సంస్కారవంతమైన వెబ్‌బ్రౌజర్ కొత్త వెర్షన్ విడుదలైంది

నెట్ చూడాలి అంటే "e" నే అనే పరిస్థితి మార్చిన వెబ్‌ బ్రౌజర్, మనం కావాల్సినది కాకుండా అవసరంలేని పాపప్‌లు, ప్రకటనలు తెరవబడుతు సమయాన్ని వృధా చేయడాన్ని నివారించిన వెబ్‌ బ్రౌజర్, టాబ్‌ బ్రౌజింగ్ తో వెబ్‌ విహరణాన్ని సులభతరం చేసిన వెబ్‌ బ్రౌజర్, సామాన్యుల నుండి డెవలపర్ల వరకు అందరి ఆదరణ పొందిన బ్రౌజర్, యాడ్ ఆన్లతో వెబ్
బ్రౌజర్ చేయగల పని పరిమితులను చెరిపివేసిన బ్రౌజర్, బధ్రతలో అత్యంత నమ్మకమైన వెబ్‌బ్రౌజర్, వాడేవారు నచ్చినట్లు మలుచుకోవడానికి అనుకూలంగా తయారుచేయబడిన బ్రౌజర్, పలుభాషలలో లభ్యమయ్యే వెబ్‌బ్రౌజర్ అదేనండి మన ఒపెన్‌సోర్స్ వెబ్‌బ్రౌజర్ అయిన మొజిల్లా ఫైర్‌ఫాక్స్. ఆధునికమైన ఫీచర్లను ఎల్లపుడు వేగంగా వాడుకర్లకు అందుబాటులోకి తేవడంలో ముందుండే ఈ ఉచిత వెబ్‌బ్రౌజర్ లో అన్నిటికంటే ముఖ్యవిషయం వాడుకరి గోప్యతకి విలువనివ్వడం.
వాడుకరి గోప్యతకి (ప్రైవసి) విలువనిచ్చే ఏకైక వెబ్‌బ్రౌజర్ ఫైర్‌ఫాక్స్. వ్యక్తిగత బ్రౌజింగ్ మోడ్, నన్ను ట్రాక్ చెయ్యవద్దు వంటి ఆప్షన్‌లతో వెబ్‌ విహారణాన్ని మన నియంత్రణలోకి తెచ్చిన వెబ్ బ్రౌజర్ ఇప్పుడు సరికొత్తగా 'పర్‌గెట్' అన్న ఆప్షన్‌ని తన కొత్త వెర్షను 33.1 తో అందుబాటులోకి తెచ్చింది. ఈ ఆప్షన్ ద్వారా మనం సులభంగా మనకు కావలసినంత వరకు బ్రౌజింగ్ హిస్టరీని తీసివేయవచ్చు. మనం ఈ ఆప్షన్ని క్రింది చిత్రాలలో చూపినట్లు వాడుకోవచ్చు. ఫైర్‌ఫాక్స్సరికొత్త వెర్షనుని ఇక్కడ నుండి ఉచితంగా దింపుకోవచ్చు.