ఇక డ్రైవర్ల గురించి వెతకనవసరం లేదు

 డ్రైవర్లు అనేవి మనకంప్యూటర్ లో ఉన్న వివిధ రకాల పరికరాలను పనిచేయించడానికి కావలసిన సాఫ్ట్ వేర్. మనం సాధారణంగా ఆపరేటింగ్ సిస్టం తిరిగి ఇన్ స్టాల్ చేసిన ప్రతిసారి కంప్యూటర్ కొన్నపుడు దానితో వచ్చే సీడి ని ఉపయోగించి డ్రైవర్లను ఇన్ స్టాల్ చేస్తుంటాము. లేదా కంప్యూటర్/ మధర్ బోర్డ్ తయారీదారు వెబ్ సైటు నుండి మనకి కావలసిన డ్రైవర్లని డౌన్లోడ్ చేసుకొని ఇన్ స్టాల్ చేస్తుంటాము. 

  • మీరు కంప్యూటర్ వాడే వారయితే?
  • కంప్యూటర్ సీడి మన దగ్గర నేకపోతే?
  • సీడి ఉన్నప్పటికి ఎప్పుడో కంప్యూటర్ కొన్నప్పుడు వచ్చిన డ్రైవర్లు ఇప్పటి మన ఆపరేటింగ్ సిస్టం కి సరిపోకపోతే?
  • సీడి ఉన్నప్పటికి సీడి డ్రైవ్ చెడిపోతే?
  • డ్రైవర్ల డౌన్లోడ్ గురించి కనీస పరిజ్ఞానంలేకపోతే?
  • తయారీదారు వెబ్ సైటు లో మనకి కావలసిన డ్రైవర్లు లభించకపోతే?
  • డ్రైవర్లు లభించినప్పటికి మనం ఇన్ స్టాల్ చేసుకొన్న ఆపరేటింగ్ సిస్టంకి మధ్దతు లేకపోతే?
  • మీరు కంప్యూటర్లను ఇన్ స్టాల్ చేసేవారయితే?
  • సమయాన్ని ఆధా చేసుకోవాలంటే?
  • ఉచితంగా కావాలా?
  • డెస్క్ టాప్ లేదా లాప్ టాప్ ఒకే నొక్కుతో అన్ని డ్రైవర్లనుఇన్ స్టాల్ చేసుకోవాలంటే? 
  • మనం సాధారణంగా వాడే అన్ని సాఫ్ట్ వేర్లను ఒకే నొక్కుతో ఇన్ స్టాల్ చేసుకోవాలంటే?

మీకు తప్పకుండా ఈ టపా తప్పక చదవాల్సిందే. 


పైన వాటన్నిటికి ఒకే ఒక తరుణోపాయం డ్రైవర్ ప్యాక్ సొల్యూషన్. 

డ్రైవర్ ప్యాక్ సొల్యూషన్ అనేది బహుళ ప్రాచూర్యం పొందిన ఒపెన్ సోర్స్ సాఫ్ట్ వేర్. ఇది మన కంప్యూటర్ 32/64 అయినా, మన లాప్ టాప్ ఏ కంపెనీ దయినా, కంప్యూటర్ ఆపరేటింగ్ సిస్టం తగిన డ్రైవర్లను అటోమెటిక్ గా గుర్తించి చాలా తొందరగా డ్రైవర్లను ఇన్ స్టాల్ చేస్తుంది. అంతేకాకుండా మనకి కావలసిన నిత్యావసర సాఫ్ట్ వేర్లను కూడా ఇన్ స్టాల్ చేసుకోవచ్చు. డ్రైవర్ ప్యాక్ సొల్యూషన్ ఉపయోగించి కొత్తగా రాబోతున్న విండోస్ 8.1 తో కలిపి అన్ని విండోస్ ఆపరేటింగ్ సిస్టం లకి కావలసిన డ్రైవర్లని ఇన్ స్టాల్ చేసుకోవచ్చు. డ్రైవర్ ప్యాక్ సొల్యూషన్ ని ఉపయోగించి డ్రైవర్లని ఇన్ స్టాల్ చేసుకోవడమే కాకుండా డ్రైవర్లని అప్ డేట్ చేసుకూవడం, డ్రైవర్లని బ్యాక్ అప్ చేసుకోవడం కూడా చేయవచ్చు. డ్రైవర్ ప్యాక్ సొల్యూషన్ అనేది మనకి  డ్రైవర్ ప్యాక్ సొల్యూషన్ లైట్, డ్రైవర్ ప్యాక్ సొల్యూషన్ అని రెండు రూపాల్లో లభిస్తుంది. 

 డ్రైవర్ ప్యాక్ సొల్యూషన్ లైట్: ఇది 10Mb ఇన్ స్టాల్ ఫైల్. మన కంప్యూటర్ కి కావలసిన డ్రైవర్లని నెట్ నుండి దింపుకొని ఇన్ స్టాల్ చేసుంది. దీనిని ఇక్కడ నుండి ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు.

 డ్రైవర్ ప్యాక్ సొల్యూషన్: ఇది 4.4 Gb .iso ఫైల్. పరిమాణం పెద్దదిగా ఉండడం వలన దీనిని టొరెంట్ డౌన్లోడ్ చేసుకోవాలి. దీనిని ఒక సారి డౌన్లోడ్ చేసుకుంటే చాలు నెట్ అనసరం లేకుండా ఎన్ని కంప్యూటర్లలో అయినా డ్రైవర్లని ఇన్ స్టాల్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన టొరెంట్ ఫైల్ ని ఇక్కడ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆ టొరెంట్ ఫైల్ ని ఏదైనా టొరెంట్ క్లయింట్ తో తెరిచి డ్రైవర్ ప్యాక్ సొల్యూషన్ పూర్తి వెర్షన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. 

డ్రైవర్ ప్యాక్ సొల్యూషన్ 13
 ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ టపాని క్రింద ఉన్న సదుపాయాన్ని ఉపయోగించి మీ ఫ్రెండ్స్‌తోనూ షేర్ చెయ్యగలరు.