ఫైర్ ఫాక్స్ 20 విడుదలైంది.


 15వ వార్షికోత్సవం జరుపుకొంటున్న మొజిల్లా ఫౌండేషన్ వారు తమ తదుపరి విడుదలఅయిన ఫైర్ ఫాక్స్ 20 ని విడుదలచేసారు. సరికొత్త డౌన్ లోడ్ మేనేజర్, ప్రవేట్ బ్రౌజింగ్ మరియు పనిచేయడం ఆగిపోయిన ప్లగ్ ఇన్ ల ప్రభావం ఫైర్ ఫాక్స్ మీద పడకుండా వాటిని మూసివేయగలిగిన సామర్ధ్యం వంటి అధనపు విశిష్టతలతో పాటు పనితీరులో మెరుగుదల, HTML5 విశిష్టతలతో తీసుకువచ్చారు.
                         ఫైర్ ఫాక్స్ డౌన్ లోడ్

ఎటువంటి పిసి సూట్ ఆవసరం లేకుండానే మొబైల్ నెట్ ని కంప్యూటర్ లో వాడుకొనేవిధానం

 ఇప్పుడు మొబైల్ లో జి పి ఆర్ ఎస్ లేదా 3G ని ఉపయోగించి నెట్ వాడుకోవడం సాధారణం అయిపోయింది. ఆకర్షణీయమైన డాటా పధకాలు, నెట్ వాడుకోగల మొబైళ్ళు సరసమైన ధరలలో అందుబాటులో ఉండడం మరియు ఎక్కడనుండి అయినా నెట్ ఉపయోగించుకోగలగడం వలన తక్కువ పెట్టుబడి పెట్టగలవారు కూడా ఈ సదుపాయాన్ని వాడుకుంటున్నారు. చాలామంది అదే మొబైల్ నెట్ ని కంప్యూటర్ లో కూడా వాడుకుంటున్నారు. సాధారణంగా ఫోన్ తో పాటు వచ్చే సాఫ్ట్ వేర్ సిడీ (పిసి సూట్) ని ఇన్ స్టాల్ చేసుకొని కంప్యూటర్ లో నెట్ ని పొందవచ్చు. ఆ సాఫ్ట్ వేర్ సిడీలో ఉన్న సాఫ్ట్ వేర్ ఒక్క విండోస్ కి మాత్రమే మధ్దతు గలదు. మరి ఉబుంటు వాడేవారు ఏం చేయాలి?
 ఉబుంటు వాడేవారు ఎటువంటి పిసి సూట్ ఆవసరం లేకుండానే చాలా సులభంగా మొబైల్ నెట్ ని కంప్యూటర్ లో వాడుకొవచ్చు. క్రింది చిత్రాలలో చూపించిన విధంగా అనుసరిస్తే సరి.








 పైన చిత్రాలలో చూపించినట్లు మన సర్వీస్ ప్రొవైడర్ ని ఎంచుకొని సేవ్ చేసుకోవాలి. తరువాత ఫోన్ ని యు యస్ బి కేబుల్ తో కంప్యూటర్ కి అనుసంధానించగానే నోకియా ఫోన్ లో పిసి సూట్ అన్న ఆప్షన్ ని ఆండ్రాయిడ్ ఫోన్ లో అయితే క్రింది చిత్రంలో చూపించినట్లుగా USB tethering అన్న  ఆప్షన్ ని ఎంచుకోవాలి.అపుడు వెంటనే నెట్ వర్క్ అనుసందానించబడినట్లు నోటిఫికేషన్ కనిపించును. అంతే వెబ్ బ్రౌసర్ ని తెరిచి అంతర్జాలం లో విహరించవచ్చు.

చైనా అధికారిక ఆపరేటింగ్ సిస్టం ?

