ప్రముఖ ఓపెన్ సోర్స్ మొబైల్ ఫోన్ ఆపరేటింగ్ సిస్టము అయిన ఆండ్రాయిడ్ లినక్స్ కర్నెలు పై నిర్మించబడినది. అలాగే ఓపెన్ సోర్స్ డెస్క్ టాప్ ఆపరేటింగ్ సిస్టము అయిన ఉబుంటు కూడా లినక్స్ కర్నెలు పైన నిర్మించబడినది.ఉబుంటుని తయారుచేసిన కనోనికల్ లిమిటెడ్ వారు ఆండ్రాయిడ్ ఫోను(తో)లో ఉబుంటు డెస్క్ టాప్ ని కంప్యూటెక్స్ 2012 లో ప్రదర్శించారు.ఆండ్రాయిడ్ ఫోనుని మానిటర్ కి అనుసందానించినపుడు ఉబుంటు డెస్క్ టాప్ ఆవిశ్కృతమౌతుంది.ఇంకా చెప్పాలంటే మన ఆండ్రాయిడ్ ఫోను మానిటర్ కి తగిలించినపుడు ఉబుంటు ఇన్ స్టాల్ చేయబడిన సిపియు గా పనిచేస్తుంది.యు.యస్.బి కీ బోర్డ్ మరియు మౌస్ ను ఉపయోగించి సాధారణ డెస్క్ టాప్ కంప్యుటర్ వలే పనిచేసుకోవచ్చు.
నమ్మశక్యం గా లేదా కంప్యూటెక్స్ 2012 లో ప్రదర్శించిన ఆండ్రాయిడ్ కోసం ఉబుంటు వీడియోని చూడండి.మరిన్ని వివరాలకు ఆండ్రాయిడ్ కోసం ఉబుంటు ని చూడండి.