ఉబుంటు 12.10 లో యునిటీ డెస్క్ టాప్ కొత్త విశిష్టతలు

 ఉబుంటు రాబోయే విడుదల (12.10) లో యునిటీ డెస్క్ టాప్ కొత్త విశిష్టతలతో రాబోతుంది. ప్రస్థుతం అభివ్రుధ్ది దశలో ఉన్న 12.10 యునిటీ డెస్క్ టాప్ యొక్క మార్పులను ఈ వీడియోలో చూడవచ్చు.



ఆన్ లైన్ లో మరో 5GB ఉచిత స్టోరేజ్

 కనోనికల్ లిమిటెడ్ వారు ఆన్ లైన్ లో 5GB ఉచిత స్టోరేజ్ ని ఉబుంటు వన్ పేరు తో అందిస్తున్నారు. మీకు ఇప్పటికే లాంచ్ పాడ్ లో ఖాతా ఉంటే మీరు నేరుగా ఉబుంటు వన్ కి లాగిన్ కావచ్చు. లేదా అప్పటికప్పుడు కొత్త ఖాతాని నమోదు చేసుకోవచ్చు.ఉబుంటు,విండోస్,మాక్  మరియు ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం లకు మద్దతు కలదు. మరిన్ని వివరాలకు
ఉబుంటు వన్ సైట్ ని చూడండి.

ఉబుంటులో గూగుల్ ఎర్త్ ఇన్ స్టాల్ చేయువిధానం

 ఉబుంటులో గూగుల్ ఎర్త్ ఇన్ స్టాల్ చేయడం చాలా సులభం. మొదట ఇక్కడ నుండి గూగుల్ ఎర్త్.deb ఫైల్ని డౌన్లోడ్ చేసుకొని దానిని డబుల్ క్లిక్ చేయడమే.


ఉబుంటు!ఉబుంటు! ఉబుంటు! అసలి ఉబుంటు అంటే ఏంట్రా బాబు?

ఉబుంటు అంటే ఏంటి?

ఉబుంటు అనగా లినక్స్ కర్నెల్ పై నిర్మించబడిన డెబియన్ ఆధారిత ఉచిత కంప్యూటర్ ఆపరేటింగ్ సిస్టం.

ఎక్స్ పి వాడిదా?

కాదు బాబు!కనోనికల్ లిమిటెడ్ అని ఇంగ్లాండ్ కంపెని.మార్క్ ‌ షటిల్‌వర్త్ దీనికి  యజమాని.

మరి ఈయన గారికి ఉబుంటు తప్ప ఇంకే పేరు దొరకలేదా?కిటికీలో! తలుపులో ! అని పెట్టుకోవచ్చుకదా?

దక్షిణ ఆఫ్రికా లో బుంటు భాష లో ఉబుంటు అంటే "ఇతరుల పట్ల మానవత్వం చూపించడం".ఆకంపెని సిద్ధాంతం (సాఫ్ట్వ్ వేర్ అనేది ప్రతిఒక్కరికి ఉచితంగా అందాలి దాన్ని వాడడానికి భాష మరియు  శారిరక లోపాలు అడ్డు కాకుడదు ) కూడా అదే.

బాగానే ఉంది గాని రేటు ఎంత?

ఫ్రీ! అవును నిజంగా ఉచితమే.అంతే కాదు మన ఇష్టం వచ్చిన విధంగా మార్చుకోవచ్చు,కాపి చేసుకోవచ్చు,ఎవరికైనా ఇచ్చుకోవచ్చు.

అందరికి ఒకే సిడి ని ఇస్తే ఇన్ స్టాల్ అయిన తరువాత జన్యున్ మెసేజ్ రాదా?

రాదు,ఎన్ని కంప్యూటర్లలో అయినా చేసుకోవచ్చు.

ఉచితంగా ఇస్తే కంపెని ఎలా నడుపుతారు?

ఆపరేటింగ్ సిస్టం ఎల్లపుడు ఉచితమే .సాంకేతిక సహకార సేవల ద్వారా నిధులు సమకూర్చుకుంటారు.

కొత్తగా వచ్చిందా?

2004 అక్టోబర్ 20న మొదటి వెర్షన్ విడుదలైంది.అప్పటి నుండి ప్రతి ఆరు నెలలకి ఒక వెర్షన్ చొప్పున విడుదలవుతున్నాయి.

ప్రస్థుతం ఏ వెర్షన్ నడుస్తుంది?ఎక్కడ దొరుకుతుంది?

 12.04, ఇక్కడ డౌన్ లోడ్ మరియు ఇన్ స్టాల్ చేయు విధానం ఇవ్వబడినవి.

డెస్క్ టాప్ ఎలా ఉంటుంది?

చెప్పడం ఎందుకు. ఇక్కడ రుచి చూడండి.

మరి నా కంప్యూటర్ లో ఎక్స్ పి ఉంది ఎలా?