 అన్ని రంగాలలో అగ్రస్థానానికై పరుగులు పెడుతున్న చైనా కన్ను ఇప్పుడు స్వేచ్ఛా సాఫ్ట్వేర్ల పై పడినట్లుంది. చైనా ప్రభుత్వ సంస్థలైన నెషనల్ యూనివర్సిటి ఆఫ్ డిఫెన్స్ టెక్నాలజి, ది చైనా సాఫ్ట్వేర్ అండ్ ఇన్టిగ్రేటెడ్ చిప్ ప్రమోషన్ సెంటర్ మరియు ప్రపంచ ప్రసిద్ది చెందిన ఒపెన్ సోర్స్ ఆపరేటింగ్ సిస్టం తయారీదారు అయిన కనోనికల్ కార్పోరేషన్ తో పనిచేయడానికి నిర్ణయించుకున్నాయి. రానున్న ఐదు సంవత్సరాల వ్యవధిలో చైనాలో ఒపెన్ సోర్స్ సాఫ్ట్వేర్ల వాడకం పెంచడం వీరి భాగస్వామ్య ముఖ్యోధ్దేశం.
 ఇప్పటికే ఉబుంటు చైనా వెర్షను(ఉబుంటు కైలిన్) అందుబాటులో ఉంది. రాబోయే ఉబుంటు కైలిన్ 13.04 లో చైనా కి తగిన విధంగా అంటే కీ బోర్డ్, కాలెండర్, సెర్చ్ ఇన్జిన్లు వారికి తగినట్లుగా మార్చుతున్నారు. మరి మనోళ్ళు ఎప్పుడు మేల్కొంటారో. లేకపోతే కిటికీల వాడికి గుత్తకి ఇస్తారేమో?

అప్ డేట్స్ అంటే ఏమిటి. వాటి వలన ఉపయోగం ఏంటి?


ఫోన్, టాబ్లెట్ లేదా కంప్యూటర్ ఇలా ప్రతి దానిలోను నెట్ తగిలించగానే అప్ డేట్స్ అందుబాటులో ఉన్నాయి అని తరచు విసిగిస్తుంటాయి. అసలు అప్ డేట్స్ అంటే ఏమిటి. వాటి వలన ఉపయోగం ఏంటి. మనమేం చేయాలి. 
 సాఫ్ట్ వేర్లు విడుదలచేసిన తరువాత తయారీదారు ఆ సాఫ్ట్ వేర్ లో ఉన్న బధ్రతా పరమైన లోపాలను, పనితీరులో లోపాలు సరిచేసి లేదా మరికొన్ని విశిష్టతలను అధనంగా జతచేసి మనకు అప్ డేట్స్ రూపంలో అందిస్తారు. అప్ డేట్స్ ఆపివేస్తే ఆ ప్రయోజనాలను మనం కోల్పోయినట్లే. అప్ డేట్స్ చేసుకోవడం వలన మనకొచ్చే నష్టం ఏమీ ఉండదు లాభం తప్ప. అందువలన నిస్సందేహంగా అప్ డేట్స్ చేసుకోవచ్చు.

షేర్/లైక్ చేయకుండానే 1500 రూ విలువచేసే సాఫ్ట్ వేర్ ఉచితంగా పొందండి


 పైళ్ళను జిప్ చేయడనికి సాధారణంగా మనం ఉపయోగించు సాఫ్ట్ వేర్లు ప్రతి సారి కొనుక్కోమని విసిగిస్తుంటాయి. విరివిగావాడు ఆ సాఫ్ట్ వేర్లు మనం ఖరీదు చేయబోతే పైన చిత్రాలలో మాదిరిగా 1500 రూపాయలకి తక్కువ కాకుండా వాటి వెల ఉంటుంది. ఎప్పుడో ఒకసారి వాడే సాఫ్ట్వేర్ కి అంత మొత్తం ఏ సగటు కంప్యూటర్ వాడుకరి వెచ్చించడానికి ఇష్టపడడు. గతిలేక వాడుతున్న వాటికి ఏమాత్రం తీసిపోని ప్రత్యామ్నాయం ఉందని తెలియకవాటికి ప్రాచూర్యం కల్పించడానికి అన్నట్లు ఆదే సాఫ్ట్వేర్ ట్రయిల్ ని వాడుతుంటారు.
  కొనుక్కునే వాటికి ఏమాత్రం తీసిపోని పైళ్ళను జిప్ చేయు సాఫ్ట్వేర్ ఉచితంగా మనం పొందవచ్చు. దీనిపేరు 7జిప్. ఇది ప్రచారం కోసం ఉచితంగా ఇస్తున్న సాఫ్ట్ వేర్ కాదు. ఇది ఒపెన్ సోర్స్ సాఫ్ట్ వేర్. దీనిని ఎవరైనా ఉచితంగా పొందవచ్చు. షేర్ లేదా లైక్ చేయనవసరంలేకూండానే ఎవరైనా క్రింది లంకె నుండి దింపుకోవచ్చు.