తెలుగు మద్దతు లేని మొబైళ్ళలో కూడా అన్ని తెలుగు వెబ్ సైటులు చూడడానికి

 ఇంతకుముందుతో పోలిస్తే ఇప్పుడు తెలుగులో వెబ్ సైటులు, బ్లాగుల సంఖ్య బాగా పెరగడం దానితో పాటు మొబైల్ ఫోన్లు, మొబైల్ ఇంటర్ నెట్ ఆకర్షణీయమైన ధరలలో అందుబాటులో ఉండడం వలన మొబైల్ నుండి కూడా వెబ్ సైట్లు చూడడం పెరిగింది. ఇక తెలుగు వెబ్ సైట్ల విషయానికొస్తే ఎగువ శ్రేణి మొబైళ్ళు, కొన్ని మధ్య శ్రేణి మొబైళ్ళు తెలుగు అక్షరాలు బానే చూపిస్తున్నాయి. కొన్ని మధ్య శ్రేణి మరియు దిగువ శ్రేణి మొబైళ్ళు, ఇతర దేశాలలో కొన్న మొబైళ్ళు మరియు చైనా మొబైళ్ళలో ఇప్పటికి తెలుగు చూపించలేకపోతున్నాయి. మొబైల్ ఇంటర్ నెట్ వాడుతు వాటిలో తెలుగు చూడలేనివారు, తెలుగుని మొబైళ్ళలో చూడవచ్చని తెలియనివారు ఇప్పటికి చాలామంది ఉన్నారు. ఇప్పుడు మనం తెలుసుకొబోయే చిన్న చిట్కా పాతదే అందరికి తెలిసినదే అయినప్పటికి తెలియనివారికి ఉపయోగపడుతుందని వ్రాయడం జరిగింది.
తెలుగు అక్షరాలు గడులుగా కనిపించడం

 ఒపెరా మిని దిగువ శ్రేణి మొబైళ్ళలో డిఫాల్ట్ వెబ్ బ్రౌసర్ గా వస్తుంది. ఈ మొబైల్ వెబ్ బ్రౌసర్ దాదాపు అన్ని మొబైల్ ఫ్లాట్ ఫాం(జావా, ఆండ్రాయిడ్, సింబియాన్, బడా) లలో పనిచేస్తుంది. అంతేకాకుండా చాలా మొబైళ్ళకు లభిస్తుంది. ఒపెరా మిని వెబ్ బ్రౌసర్ నందు చిన్న సెట్టింగ్ మార్చుకోవడం ద్వారా మనం తెలుగు వెబ్ సైట్లను చూడవచ్చు. మొదట ఒపెరా మిని వెబ్ బ్రౌసర్ అడ్రస్ బార్ నందు opera:config అని టైప్ చేసి ఎంటర్ కొట్టాలి. అప్పుడు తెరవబడిన వెబ్ పేజిలో use bitmap fonts for complex scripts అన్న ఆప్షన్ ఎదురుగా yes ని ఎంచుకొని సేవ్ చేయాలి. తరువాత ఏదైనా తెలుగు అక్షరాలున్న సైటుని తెరిచినపుడు తెలుగు అక్షరాలు సరిగా కనపడడం మనం గమనించవచ్చు.


ఒపెరా మిని లో సెట్టింగ్స్

సెట్టింగ్స్ చేసిన తరువాత తెలుగు అక్షరాలు

ఉచితంగా పిల్లల వినోదం కోసం హెచ్ డి వీడియోలు

 పిల్లలు ఏ విషయాన్నయినా తొందరగా నేర్చుకోవాలంటే అది వారికి ఆసక్తిని రేకెత్తించే విధంగా ఉంటు వినోదాన్నిచ్చేదిగా ఉండాలి. పిల్లలు వినడం, చూడడం ద్వారా నేర్చుకుంటారు. అయితే చూడడం అన్నది వినడం కన్నా ఎక్కువ ప్రభావవంతంగా ఉంటుంది. అందువలన ఈ రోజుల్లో పిల్లలకు పాఠశాలలో కూడా వీడియోలను చూపిస్తు నేర్పిస్తున్నారు. కాని పిల్లలు తొందరగా టీవీలకి అతుక్కుపోయి కార్టున్ లు వంటి వాటికి అలవాటు పడుతున్నారు. ఎందుకంటే అవి వారికి వినోదాన్ని ఇస్తాయి, కాని ఎటువంటి విజ్ఞానాన్ని ఇవ్వవు. మనం వినోదంతో పాటు విజ్ఞానాన్ని కలిపి చూపిస్తే వారు వాటిని ఇష్టంగా చూస్తారు.
 టుటిటు టీవి అనేది ఒక ఆన్ లైన్ చానల్. ఇక్కడ వివిధ వస్తువులు ఎలా నిర్మితమవుతాయో, ఆంగ్ల అక్షరాలు, అంకెలు గురించి టుటిటు పిల్లలకి అర్ధమగు రీతిలో చెబుతుంది. వీడియోలు మంచి నాణ్యతతో ఉండడమే కాకుండా పిల్లలను ఆకట్టుకుంటాయి. వీటి ద్వారా వారు సులభంగా నేర్చుకుంటారు. ఈ చానల్ లో వీడియోలే కాకుండా పిల్లల ఆటలు, వివిధ యాక్టివిటి ఓరియంటెడ్ ఆటలు మరియు బొమ్మలకు రంగులు వేయడం వంటివి కూడా ఉన్నాయి.


