మీ బ్లాగు లేదా సైటుని పర్యావరణ హితంగా మార్చండి

 ఈ పోస్ట్ మన బ్లాగుని చూసే వారికి సహాయపడే విధంగాను, పర్యావరణానికి మేలు చేయునట్లు బ్లాగుని ఎలా మార్చుకోవాలో వివరిస్తుంది. మన పోస్ట్ లో ఉన్న ఉపయుక్తకరమైన సమాచారం చూసినవారికి నచ్చి దానిని తరువాత చదువుకోవడంకోసం వారు ఆ సమాచారాన్ని దాచుకోవాలనుకుంటే రకరకాల పద్దతులు వాడుతుంటారు. ఎటువంటి ప్రయాస పడకుండా మన బ్లాగులోనే ముద్రించుకోవడం లేదా పిడియఫ్ గా మార్చే బటన్ ని ఉంచడం వలన సమాచారాన్ని సంధర్శకుడు ముద్రించుకోవడం లేదా పిడియఫ్ కి అనుగుణంగా మార్చుకోగలిగితే మన బ్లాగుని చూసే వారికి సహాయపడినట్లే. అంతే కాకుండా ఆ సమాచారాన్ని ముద్రణకి అనువుగా అందించగలిగితే పేజిలను ఆదా చేయడం ద్వారా పర్యావరణానికి మేలుచేసినట్లే. ఈ చిన్న మార్పు మీ బ్లాగులో చేసినట్లయితే చాలా ఉపయోగకరంగా ఉంటుంది. 
 మొదట http://www.printfriendly.com/button అన్న పేజికి వెళ్ళి అక్కడ చూపిన మూడు సోపానాలను పాటించడమే. మనం బ్లాగు అంటే బ్లాగరా, వర్డ్ ప్రెస్ అని ఎంచుకొని, బటన్ నమూనాని ఎంచుకోని, తరువాత ఆ పేజిలో క్రింద ఇవ్వబడిన స్క్రిప్టుని మన సైటు లేదా బ్లాగులో ఉంచడమే. 

ఈవిధంగా వచ్చిన కోడ్ ని క్రింద చూపినట్లు మన బ్లాగుకి చేర్చుకోవాలి.


డాష్ బోర్డ్ - లేఅవుట్ - గాడ్జెట్ని చేర్చు - HTML/Java script లో పైన కాపి తీసుకున్న కోడ్ ని ఉంచి మార్పులని బద్రపరుచుకోవాలి. అంతే ముద్రించుకోవడం లేదా పిడియఫ్ గా మార్చే బటన్ మీబ్లాగు సంధర్శకులకి సేవలందించడానికి సిధ్దంగా ఉన్నట్లే.


ఇలా పోస్ట్ చివరన ముద్రించుకోవడం లేదా పిడియఫ్ గా మార్చే బటన్ వస్తుంది. దానిని నొక్కినపుడు ఇలా బ్లాగు పేజి ముద్రణకు అనువుగా మార్చబడుతుంది.

ఉచిత సాఫ్ట్వేర్ల కర్మాగారం



 సోర్స్ ఫోర్జ్.నెట్ ఎన్నో విజయవంతమైన ఒపెన్ సోర్స్ సాఫ్ట్ వేర్ల తయారీకి నెలవు. సమాజం సహకారంతో అభివృద్ధి చేయబడు ఒపెన్ సోర్స్ సాఫ్ట్ వేర్లకి కావలసిన అన్ని వనరులు అందించడంలో సోర్స్ ఫోర్జ్.నెట్ దే అగ్రస్తానం. సోర్స్ ఫోర్జ్.నెట్ యొక్క సాధనాలని వాడుకొని ఇప్పటికే 3.4 మిలియన్ డెవలపర్లు 324,000 పైగా ప్రాజెక్టులని వృధ్ది చేసారు. ప్రతి రోజు4,000,000 డౌన్లోడ్లతో ఎంతో మందికి సేవలు అందిస్తున్నది సోర్స్ ఫోర్జ్.నెట్.
 సాఫ్ట్వేర్ల పాధమిక దశ అయిన కోడింగ్ నుండి మొదలుకొని అభివ్రుధ్ది చేయడం, ఆ సాఫ్ట్వేర్లని ప్రచూరించేవరకు అన్నిటికి సోర్స్ ఫోర్జ్.నెట్ సమాధానం చెబుతుంది. ఇక్కడ దొరకని ఒపెన్ సోర్స్ సాఫ్ట్వేర్ లేదంటే అతిశయోక్తి కాదేమో. ఎవరైనా తమకు కావలసివ సాఫ్ట్వేర్లు ఇక్కడ నుండి ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు.

