చైనా అధికారిక ఆపరేటింగ్ సిస్టం ?

 అన్ని రంగాలలో అగ్రస్థానానికై పరుగులు పెడుతున్న చైనా కన్ను ఇప్పుడు స్వేచ్ఛా సాఫ్ట్వేర్ల పై పడినట్లుంది. చైనా ప్రభుత్వ సంస్థలైన నెషనల్ యూనివర్సిటి ఆఫ్ డిఫెన్స్ టెక్నాలజి, ది చైనా సాఫ్ట్వేర్ అండ్ ఇన్టిగ్రేటెడ్ చిప్ ప్రమోషన్ సెంటర్ మరియు ప్రపంచ ప్రసిద్ది చెందిన ఒపెన్ సోర్స్ ఆపరేటింగ్ సిస్టం తయారీదారు అయిన కనోనికల్ కార్పోరేషన్ తో పనిచేయడానికి నిర్ణయించుకున్నాయి. రానున్న ఐదు సంవత్సరాల వ్యవధిలో చైనాలో ఒపెన్ సోర్స్ సాఫ్ట్వేర్ల వాడకం పెంచడం వీరి భాగస్వామ్య ముఖ్యోధ్దేశం.
 ఇప్పటికే ఉబుంటు చైనా వెర్షను(ఉబుంటు కైలిన్) అందుబాటులో ఉంది. రాబోయే ఉబుంటు కైలిన్ 13.04 లో చైనా కి తగిన విధంగా అంటే కీ బోర్డ్, కాలెండర్, సెర్చ్ ఇన్జిన్లు వారికి తగినట్లుగా మార్చుతున్నారు. మరి మనోళ్ళు ఎప్పుడు మేల్కొంటారో. లేకపోతే కిటికీల వాడికి గుత్తకి ఇస్తారేమో?