ఉబుంటుని నేరుగా సిడి నుండే పని చేసుకోవచ్చు.లేదా పెన్ డ్రైవ్ లో ఇన్ స్టాల్ చేసుకోవచ్చు.లేదా విండోస్ లోకాని,విండోస్ ప్రక్కనగాని ఇన్ స్టాల్ చేసుకోవచ్చు.

నా కంప్యూటర్  హార్డుడిస్క్ లో తక్కువ స్థలం ఉంది ఎలా?

సాధారణ వాడుకరికి 5జిబి సరిపోతుంది.

నా కంప్యూటర్ లో RAM తక్కువ ఉంది ఎలా?

500 యంబి తో కూడ బాగా పనిచేస్తుంది.

నాకు ఇంగ్లీష్ రాదు ఎలా?

తెలుగులో కూడా ఉంది.అంతేకాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న చాలా భాషలలో లభిస్తుంది.

మరి మావాడి లాప్ టాప్ లో ఇన్ స్టాల్ చెయ్యవచ్చా?

చెయ్యవచ్చు.అంతేకాదు విండోస్ నడిచే అన్ని కంప్యూటర్లలో,ఆపిల్,పవర్ పిసి,ఎ ఎండి,సర్వర్ లలో కూడా ఇన్ స్టాల్ చేసుకోవచ్చు.అంతే కాకుండా టీవి,టాబ్లెట్ పిసి,ఫోన్ మరియు ఆండ్రాయిడ్ ఫోన్ మద్ధతు కూడా తొందరలో రాబోతున్నాయి.

నా పాత కంప్యూటర్ పనిచేస్తుందా?

చేస్తుంది.ఉబుంటు నెమ్మదిగా ఉంటే దాని తమ్ముడు లేదా చెల్లి ని ప్రయత్నించవచ్చు.వీటిని పాత,తక్కువ సామర్ధ్యం గల కంప్యూటర్ల కోసమే తయారు చేసారు.

ఎవరు వాడ వచ్చు?

ఎవరైనా.ముఖ్యంగా ఆపరేటింగ్ సిస్టం మరియు ఆఫీస్ సూట్ కి డబ్బు చెల్లించలెనివాళ్ళు,పైరేట్ చెయ్యడం ఇష్టం లేని వాళ్ళు,ఒపెన్ సోర్స్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు.

ఎప్పుడు ఎక్కడ చూడలేదు  ఎవరైనా వాడుతున్నారా?

ఒక్క ఉబుంటునే ప్రపంచ వ్యాప్తంగా రెండు కోట్ల మంది వాడుతున్నారు.మిగిలిన లినక్స్ పంపకాలు కూడా చాలా మంది వాడుతున్నారు.

ఎన్నో పంపకాలుండగా ఉబుంటునే ఎందుకు వాడాలి?

మీకు నచ్చిన,సరిపడినదాన్నే వాడవచ్చు.ఉన్న లినక్స్ పంపకాల్లో ఉబుంటు నే ఎక్కువగా వాడబడుతుంది.అందులోను సాధారణ వాడుకరికి సులభంగాను,ఆకర్షణీయంగాను ఉంటుంది.

మరి సాప్ట్ వేర్ అప్ డెట్స్ ఉంటాయా?   

నిరంతరం ఉంటాయి.

దీనికి ఎంటివైరస్ ఎక్కడ దొరుకుతుంది?రేటు ఎంత?

అవసరం లేదు.లినక్స్ కర్నల్ లోనే ఆ భధ్రతని ఏర్పాటు చేసారు.అవసరం అనుకోంటే ఇన్ స్టాల్  చేసుకోవచ్చు.

ఇంత సాప్ట్ వేర్ ని అభివృద్ధి చేయడానికి మానవవనరులు?
కొంత మంది సిబ్బంది మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఔత్సాహికులు అభివృద్ధి  లో పాలుపంచుకొంటారు.మీరు కూడా అభివృద్ధి  తోడ్పాటునీయవచ్చు.

అన్ని కమర్షియల్ సాప్ట్ వేర్ ల మద్ధతు ఉంటుందా?
లేదు.ఇప్పుడిప్పుడే మార్పు వస్తుంది.ఉదాహరణకి స్కైప్,వియం వేర్,టీం వ్యుయర్,గూగుల్,ఒపెరా,అవాస్త్,నీరో,నోడ్32 వంటివారు లినక్స్ కి కూడా మద్ధతునిస్తున్నారు.ఆదరణ పెరుగుతుంటే  మిగతావారు కూడా తప్పక మద్ధతు నిస్తారు.

బాగా అలవాటై,ప్రాచుర్యం పొందినతరువాత వాణిజ్య సాప్ట్ వేర్ గా మార్చేస్తే?

