ఫేస్‌బుక్ మెసెంజర్ యాప్ ద్వారా ఇక వీడియో కాలింగ్

 ప్రపంచంలోనే అత్యధిక వాడుకరులు ఉన్న సామాజిక మాధ్యమం ఫేస్‌బుక్ ఇప్పటికే తన మొబైల్ మెసెంజర్ యాప్‌తో సందేశాలు పంపుకోవడంతో పాటు ఉచిత వాయిస్‌ కాల్ సదుపాయాన్ని కల్పించింది. తాజాగా ఇప్పుడు ఉచితంగా వీడియో కాల్ చేసుకోనే సౌలభ్యాన్ని కూడా కల్పించింది. ఈ సదుపాయాన్ని పొందడానికి

ఉచిత ఆపరేటింగ్ సిస్టం విడుదల సంబరాలు

 ఉచిత ఆపరేటింగ్ సిస్టములలో స్థిరత్వానికి మారుపేరుగా నిలిచి, అలానే పలు ఉచిత ఆపరేటింగ్ సిస్టముల తయారీలో వెన్నుముకగా ఉన్న ఉవిత ఆపరేటింగ్ సిస్టం డెబియన్ యొక్క సరికొత్త వెర్షను 8.0 విడుద్లైంది. ఈ ఆపరేటింగ్ సిస్టమును ఉచితంగా దింపుకుని అన్ని రకాల డెస్క్‌టాప్ మరియు లాప్‌టాప్ కంప్యూటర్లలో ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. క్రింది లంకె

ప్రపంచంలో ఎక్కువగా వాడుతున్న ఉచిత ఆపరేటింగ్ సిస్టం కొత్త వెర్షను విడుదలైంది

 ఏ మాత్రం డబ్బులు ఖర్చు పెట్టకుండానే ఉచితంగా లభించే ఆపరేటింగ్ సిస్టములు మనకి చాలానే అందుబాటులో ఉన్నాయి. వాటిలో ఎక్కువగా వాడబడుతున్న ఆపరేటింగ్ సిస్టం ఉబుంటు. ఉబుంటు ఆపరేటింగ్ సిస్టం యొక్క సరికొత్త వెర్షను ఇపుడు మనకు ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవడానికి అందుబాటులో ఉంది.

మన ఫోన్‌ యొక్క రేడియేషన్ ఎంత అన్నది తెలుసుకోవడం ఎలా?

 ఈ మధ్యకాలంలో ఎక్కువ స్పెసిఫికేషన్ గల దేశీయ, చైనా తయారీ ఫోన్లు తక్కువ ధరల్లో లభిస్తున్నాయి. అయితే వీటిలో ఎన్ని ఫోన్లు భారత ప్రభుత్వం ప్రజల ఆరోగ్యం కొరకు జారీచేసిన రేడియోషన్ పరిమితులను గౌరవిస్తున్నాయి. దీనిని తెలుసుకోవడం ఎలా?  మనిషి ఆరోగ్యంపై ధుష్ప్రభావాలు లేకుండా ఉండడానికి మన ప్రభుత్వం మొబైల్ ఫోను యొక్క రేడియేషన్ పరిమితిని

మొబైళ్ళలో చేత్తో రాయడానికి

ఈ మధ్యన గూగుల్ తన ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టములో వివిధ స్థానికభాషలకు మధ్దతును కల్పించడంతో పాటు ఇన్‌పుట్ టూల్స్ లో కూడా స్థానికభాషలను పరిగణలోకి తీసుకుని తగిన మధ్దతును అందిస్తుంది. మొబైళ్లలో సాధారణంగా మనం టైప్ చేయడానికి వాడే కీబోర్డ్ అప్లికేషన్‌తో పాటు అధనంగా నోటిమాటను కూడా అక్షరాలుగా మార్చగలిగే సదుపాయాన్ని ఇప్పటికే కల్పించిన గూగుల్ తాజాగా నేరుగా చేతివ్రాతను అక్షరాలుగా మార్చే