విజ్ఞానపు గని వాడుకున్నోడికి వాడుకున్నంత!

 విజ్ఞానం అనేది ఎవరికో సొంతం కాదు అది అందరికి అందుబాటులో ఉండాలని ఒకరిచే మొదలైన ఆ సంకల్పం ఇప్పుడు ప్రపంచంలో అన్ని దిక్కులకు విస్తరించినది. దాని ఫలాలు ఇప్పుడు ప్రతి ఒక్కరు అను నిత్యం ఏప్పుడో ఒకప్పుడు అనుభవిస్తూనే ఉన్నాము. అదే వికిపీడియా. ఏదైనా విషయం గురించి సమాచారం కావాలంటే వికిపీడియా లో వెతుకు అని సాదారణంగా వింటుంటాం,అంటుంటాం. వికీపీడియా అంటే అంతర్జాల విజ్ఞానభాండాగారం. పలువురు కలిసి విజ్ఞాన సమాచారాన్ని సేకరించి అంతర్జాలంలో ఒకచోట భద్రపరచడం. ఈవిధంగా భద్రపరచినదానిని అందరికీ ఉచితంగా వాడుకోవడమే. విషయసేకరణ మరియు అది అందరికీ అందుబాటులో ఉంచడం అనే ప్రక్రియను నిరంతరంగా ప్రవహింపచేయడమే వికీపీడియా లక్ష్యం. ఈ ప్రక్రియను మొదలు పెట్టిన ఘనత జిమ్మీ వేల్స్ అనే అమెరికన్ కు చెందుతుంది. చిన్న చినుకులు కలిసి ఒక మహ సముద్రంగా మారినట్లు ఇప్పుడు వికిపీడియా అనేక ప్రపంచ బాషలలో అనేక వ్యాసాలతో అందుబాటులో ఉంది. సాధారణ వ్యక్తులు కూడా వికీపీడియాలో వ్యాసాలను రాయగలగడంతోబాటు ఇతరులు రాసిన వ్యాసాలలో అక్షర దోషాలను సరిదిద్దడం, అదనపు సమాచారాన్ని జోడించడం మరియు వాణిజ్య ప్రకటనలు లేకపోవడం వంటి అంశాలు దీన్ని ప్రత్యేకంగా నిలబెట్టాయి.
 ఆంగ్లవికీ ప్రారంభమైన రెండేళ్ళ అనంతరం మొదలైన తెలుగు వికీపీడియా ఆరంభంలో అనేక ఆటుపోట్లను ఎదుర్కొంటూ క్రమక్రమంగా వేగం పుంజుకుంది. భారతీయ భాషలలో తెలుగుభాష ఔన్నత్యాన్నీ, ప్రత్యేకతనూ చాటిచెబుతోంది. దీని వెనుక తెలుగు బ్లాగరులు మరియు మనలాంటి సామాన్యుల కృషి కూడా ఉంది. వికీపీడియా తెలుగులో ఉందన్న విషయాన్ని అందరికి తెలియచెప్పడం, మరియు తెలుగు వికీపీడియాకి ప్రచారం కల్పించడం కోసం ఈ ఉగాది సందర్భాన్ని పురష్కరించుకొని తెలుగు వికీపీడియా మహోత్సవం 2013 ఏర్పాటుచేసారు. 
 రేపటి తరానికి ఖచ్చితమైన సమాచారాన్ని ఉచితంగా అందివ్వాలన్న సదుద్దేశ్యంతో నిస్వార్ధంగా కృషి చేస్తున్న  తెలుగు వికీపీడియాని తెలుగు వారందరికి చేరువ చెయవలసిన బాద్యత మనందరిది. రండి బ్లాగు బ్లాగు  కలిపి ప్రచారాన్ని చేద్దాం. సామాజిక అనుసంధాన వేదికలైన ఫేస్ బుక్ ,ట్విట్టర్ మరియు గూగుల్ + లలో కూడా పంచుకోవడం ద్వారా తెలుగు వికీపీడియాని అందరికి చేరువ చేయవచ్చు. దయచేసి విజ్ఞాన ప్రవాహాన్ని ఆపవద్దు.

