ఉబుంటులో టీవి

కంప్యూటర్ లో టీవి చూడడానికి టీవి ట్యునర్ కార్డ్స్(ఇన్ టర్నల్/ఎక్స్ టర్నల్) ఉపయోగిస్తుంటాము. టీవి ట్యునర్ కార్డ్ కంప్యూటర్ కి అమర్చినతరువాత దానితో పాటు వచ్చిన డ్రైవర్స్ ఇన్ స్టాల్ చేసి టీవి చూడవచ్చు. టీవి ట్యునర్ కార్డ్ తో వచ్చిన సిడిలో విండోస్ కి కావలసిన డ్రైవర్స్ మాత్రమే ఉంటాయి. మరి ఉబుంటు మరియు వేరె లినక్స్ పంపకాలు వాడేవారిపరిస్థితి ఏంటి? 

ఉబుంటు లో అన్ని సాఫ్ట్ వేర్లు పనిచెస్తాయా?ఎక్కడ దొరుకుతాయి? ఎలా ఇన్ స్టాల్ చెయ్యాలి?

సాధారణంగా విండోస్ లో మనకి కావలసిన  సాఫ్ట్ వేర్లు నెట్ నుండి కాని మిత్రుల వద్దనుండి కాని తెచ్చుకొని setup.exe రన్ చేయడం ద్వారా ఇన్ స్టాల్ చేస్తాము. కాని ఆ setup.exe లు ఉబుంటులో రన్ కావు.