అతిధి ఖాతా(గెస్ట్ అకౌంట్)ని తొలగించడం ఎలా?

  ఆపరేటింగ్ సిస్టం ఇన్ స్టాల్ చేసినపుడు వాడుకరి ఖాతా తో పాటు విధిగా అతిధి ఖాతా కూడా ఏర్పరుచుకుంటుంది. ఒకవేళ మనసిస్టం నుండి భద్రతా కారణాల రీత్యా అతిధి ఖాతా అవసరం లేదనుకుంటే అతిధి ఖాతాని తొలగించవచ్చు, తిరిగి పొందవచ్చును. ఉబుంటు ఆపరేటింగ్ సిస్టం వాడేవారు క్రింద చూపిన కమాండ్లను టెర్మినల్ లో నడిపి సులభంగా అతిధి ఖాతాని చిటికెలో తొలగించవచ్చు, కావలసినపుడు తిరిగి పొందవచ్చు.

అతిధి ఖాతాని కనిపించకుండా చేయడానికి:

sudo /usr/lib/lightdm/lightdm-set-defaults -l false

అతిధి ఖాతాని తిరిగి కనిపించేలా చేయడానికి

sudo /usr/lib/lightdm/lightdm-set-defaults -l true

ప్రపంచంలో ఎక్కువగా వాడబడుతున్న మూడవ ఆపరేటింగ్ సిస్టం ఉచితంగా డౌన్లోడ్ చేసుకోండి

 ప్రపంచంలో ఎక్కువగా వాడబడుతున్న ఆపరేటింగ్ సిస్టంలలో మూడవది, ఎక్కువగా వాడబడుతున్న ఉచిత ఆపరేటింగ్ సిస్టంలలో  మొదటిది అయిన ఉబుంటు యొక్క సరికొత్త వెర్షను ఈరోజు విడుదలైనది. ఉబుంటు 13.04 ఇప్పటి వరకు వచ్చిన ఉబుంటు వెర్షనులలో వేగవంతమైన, ఆకర్షణీయమైన ఆపరేటింగ్ సిస్టంగా చెప్పవచ్చు. దీనిని ఇక్కడ నుండి నేరుగా  ఉచితంగా దింపుకోచ్చు.




ఉబుంటు 13.04 డెస్క్ టాప్ 32 బిట్ టొరెంట్ డౌన్లోడ్

 డౌన్లోడ్ చేసుకున్న ఆపరేటింగ్ సిస్టం ఇమేజిని ఇక్కడ తెలిపినట్లు చాలా సులభంగా ఇన్ స్టాల్ చేసుకోవచ్చు.



ఇప్పటికే ఉబుంటు వాడుతున్నట్లయితే తిరిగి ఇన్ స్టాల్ చేయనక్కరలేకుండా నేరుగా కొత్త వెర్షనుకి అప్ గ్రేడ్ చేసుకోవచ్చు. 

ఉత్తమ ఉచిత ఆపరేటింగ్ సిస్టం 13.04 విడుదలైంది

 వేలకివేలు పోసి కొనే వాణిజ్య ఆపరేటింగ్ సిస్టం లకి బలమైన ప్రత్యామ్నాయంగా ఎదుగుతున్న ఉబుంటు తరువాతి వెర్షను అయిన ఉబుంటు 13.04 విడుదలైనది. పెద్దమొత్తంలో పనితీరులో మెరుగుదలలతో ఆకర్షణీయమైన, చూడగానే ఆకట్టుకునే రూపంతో సరికొత్త వెర్షన్ సాఫ్ట్వేర్లతో ఉబుంటు 13.04 విడుదలైనది. ఇప్పటి వరకు వచ్చిన ఉబుంటు విడుదలలో స్థిరమైన, వేగవంతమైన, ఆకర్షణీయమైన ఉబుంటు వెర్షనుగా దీనిని చెప్పుకోవచ్చు. ఉబుంటు కొత్త వెర్షనులో మార్పులు క్రింది చిత్రాలలో గమనించవచ్చు.
సరికొత్త ఐకాన్లు
మోనో ఐకాన్ల తో ఫైల్ బ్రౌజర్ నాటిలస్
ఉబుంటు వన్ మెనూ
బ్లూటూత్ మెనూ
Alt+Tab 
డాష్ అనువర్తనాల ప్రివ్యూ
డాష్ స్క్రోల్ బార్
డాష్ ఫైళ్ళ ప్రివ్యూ
సరికొత్త వెర్షను లెబ్రేఆఫీస్
కొత్త వాల్ పేపర్లు
విండోల మద్య త్వరగా విహరించడానికి
సిస్టం ఆపివేయునపుడు
సిస్టం లాగవుట్ చేయునపుడు

