తేలికైన పిడిఎఫ్ రీడర్

  పిడిఎఫ్ ఫైళ్ళను చదువడానికి మనం సాధారణంగా అడోబ్ రీడర్ ని వాడుతుంటాము.ఉబుంటులో ఎటువంటి పిడిఎఫ్ రీడర్ ఇన్ స్టాల్ చేయనవసరం లేకుండానే మనం  పిడిఎఫ్ ఫైళ్ళను చదువుకోవచ్చు. ఉబుంటు లో పిడిఎఫ్ ఫైల్ ని క్లిక్ చేయగానే డాక్యుమెంట్ వ్యూయర్(ఎవిన్స్) అనబడు అనువర్తనము తో పిడిఎఫ్ ఫైల్ తెరవబడును.ఎవిన్స్ గ్నోం డెస్క్ టాప్ ఆదారిత అన్ని లినక్స్ పంపకాలలో అప్రమేయంగా ఉంటుంది.ఇది చాలా తేలికైన,తక్కువ పరిమాణాము గల పిడిఎఫ్ రీడర్.ఎవిన్స్ ని ఉపయోగించి PDF,Postscript,djvu,tiff, dvi,XPS,SyncTex support with gedit మరియు comics books (cbr,cbz,cb7 and cbt) డాక్యుమెంట్లను చదువవచ్చు.
 ఎవిన్స్ విండోస్ మరియు లినక్స్ ఆపరేటింగ్ సిస్టం లలో పనిచేస్తుంది.

భారతీయ భాషలు వ్రాయడానికి

 భారతీయ భాషలు వ్రాయడానికి Indic Input Extension అను ఫైర్ ఫాక్స్ యాడ్ అన్ ఉపయోగపడుతుంది.దీనిని ఉపయోగించి భారతీయ భాషలను ఇన్ స్క్రిప్ట్ మరియు ఫోనిటిక్ పద్దతులలో వ్రాయవచ్చు.దీనిని తెలుగు వాడయిన ప్రసాద్ సుంకరి గారు తయారు చేయడం విశేషం.దీనిని ఇక్కడ నుండి మీ ఫైర్ ఫాక్స్ కి జత చేయవచ్చు.యాడ్ అన్ బార్ లో ఉన్న ఇండిక్ ఇన్ పుట్ మెనూ నుండి ఇన్ పుట్ విధానమును ఎంచుకోవచ్చు.

చివరి అవకాశం

 సిస్టం 76 లాప్ టాప్ మరియు నోకియా N9 ఫోన్ గెలవడానికి చివరి అవకాశం.సమాజానికి సాఫ్ట్వేర్లని ఉచితంగా అందిస్తూనే విలువైన బహుమతులు గెలవవచ్చు.ఉబుంటు అనువర్తనాల తయారీ పోటి(Ubuntu App Creation Contest) ఇంకా పది రోజుల సమయం ఉంది.తెలుగు సాఫ్ట్వేర్ వీరులారా త్వరపడండి.మన సత్తా చూపించే అవకాశం మనముందుంది.కొత్త డెవలపర్లు సహాయం కోసం ఈ వీడియో పాఠాలని చూడండి.

Adding Unity Integration to Your App

Adding Ubuntu One Integration to Your App

Adding Social Media Support to Your App

Adding Multimedia Support to Your App

Packaging your App in Ubuntu

Submitting Your App to the Ubuntu Software Center

సరికొత్త టీవీ రాబోతుంది

 నాటి నలుపు తెలుపు టీవీల నుండి నేటి స్మార్ట్ టీవీల వరకు అనేక మార్పులతో టీవీలు రూపాంతరం చెందాయి.3D,వెబ్ వీక్షణం,స్కైప్,యుట్యుబ్ వీడియోలు,పెన్ డ్రైవ్ ద్వారా పాటలు,ఫోటోలు,సినిమాలు చూడగలిగే పలు సదుపాయాలతో అందుబాటులో ఉన్నాయి.టీవీలు కూడా మొబైల్ ఫోన్ల మాదిరిగానే కంప్యూటర్ తో పోటీ పడే రోజులు రాబోతున్నాయి. ఈ నేపధ్యంలో కనోనికల్ లిమిటెడ్ వారు ఉబుంటు టీవీ అనే పేరుతో టీవీ ఆపరేటింగ్ సిస్టంని అభివృద్ధి చేస్తున్నారు. ప్రాధమిక దశలో ఉన్న ఉబుంటు టీవీ ఆపరేటింగ్ సిస్టం యొక్క మరిన్ని విశేషాలకు ఉబుంటు టీవీ ని చూడండి.

 


ఉబుంటు లో తెలుగు

 ఉబుంటు కూడా చాలా స్వేచ్చా సాప్ట్ వేర్ ల మాదిరిగానే తెలుగు మరియు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఇతర స్థానిక భాషలకు కూడా మద్దతునిస్తుంది.ఉబుంటు లో తెలుగు చూడవచ్చు,వ్రాయనువచ్చు మరియు ఉబుంటు ను తెలుగు లో వాడుకోవచ్చు.