ఈమధ్య జరిగిన ఒ సంఘటన:బాగా ప్రాచుర్యం పొందిన  ఒపెన్ సోర్స్  సాప్ట్ వేర్ అయిన  ఒపెన్ ఆఫీస్ ని మద్ధతునిచ్చే సన్ సంస్థ ఒరాకిల్ యాజమాన్యం క్రింధికి వచ్చింది.ఒరాకిల్ కి అప్పటికే సింఫని అనే ఆఫీస్ సూట్ ఉంది.ఒరాకిల్ వారు   ఒపెన్ ఆఫీస్ కి మద్ధతు ఉపసంహరిస్తారేమోనని  ఒపెన్ ఆఫీస్ అభివృద్ధిలో పాలుపంచుకుంటున్న ఔత్సాహికులు అప్పటికప్పుడు డాక్యుమెంట్ ఫౌండేషన్ అనే సంస్థని ఏర్పాటు చేసి అందుబాటులో ఉన్న సోర్స్ కోడ్ ని ఉపయోగించి లిబ్రే ఆఫీస్ అను ఒపెన్ సోర్స్ ఆఫీస్ సూట్  ని విడుదల చేసారు.ఈ సంఘటన ద్వారా  ఒపెన్ సోర్స్ శక్తి ఏమిటో మనకు అర్ధమగును.కనుక సందేహించనవసరం లేదు.

దీనిలో అన్ని మిడియా ఫార్మాట్లు ప్లే అవుతాయా?

ఉబుంటు రెస్ట్రిక్టేడ్ ఎక్స్ ట్రాస్ ఇన్ స్టాల్  చేసుకోవడం ద్వారా అన్ని ఫార్మాట్లు ప్లే అవుతాయి.

ఆఫీస్ సూట్ మరలా కొనుక్కోవాలా?

అవసరం లేదు.లిబ్రే ఆఫీస్ అను ఒపెన్ సోర్స్ ఆఫీస్ సూట్ ఆపరేటింగ్ సిస్టం తోనే వస్తుంది.

మరి విండోస్ ఫైల్ లు ఒపెన్ అవుతాయా?

ఆఫీస్ 2007 ఫైల్ ఆఫీస్ 2003 లో ఒపెన్ అవుతుందో లేదో కాని లిబ్రేఆఫీస్ లో మాత్రం ఒపెన్ అవుతాయి.

నాకేమైనా సందేహాలు వస్తే?

నేరుగా ఉబుంటు ని అడగండి.లేదా నెట్ లో ఎన్నో వెబ్ సైట్ లు మరెన్నో  ఔత్సాహిక బ్లాగులు విలువైన సమాచారాన్ని అందిస్తున్నాయి.

ఫైల్ ఏదైనా కన్వర్టర్ ఒకటే

 వీడీయో, ఆడియో, ఇమేజ్ మరియు డాక్యుమెంట్ ఫైళ్ళను ఒక ఫార్మాట్ నుండి మరొక ఫార్మాట్ లోకి మార్చడానికి FF మల్టి కన్వర్టర్ ఉపయోగపడుతుంది. వివిధ ఫార్మాట్లలో గల ఫైళ్ళను ఒకే చోట సులభంగా ఒక ఫార్మాట్ నుండి మరొక ఫార్మాట్ లోకి మార్చడానికి ఇది తయారుచేయబడినది. FF మల్టి కన్వర్టర్ ఉచితంగా లభించు స్వేచ్ఛా సాఫ్ట్వేర్. 

 FF మల్టి కన్వర్టర్ తో మార్చుకోగల ఫైల్ ఫార్మాట్లు:


Audio/Video formats:
  • aac, ac3, afc, aiff, amr, asf, au, avi, dvd, flac, flv, mka, mkv, mmf, mov, mp3, mp4, mpg, ogg, ogv, psp, rm, spx, vob, wav, webm, wma, wmv
And any other format supported by ffmpeg.
Image formats:
  • bmp, cgm, dpx, emf, eps, fpx, gif, jbig, jng, jpeg, mrsid, p7, pdf, picon, png, ppm, psd, rad, tga, tif, webp, xpm
Document file formats:
  • doc -> odt, pdf
  • html -> odt
  • odp -> pdf, ppt
  • ods -> pdf
  • odt -> doc, html, pdf, rtf, sxw, txt, xml
  • ppt -> odp
  • rtf -> odt
  • sdw -> odt
  • sxw -> odt
  • txt -> odt
  • xls -> ods
  • xml -> doc, odt, pdf

 ఉబుంటులో FF మల్టి కన్వర్టర్ ఇన్ స్టాల్ చేయువిధానము:


 ఉబుంటు టెర్మినల్ నందు క్రింద ఇవ్వబడిన మూడు కమాండ్లను ఒకదాని తరువాత ఒకటి రన్ చేయడం ద్వారా FF మల్టి కన్వర్టర్ని ఇన్ స్టాల్ చేసుకోవచ్చు.
sudo add-apt-repository ppa:ffmulticonverter/stable

sudo apt-get update

sudo apt-get install ffmulticonverter