ఫైర్ ఫాక్స్ 20 విడుదలైంది.


 15వ వార్షికోత్సవం జరుపుకొంటున్న మొజిల్లా ఫౌండేషన్ వారు తమ తదుపరి విడుదలఅయిన ఫైర్ ఫాక్స్ 20 ని విడుదలచేసారు. సరికొత్త డౌన్ లోడ్ మేనేజర్, ప్రవేట్ బ్రౌజింగ్ మరియు పనిచేయడం ఆగిపోయిన ప్లగ్ ఇన్ ల ప్రభావం ఫైర్ ఫాక్స్ మీద పడకుండా వాటిని మూసివేయగలిగిన సామర్ధ్యం వంటి అధనపు విశిష్టతలతో పాటు పనితీరులో మెరుగుదల, HTML5 విశిష్టతలతో తీసుకువచ్చారు.
                         ఫైర్ ఫాక్స్ డౌన్ లోడ్

ఎటువంటి పిసి సూట్ ఆవసరం లేకుండానే మొబైల్ నెట్ ని కంప్యూటర్ లో వాడుకొనేవిధానం

 ఇప్పుడు మొబైల్ లో జి పి ఆర్ ఎస్ లేదా 3G ని ఉపయోగించి నెట్ వాడుకోవడం సాధారణం అయిపోయింది. ఆకర్షణీయమైన డాటా పధకాలు, నెట్ వాడుకోగల మొబైళ్ళు సరసమైన ధరలలో అందుబాటులో ఉండడం మరియు ఎక్కడనుండి అయినా నెట్ ఉపయోగించుకోగలగడం వలన తక్కువ పెట్టుబడి పెట్టగలవారు కూడా ఈ సదుపాయాన్ని వాడుకుంటున్నారు. చాలామంది అదే మొబైల్ నెట్ ని కంప్యూటర్ లో కూడా వాడుకుంటున్నారు. సాధారణంగా ఫోన్ తో పాటు వచ్చే సాఫ్ట్ వేర్ సిడీ (పిసి సూట్) ని ఇన్ స్టాల్ చేసుకొని కంప్యూటర్ లో నెట్ ని పొందవచ్చు. ఆ సాఫ్ట్ వేర్ సిడీలో ఉన్న సాఫ్ట్ వేర్ ఒక్క విండోస్ కి మాత్రమే మధ్దతు గలదు. మరి ఉబుంటు వాడేవారు ఏం చేయాలి?
 ఉబుంటు వాడేవారు ఎటువంటి పిసి సూట్ ఆవసరం లేకుండానే చాలా సులభంగా మొబైల్ నెట్ ని కంప్యూటర్ లో వాడుకొవచ్చు. క్రింది చిత్రాలలో చూపించిన విధంగా అనుసరిస్తే సరి.








 పైన చిత్రాలలో చూపించినట్లు మన సర్వీస్ ప్రొవైడర్ ని ఎంచుకొని సేవ్ చేసుకోవాలి. తరువాత ఫోన్ ని యు యస్ బి కేబుల్ తో కంప్యూటర్ కి అనుసంధానించగానే నోకియా ఫోన్ లో పిసి సూట్ అన్న ఆప్షన్ ని ఆండ్రాయిడ్ ఫోన్ లో అయితే క్రింది చిత్రంలో చూపించినట్లుగా USB tethering అన్న  ఆప్షన్ ని ఎంచుకోవాలి.అపుడు వెంటనే నెట్ వర్క్ అనుసందానించబడినట్లు నోటిఫికేషన్ కనిపించును. అంతే వెబ్ బ్రౌసర్ ని తెరిచి అంతర్జాలం లో విహరించవచ్చు.