సంస్థగా మారిన అత్యుత్తమ ఆండ్రాయిడ్ రామ్

 ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం ఆధారంగా తయారుచేయబడి, ఆండ్రాయిడ్ని మించిన ఫీచర్లని అందిస్తు నెంబర్ వన్ ఆండ్రాయిడ్ రామ్ గా పేరు తెచ్చుకొన్న సైనోజెన్ మొడ్ ఒపెన్ సోర్స్ ఆపరేటింగ్ సిస్టం ఇప్పడు ఒక కంపెనీగా కొత్త అవతారం ఎత్తింది. దానికి సంబంధించిన ప్రకటన సైనోజెన్ మొడ్ వారి బ్లాగులో చూడవచ్చు. ఇప్పటి వరకు వివిధ కంపెనీల డివైస్ లకు అనధికార ఆపరేటింగ్ సిస్టంలు తయారు చేస్తూవచ్చిన సైనోజెన్ మొడ్ ఇప్పుడు తను కూడా సొంతంగా మొబైళ్ళు, టాబ్లెట్లు విడుదల చేయబోతుంది. సైనోజెన్ మొడ్ ఆపరేటింగ్ సిస్టం మిగిలిన రామ్ లతో పోల్చుకుంటే చాలా పరికరాల్లో ఇన్ స్టాల్ చేసుకోవచ్చు.
 ఈ సంధర్బంగా అన్ని మొబైళ్ళు, టాబ్లెట్లలో పనిచేచే విధంగా తయారుచేయడం, ఫోన్ లో అప్లికేషన్ ఇన్ స్టాల్ చేసుకున్నంత సులువుగా సైనోజెన్ మొడ్ ని ఇన్ స్టాల్ చేయగలగడం తమ లక్ష్యాలు గా పేర్కొన్నారు. తొందరలోనే సైనోజెన్ మొడ్ ఇన్ స్టాలర్ ప్లే స్టోర్ లో అందుబాటులోకి తీసుకురాబోతున్నారు. సైనోజెన్ మొడ్ ఇన్ స్టాలర్ యొక్క చిత్రాలు క్రింద చూడవచ్చు.



ఉబుంటు టచ్ తొలి వెర్షన్ విడుదల కాబోతుంది

 ఉబుంటు టచ్ అంటే ప్రముఖ ఉచిత లినక్స్ డెస్క్ టాప్ ఆపరేటింగ్ సిస్టం అయిన ఉబుంటు యొక్క ఫోన్ మరియు టాబ్లెట్ల ఆపరేటింగ్ సిస్టం. గత కొంత కాలంగా వేగంగా అభివృధ్ది చేయబడుతున్న ఉబుంటు టచ్ ఆధికారికంగా గూగుల్ నెక్సాస్ పరికరాలకి (గెలాక్సి నెక్సస్, నెక్సస్4, నెక్సస్7, నెక్సస్10) మధ్దతు ఇవ్వడమే కాకుండా మూడు సంవత్సరాల పాటు అప్ డేట్స్ అందించబడును. ఉబుంటు డెస్క్ టాప్ ఆపరేటింగ్ సిస్టం తరువాతి వెర్షన్ అయిన 13.10 తో పాటు ఉబుంటు టచ్ 1.0 వెచ్చే నెల 17న విడుదలకాబోతుంది. అధికారికంగా గెలాక్సి నెక్సస్, నెక్సస్4, నెక్సస్7, నెక్సస్10 లకు మాత్రమే మధ్దతు కలిగి ఉన్నప్పటికి అనధికారికంగా వివిధ ఫోన్లకి టాబ్లెట్ కి కూడా అందుబాటులో ఉంది. ఉబుంటు టచ్ తో తయారు చేయబడిన తొలి ఫోను వచ్చే సంవత్సరం ఏప్రిల్లో విడుదల కాబోతుంది.
 
