నాటి నలుపు తెలుపు టీవీల నుండి నేటి స్మార్ట్ టీవీల వరకు అనేక మార్పులతో టీవీలు రూపాంతరం చెందాయి.3D,వెబ్ వీక్షణం,స్కైప్,యుట్యుబ్ వీడియోలు,పెన్ డ్రైవ్ ద్వారా పాటలు,ఫోటోలు,సినిమాలు చూడగలిగే పలు సదుపాయాలతో అందుబాటులో ఉన్నాయి.టీవీలు కూడా మొబైల్ ఫోన్ల మాదిరిగానే కంప్యూటర్ తో పోటీ పడే రోజులు రాబోతున్నాయి. ఈ నేపధ్యంలో కనోనికల్ లిమిటెడ్ వారు ఉబుంటు టీవీ అనే పేరుతో టీవీ ఆపరేటింగ్ సిస్టంని అభివృద్ధి చేస్తున్నారు. ప్రాధమిక దశలో ఉన్న ఉబుంటు టీవీ ఆపరేటింగ్ సిస్టం యొక్క మరిన్ని విశేషాలకు ఉబుంటు టీవీ ని చూడండి.