లినక్స్ లో గేమింగ్

 విండోస్ తో పోల్చితే లినక్స్ లో గేమింగ్ లో చాల వెనకబడి ఉందన్నది వాస్తవం.ఈ పరిస్థితి తొందరలోనే మారబోతుంది అన్న దానికి సంకేతంగా ప్రముఖ కంప్యూటర్ ఆటల తయారీదారులు అయిన ఇ.ఎ.స్పోర్ట్స్ మరియు వాల్వ్ సంస్థలు లినక్స్ ఆపరేటింగ్ సిస్టముల కి కూడా ఆటల తయారీని ప్రారంభించినట్లు ప్రకటించారు.
 మీరు కంప్యూటర్ ఆటల ప్రియులా అయితే ఉబుంటు మరియు ఇతర లినక్స్ ఆపరేటింగ్ సిస్టము పై ఆడదగిన ఆటల గురించిన విశేషాలను మరియు ఉబుంటుకి సంబందించిన విశేషాలను అందించే ఈ వెబ్ సైటు మీకు తప్పక ఉపయోగపడుతుంది.
                                               
                                                   ఉబుంటు వైబ్స్ 

ఒపెన్ సోర్స్ DTP సాఫ్ట్వేర్

  స్క్రైబస్ అను స్వేచ్చా సాఫ్ట్వేర్ పేజ్ మేకర్ లాంటి వాణిజ్య సాఫ్ట్వేర్లకు ప్రత్యామ్నాయ డెస్క్ టాప్ పబ్లిషింగ్ సాఫ్ట్వేర్. స్క్రైబస్ ని ఉపయోగించి కరపత్రాలు,వార్తాపత్రికలు మరియు ప్రచార చిత్రాలు వంటి వాటిని రూపొందించవచ్చు.అధునాతన ప్రచురణకు కావలసిన హంగులన్ని దీని సొంతం.అంతేకాకుండా దీని వాడకాన్ని గురించి వివరించే ట్యుటోరియళ్ళు అంతర్జాలంలో సులభంగా దొరుకుతాయి.ఇది విండోస్,మాక్ మరియు లినక్స్ ఆపరేటింగ్ సిస్టముల నందు పనిచేస్తుంది. స్క్రైబస్ ని ఉచితంగా ఇక్కడ నుండి దిగుమతి చేసుకోవచ్చు. తొందరలోనే  స్క్రైబస్ లో తెలుగు మద్దతును చేర్చబోతున్నారు.


సులభంగా చూసి నేర్చుకోవచ్చు

 వాణిజ్య సాఫ్ట్వేర్లకు దీటయిన ఎన్నో స్వేచ్చా సాఫ్ట్వేర్లు ఈనాడు మనకి అందుబాటులో ఉన్నాయి.వాటి గురించి తెలియక పోవడం వలన,వాడేవిధానము తెలియక మరియు వాణిజ్య సాఫ్ట్వేర్లకు అలవాటు పడడం వలన స్వేచ్చా సాఫ్ట్వేర్లు ఆదరణ పొందలేక పోతున్నాయి.షోమీడు.కామ్ లో ప్రముఖ స్వేచ్చా సాఫ్ట్వేర్లు వాడే విధానమును గురించి సవివరంగా,సులభంగా అర్ధమయ్యే వీడియో ట్యుటోరియళ్ళ రూపంలో అందుబాటులో ఉంచారు.ఆసక్తి గలవారు షోమీడు.కామ్ లో వీడియో ట్యుటోరియళ్ళు చూడవచ్చు,డౌన్లోడ్ చేసుకోవచ్చు.అంతేకాకుండా మనం తయారు చేసిన ట్యుటోరియళ్ళను కూడా ఇక్కడ ఉంచవచ్చు.

ఫోనులో డెస్క్ టాప్

 ప్రముఖ ఓపెన్ సోర్స్ మొబైల్ ఫోన్ ఆపరేటింగ్ సిస్టము అయిన ఆండ్రాయిడ్ లినక్స్ కర్నెలు పై నిర్మించబడినది. అలాగే  ఓపెన్ సోర్స్ డెస్క్ టాప్ ఆపరేటింగ్ సిస్టము అయిన ఉబుంటు కూడా లినక్స్ కర్నెలు పైన నిర్మించబడినది.ఉబుంటుని తయారుచేసిన కనోనికల్ లిమిటెడ్ వారు ఆండ్రాయిడ్ ఫోను(తో)లో ఉబుంటు డెస్క్ టాప్ ని కంప్యూటెక్స్ 2012 లో ప్రదర్శించారు.ఆండ్రాయిడ్ ఫోనుని మానిటర్ కి అనుసందానించినపుడు ఉబుంటు డెస్క్ టాప్ ఆవిశ్కృతమౌతుంది.ఇంకా చెప్పాలంటే మన ఆండ్రాయిడ్ ఫోను మానిటర్ కి తగిలించినపుడు ఉబుంటు ఇన్ స్టాల్ చేయబడిన సిపియు గా పనిచేస్తుంది.యు.యస్.బి కీ బోర్డ్ మరియు మౌస్ ను ఉపయోగించి సాధారణ డెస్క్ టాప్ కంప్యుటర్ వలే పనిచేసుకోవచ్చు.
నమ్మశక్యం గా లేదా కంప్యూటెక్స్ 2012 లో ప్రదర్శించిన ఆండ్రాయిడ్ కోసం ఉబుంటు వీడియోని చూడండి.

మరిన్ని వివరాలకు ఆండ్రాయిడ్ కోసం ఉబుంటు ని చూడండి.

ఒపెన్ సోర్స్ కంప్యూటర్లు

 కేవలం ఉబుంటు ఆపరేటింగ్ సిస్టం ఆధారంగా కంప్యూటర్లను తయారుచేసే సంస్థ సిస్టం 76.సిస్టం 76 వారు ఉబుంటు లాప్ టాప్,డెస్క్ టాప్ మరియు సర్వర్లను విడుదలచేసారు.ఆసక్తి కలవారు సిస్టం 76 సైటు నందు కంప్యూటర్లను కొనుగోలు చేయవచ్చు.