టుటిటు రైలు గురించి చెబుతుంది

ఎటువంటి సాఫ్ట్ వేర్ ఇన్స్టాల్ చేయనక్కర లేకుండానే ఆండ్రాయిడ్ ఫోన్లో స్క్రీన్ షాట్ తీయడానికి

 మన ఆండ్రాయిడ్ ఫోన్లో ఎటువంటి సాఫ్ట్వేర్ కొత్తగా ఇన్ స్టాల్ చేయకుండానే స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. పవర్ బటన్ మరియు వాల్యూం డౌన్ బటన్లని రెండింటిని ఒకేసారి నొక్కినపుడు మన ఫోన్ యొక్క తెర ఫొటొ తీయబడుతుంది. ఫొటో తీసినపుడు వచ్చే క్లిక్ మనకు వినిపించును. స్క్రీన్ షాట్ సేవ్ అయినట్టు నోటిఫికేషన్ చూపిస్తుంది. ఆ స్క్రీన్ షాట్ ని మనం గ్యాలరీలోకి వెళ్ళి స్క్రీన్ షాట్స్ అన్న ఫోల్డర్ లో చూడవచ్చు. సాధారణంగా చాల ఫోన్లకి ఇది పనిచేస్తుంది. కొన్ని ఫోన్ లకి హోం బటన్ మరియు పవర్ బటన్ ఒకేసారి నొక్కితే స్క్రీన్ షాట్ సేవ్ అవుతుంది.

బ్లాగులందు పుణ్య బ్లాగులు వేరయా!

 సాంకేతిక పరిజ్ఞానం ఎంతో అభివృధ్ధి చెందిన ఈ రోజుల్లో కూడా మనిషి ఒక అతీత శక్తి పై ఆధారపడుతూనే ఉన్నాడు. ముఖ్యంగా పురాతన ఆధ్యాత్మిక వారసత్వం గల భారతీయులలో ఇది మరి ఎక్కువ. మనిషి ఇప్పుడు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని మరియు ఆధ్యాత్మికతను మేళవించి సేధతీరుతున్నాడు. క్షణం తీరిక లేకపోయినప్పటికి తన ఆధ్యాత్మికచింతనను వివిధ రూపాల్లో వ్యక్త పరుచుకుంటూనే ఉన్నాడు. వీటిలో ఒకరూపం పుణ్యక్షేత్ర సంధర్శన. రవాణా మరియు మౌలిక వసతులు పెరగడం వలన చివరి మజిలీగా ఇంతకు మునుపు భావించిన పుణ్యక్షేత్ర సంధర్శన ఇప్పుడు కడు సులభమైంది. ఆ పుణ్యక్షేత్ర సంధర్శనని మనకు కళ్ళకు కట్టినట్లు తెలుగులో వివరించే ఈ బ్లాగు కూడా ఒక పుణ్యక్షేత్రమే.
 వ్యాపార ప్రకటనలు, ప్రచార పటొపాలు లేకుండా రాజచంద్ర అను ఒత్సాహిక బ్లాగరుచే నిర్వహించబడుతున్న తెలుగు ట్రావెల్ బ్లాగుగా పిలవబడు ఈ వెబ్ బ్లాగు నందు పసిధ్ద  పుణ్యక్షేత్రాల గురించి తెలుగులో సచిత్ర సహితంగా ఉన్నాయి. స్థల పురాణం, చేరుకొనే విధానం, వసతి, చుట్టుప్రక్కల చూడ దగ్గ ప్రధేశాలు వంటి విశేషాలతో ఇక్కడ పుణ్యక్షేత్రాలు కొలువై ఉన్నాయి.

లైక్&షేర్ చేయకుండానే 20 జిబి ఆన్ లైన్ క్లౌడ్ స్టోరేజ్ ఉచితంగా పొందవచ్చు


 టాబ్లెట్లు, ఫోన్లు నుండి ఇంటర్ నెట్ వాడకం వేగంగా పెరుగుతున్న ఈ రోజుల్లో వాటిలో ఉన్న స్టోరేజ్ పరిమితుల వలన  క్లౌడ్ స్టోరేజ్ సేవలు కూడా బాగా ప్రాచూర్యం పొందుతున్నాయి. మనకి ఇప్పుడు వివిధ క్లౌడ్ స్టోరేజ్ సేవలు ఉచితంగా మరియు డబ్బులకి సేవలందిస్తున్నాయి. క్లౌడ్ స్టోరేజ్ లో భద్రపరచిన సమాచారం మనం ఎక్కడ నుండయినా ఏ పరికరం నుండయినా పొందే వెసులుబాటు సౌలభ్యం ఉండడం వలన క్లౌడ్ స్టోరేజ్ ని చాలా మంది ఉపయోగిస్తున్నారు. చాలా సంస్థలు వినియోగధారులను ఆకట్టుకోవడానికి ఉచితంగా కొంత క్లౌడ్ స్టోరేజ్ ని అందిస్తున్నాయి.


ఇప్పడు కాపీ.కాం మనకి 20 జిబి ఆన్ లైన్ క్లౌడ్ స్టోరేజ్ ఉచితంగా అందిస్తున్నది. దాన్ని మనం పొందడం కూడా చాలా సులువు. కాపీ వాళ్ళ సైటు లో నమోదు చేసుకోవడం ద్వారా మనం మొదట 15 జిబిని తరువాత అన్ని ఆపరేటింగ్ సిస్టంలకి మధ్దతును ఇచ్చు కాపీ క్లయింట్ ని ఇన్ స్టాల్ చేసుకోవడం ద్వారా మరో 5 జిబిని అలా మొత్తం 20జిబి ఉచితంగా క్లౌడ్ స్టోరేజ్ సామర్ధ్యం సొంతం చేసుకోవచ్చు.