ఆండ్రాయిడ్ కి నేరుగా మద్దతు
కొత్త అప్ డేట్ మేనేజర్

మార్చిన ఆన్ లైన్ అకౌంట్లు
  ఉబుంటు 13.04 యొక్క మరిన్ని విశిష్టతలు క్రింది వీడియోలో చూపించబడ్డాయి.

ఉబుంటు ఎన్ని రకాలు?

 ప్రముఖ ఒపెన్ సోర్స్ ఆపరేటింగ్ సిస్టం అయిన ఉబుంటు మనకు వివిధ రకాలుగా అందుబాటులో ఉంది. ఉబుంటు డెస్క్ టాప్, ఉబుంటు సర్వర్, ఉబుంటు టచ్(టాబ్లెట్లు,ఫోన్లు) మరియు ఉబుంటు టివి అని ఆయా పరికరాలకు ఉబుంటు ఆపరేటింగ్ సిస్టం లభిస్తుంది. ఇక ఉబుంటు డెస్క్ టాప్ ఆపరేటింగ్ సిస్టం మనకి 32బిట్ మరియు 64బిట్ లలో లభిస్తుంది. 
 ఇవి కాకుండా ఉబుంటు డెస్క్ టాప్ ఆపరేటింగ్ సిస్టం ని మనం వేరువేరు రూపాలతో వేరువేరు పేర్లతో చూస్తుంటాము. వాటిలో అధికారిక గుర్తింపు పొందినవి.
 ఇవి కాకుండా వివిధ భాషలలో కమ్యూనిటి చే స్థానికీకరణ చేయబడిన, వేరువేరు పనులని ఉద్దేశించి తయారుచేయబడిన వివిధ రూపాంతరాల తో పాటు ఉబుంటు ఆధారిత ఆపరేటింగ్ సిస్టం లు (లినక్స్ మింట్ వంటివి)చాలా ఉన్నాయి. వాటిని గురించి ఇక్కడ చూడవచ్చు.

మీ స్వేచ్ఛను రెట్టింపు చేసుకోండి

 వేలకువేలు వెచ్చించనవసరం లేకుండా ఉచితంగా దొరికే లిబ్రే ఆఫీస్ ప్రముఖ వాణిజ్య ఆఫీస్ అనువర్తనాలకు చక్కని ప్రత్యామ్నాయంగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు లిబ్రే ఆఫీస్ అందించే అన్ని సదుపాయాలను ఇన్ స్టాల్ చేయనవసరం లేకుండానే వాడుకోవచ్చు. మనకు అవసరం వచ్చినపుడు వాడుకోవడానికి అనువుగా తయారుచేయబడిన లిబ్రే ఆఫీస్ పోర్టబుల్ మనతో పాటు పెన్ డ్రైవ్ లో తీసుకుపోయి ఎప్పుడైనా ఎక్కడైనా వాడుకోవచ్చు. లిబ్రే ఆఫీస్ పోర్టబుల్ కూడా ఉచిత స్వేచ్ఛా సాఫ్ట్వేర్. లిబ్రే ఆఫీస్ పోర్టబుల్ ని క్రింది లంకె నుండి దింపుకోవచ్చు.