తెలుగు చూడడానికి:

 చాలా వెబ్ సైట్లు,యునికోడ్ లో ఉన్న వెబ్ సైట్లు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడవచ్చు.కొన్ని వార్త పత్రికలు సొంత ఫాంట్లను వాడుతుంటాయి.వాడుకరి సహాయార్ధం వారు ఫాంట్లను డౌన్ లోడ్ చేసుకోవడానికి అందుబాటు లో ఉంచుతారు.ఆ ఫాంట్ ని డౌన్ లోడ్ చేసుకొని దానిని తెరచినపుడు క్రింది విధంగా కనిపించును.
ఉబుంటు లో ఫాంట్ ఇన్ స్టాల్ చేయడానికి ఉదాహరణ
ఇన్ స్టాల్ ఫాంట్ ని నొక్కినపుడు ఫాంట్ మన కంప్యుటర్ నందు ఇన్ స్టాల్ అవుతుంది.అపుడు ఫైర్ ఫాక్స్ ని తిరిగి ప్రారంభించినపుడు ఆయా సైట్ వెబ్ పేజీలు మనకు సరిగా కనిపించును.

తెలుగు వ్రాయడానికి: 

 మొదట తెలుగు భాషకు మద్దతు ని ఇన్ స్టాల్ చేసుకోవాలి.ఉబుంటు లాంచర్ నందుగల  System Settings ని తెరచి Language Support లోనికి వెళ్లి తెలుగు భాషకు మద్దతు ని ఇన్ స్టాల్ చేసుకోవచ్చు.

మొదటిసారి Language Support ని తెరచినపుడు క్రిందివిధంగా అడుగుతుంది.

 ఇన్ స్టాల్ ని నొక్కిన తరువాత పాస్ వర్డ్ అడుగును.పాస్ వర్డ్ ని ఇవ్వగానే డౌన్ లోడ్ చేసుకొని,ఇన్ స్టాల్ చేసుకొని క్రింది విండో తెరవబడును.
 Install/Remove Languages ని నొక్కినపుడు మరొక విండో తెరవబడును.అక్కడ తెలుగు ని ఎంచుకొని Apply Changes ని నొక్కినపుడు తెలుగు భాషకు మద్దతు మన కంప్యుటర్ లో స్థాపించబడును.
 తరువాత System Settings లో ఉన్న Keyboard ని తెరిచి Layout Settings లోకి వెళ్ళాలి.  
 + ని నొక్కడం ద్వారా మరొక విండో తెరవబడును.అక్కడ పెట్టెలో తెలుగు అని టైప్ చేసినపుడు పైన పెట్టెలో తెలుగు కనిపించును.Add ని నొక్కినపుడు ప్యానల్ లో కీబోర్డ్ గుర్తుని చూపించును.అక్కడ నుండి మనం ప్రతిసారి కీబోర్డ్ లేఅవుట్ ని మార్చుకోవచ్చు.ప్యానల్ లో కీబోర్డ్ గుర్తుని నొక్కి తెలుగు ను ఎంచుకొని తెలుగు లో టైప్ చేసుకోవచ్చు.
 మనకి అలవాటు అయ్యేవరకు తెలుగు కీబోర్డ్ లేఅవుట్ ని చూసుకొంటూ టైపు చేసుకోవచ్చు.
తెలుగు కీబోర్డ్ లేఅవుట్

తెలుగు లో వాడుకోవడానికి:

 ఉబుంటు ఆపరేటింగ్ సిస్టంని  తెలుగులో కూడా వాడుకోవచ్చు.పైన చూపించిన విధంగా తెలుగు భాషకు మద్దతు ని ఇన్ స్టాల్ చేసుకోన్న తరువాత System Settings ని తెరచి Language Support లోనికి వెళ్లి అక్కడ చూపించబడిన భాషలలో తెలుగును లాగి (డ్రాగ్ చేసి) ప్రాధాన్యత క్రమం లో మొదట ఉంచవలెను.
 ఆ తరువాత సిస్టం ని లాగ్ అవుట్ చేసి మరలా లాగిన్ కావాలి.అప్పుడు క్రింది చిత్రాలలో చూపించినట్లు మెనూ మరియు డాష్ లో తెలుగు కనిపించును.
తెలుగులో మేనూలు
తెలుగులో డాష్
 ఉబుంటు ని తెలుగులో ఉపయేగిస్తున్నపుడు అక్కడక్కడా ఇంగ్లీష్ లో కనిపించును.ఇంకనూ వాటి అనువాదాలు పుర్తికాకపోవడం వలన ఈవిధంగా కనిపించును.ఈ అనువాద పక్రియలో మీరు కూడా పాలుపంచుకోవచ్చు.ఇక్కడ  మనం ఇప్పటికే అనువాదాలు చేస్తున్న ఒత్సాహికులను చూడవచ్చు,మనం కూడా వీరితో చేరి అనువాదాలు చేయవచ్చు.