భారతదేశం అంతటా బ్రహ్మాండమైన విడుదల

ప్రముఖ లాప్ టాప్ తయారిదారు అయిన డెల్ దేశవ్యాప్తంగా 850 దుకాణాలలో ఈ నెల 21 నుండి తమ కొత్త లాప్ టాప్ శ్రేణిని విడుదల చేస్తుంది. ఇంస్పిరాన్ 14 ఆర్ మరియు 15 ఆర్ అను కొత్త లాప్ టాప్ శ్రేణిని విడుదలచేస్తుంది. మనం ఇప్పటి వరకు "డెల్ రికమండ్ విండోస్ 7" అని డెల్ మరియు మిగిలిన తయారిదారుల ప్రకటనలలో, సైట్లో
చూసాము. కానీ అది త్వరలో మారవచ్చు. ఎందుకనగా మొదటి సారి డెల్ భారత దేశంలో ఉబుంటు ఇన్స్టాల్ చేయబడిన ఇంస్పిరాన్ 14 ఆర్ మరియు 15 ఆర్ అను కొత్త లాప్ టాప్ శ్రేణిని విడుదలచేస్తుంది. ఉబుంటు లాప్ టాప్  దానికి సరిసమానమైన విండోస్ లాప్ టాప్ కన్నా తక్కువ ధరకు లభించవచ్చని ఒక అంచనా.
డిల్లీలో ఉబుంటు లాప్ టాప్ ల అమ్మకాలకి సిద్దమైన ఒక డెల్ దుకాణం