు ఆధా చేయవచ్చు. దానివలన పేజి మరియు ముద్రణ వెల తగ్గడంతో పాటు పరోక్షంగా పర్యావరణానికి మేలు చేయవచ్చు. సమాచారాన్ని కంప్యూటరులో బధ్రపరచుకోవాలనుకునే వారు పొందికైన పేజి అమరికతో పాటు సరిగ్గా సాధికారంగా మనకు కానలసిన సమాచారాన్ని మాత్రమే పిడియఫ్ లోకి మార్చుకొని కావలసినపుడు చదువుకోవచ్చు.
మొదట మనం చేయవలసింది http://www.printfriendly.com/browser_tool అను లంకెకు వెళ్ళి ఆక్కడ ఇవ్వబడిన Print Friendly అన్న నీలిరంగు బొత్తాన్ని లాగి మన విహారిణి యొక్క బుక్ మార్క్ పట్టిలో పడవేయాలి. అంతే మన వెబ్ విహారిణి పర్యావరణ హితంగా మారిపోతుంది. మనం ఎదైనా వెబ్ పేజిని మద్రించు కోవాలని గాని బద్రపరుచుకోవాలని అనుకుంటే బుక్ మార్క్ పట్టిలో ఉన్న Print Friendly ని నొక్కితే మన సమాచారం ముద్రించుకోవడానికి అనుగుణంగా మార్చబడుతుంది. మనకు అవసరం లేని సమాచారాన్ని ఒక నొక్కుతో తొలగించుకొని, అక్షరాల పరిమాణాన్ని తగినట్లు మార్చుకొని మన సమాచారాన్ని మాత్రమే మంచి పేజి అమరికతో ముద్రించుకోవడం గాని పిడియఫ్ గా కాని బద్రపరుచుకోవచ్చు లేదా నేరుగా మెయిల్ చేసుకోవచ్చు.