ఉబుంటు టచ్ ఇన్ స్టాల్ చేయు విధానము


గెలాక్సి నెక్సస్ ఫోన్ లో ఇన్ స్టాల్ చేయబడిన ఉబుంటు టచ్

ఒకే నొక్కుతో ముప్పైకి పైగా తెలుగు డిక్షనరీల సమాచారం


 తెలుగు అసోషియోషన్ ఆఫ్ నార్త్ అమెరికా సౌజన్యంతో రూపొందిన ఉచిత ఆన్ లైన్ డిక్షనరీ ఆంధ్రభారతి తెలుగు నిఘంటు శోధన. ఈ ఆన్ లైన్ డిక్షనరీ లో మనం ఆంగ్ల, తెలుగు పదాలకు అర్ధాలను వెతకవచ్చు. ఇప్పుడు ఆంధ్రభారతి తెలుగు నిఘంటు శోధన లో ముప్పైకి పైగా నిఘంటువుల సమాచారం చేర్చబడింది. మనం ఇక్కడ ఇవ్వబడిన శోధనలో ఒక పదాన్ని ఇచ్చినపుడు వెంటనే ఆ పదానికి సంభందించి ముప్పైకి పైగా తెలుగు నిఘంటువుల ఉన్న సమాచారం ఒకే సారి మన ముందుంచుతుంది. అంతే కాకుండా మన కంప్యూటర్లో ఎటువంటి కీబోర్డ్ లేఅవుట్ మార్చకుండానే ఆంగ్ల, తెలుగు పదాలను ఇక్కడ టైప్ చేయవచ్చు.
ఆంధ్రభారతి తెలుగు నిఘంటు శోధన

తెలుగు మద్దతు లేని మొబైళ్ళలో కూడా తెలుగు వార్తా పత్రికలు చూడడానికి

 ఈమధ్య మనదేశంలో కొన్న ఫోన్లు చాలావరకు తెలుగు మధ్దతు కలిగి ఉంటున్నాయి. అయినప్పటికి నెట్ సౌలభ్యం ఉండి తెలుగు చూడలేని ఫోన్లు కూడా చాలానే ఉన్నాయి. వారు కూడా తెలుగు వార్తా పత్రికలు తమ మొబైల్లో చూడడానికి ఉపయోగపడే, అందుబాటులో ఉన్న అప్లికేషన్ ఒకే ఒకటి. అది ఇంచుమించు అన్ని మొబైల్ ఫ్లాట్ ఫాం లలో పనిచేసుంది. జావా, సింబయాన్, ఐ ఒయస్, బ్లాక్ బెర్రి, ఆండ్రాయిడ్ మరియు విండోస్ మొబైళ్ళలో పనిచేసుంది.దీనిని ఉపయోగించి తెలుగు  వార్తా పత్రికలు మాత్రమే కాకుండా కన్నడ, తమిళం, మళయాళం,హిందీ మరియు ఆంగ్ల వంటి 11 భాషలకి సంభందించిన 72 ప్రముఖ భారతీయ దిన పత్రికలు ఫోన్ లోనే చూడవచ్చు. అదే న్యూస్ హంట్. దీనిని ఇక్కడ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా http://m.newshunt.com అన్న సైటుకి మన ఫోను లేదా కంప్యూటర్ వెబ్ బ్రౌసర్ ద్వారా వెళ్ళి నేరుగా దిన పత్రికలను చదువుకోవచ్చు.
ఆండ్రాయిడ్ లో న్యూస్ హంట్

విజ్ఞానపు గని ఇప్పడు మీ అరచేతిలో

 ప్రంపంచంలో అతి పెద్ద విజ్ఞాన బండాగారం వికిపీడియా. ఇక్కడ రాత్రి అనక పగలనక ప్రతిక్షణం సమాచారం చేర్చబడుతూనే ఉంటుంది. ఎదో పెద్ద సంస్థ పనిగట్టుకొని వేలకువేలు ఉధ్యోగులని నియమించి కోట్లు వెచ్చించి అంతకుమించి సంపాదించడానికి ఈ సమాచారాన్ని పోగు చేయడంలేదు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మనలాంటి ప్రజల కాళీ సమాయంలో స్వచ్చంధంగా సమాచారాన్ని అందించడం వలన తయారైన వికీపీడియా నుండి ఎవరైనా సమాచారాన్ని ఉచితంగా అపరిమితంగా వాడుకోవచ్చు. వ్యాపార ప్రకటనలు లేకుండా అంత సమాచారాన్ని ఉచితంగా అందించడం ఒక్క వికీపీడియా కే సొంతం. సుమారు 280 భాషలలో రెండు కోట్ల వ్యాసాలను కలిగిఉంది.
 ఇప్పుడు వికీపీడియాని మన మొబైళ్ళలో కూడా ఇన్ స్టాల్ చేసుకోవచ్చు. ఆండ్రాయిడ్, ఐ ఒయస్ మరియు విండోస్ మొబైళ్ళకి ఈ అప్లికేషన్ ఉచితంగా అందుబాటులో ఉంది. ఆండ్రాయిడ్ మొబైల్ లేదా టాబ్లెట్ వాడేవారు ఇక్కడ నుండి ఇన్ స్టాల్ చేసుకోవచ్చు. సెట్టింగ్స్ లో భాషను మార్చుకోవడం ద్వారా మనం కోరుకున్న భాషలో వికీపీడియాని చూడవచ్చు. నచ్చిన వ్యాసాన్ని సులభంగా పంచుకొనే అవకాశం కూడా ఉంది.

ఆండ్రాయిడ్ మొబైల్ లో తెలుగు వికీపీడియా