ఆండ్రాయిడ్ ఫోన్లో మనకు కావలసిన అప్లికేషన్లు ఇన్ స్టాల్ చేయడం ఎలా?

 ఈ రోజుల్లో ఎవరి దగ్గర చూసినా ఆండ్రాయిడ్ ఫోన్లే. ఆండ్రాయిడ్ కి లభ్యమయ్యే ఉచిత అప్లికేషన్ల వలన ఆండ్రాయిడ్ అంత ప్రాచూర్యం లభించింది. నెట్ ఉన్న ఫోన్లో ప్లే స్టోర్ లో వెతికి సులభంగా ఎన్నో రకాల ఉచిత అప్లికేషన్లు ఉచితంగా చాలా సులభంగా ఇన్ స్టాల్ చేసుకోవచ్చు. అంతే కాకుండా ప్లే స్టోర్ లో పుస్తకాలు, సినిమాలు, ఆటలు మరియు అప్లికేషన్లు కొనుక్కోవచ్చు. ఆండ్రాయిడ్ కి ప్లే స్టోర్ మాదిరి అప్లికేషన్ లు చాలానే అందుబాటులో ఉన్నాయి. వాటిని గూర్చి తరువాతి పోస్టులలో చూద్దాం.


 ప్లే స్టోర్ లో ఈ మధ్య చాలా రకాల  అప్లికేషన్లు భధ్రతాకారణాల వలన కానీ నిబంధనలు అతిక్రమించడం వల్లకాని వేరువేరు కారణాలతో తొలగించారు. వాటిని కూడా మనం ఇన్ స్టాల్ చేసుకోవచ్చు. సాధారణంగా ఆండ్రాయిడ్ అప్లికేషన్ మనకి .apk అన్న ఫార్మాట్లో ఉంటుంది. మనకి కావలసిన అప్లికేషన్ల .apk ని మనం నేరుగా డెవలపర్ సైటు నుండి డౌన్లోడ్ చేసుకొవాలి. గూగుల్లో అప్లికేషన్ పేరు ని బట్టి వెదకడం ద్వారా డెవలపర్ సైటుకి సులభంగా వెళ్ళవచ్చు. అక్కడ మన ఫోను యొక్క ఆండ్రాయిడ్ వెర్షన్ కి సరిపడు తాజా వెర్షన్  అప్లికేషన్ యొక్క .apk ఫైల్ ని మనం డౌన్లోడ్ చేసుకొవాలి. కంప్యూటర్లో డౌన్లోడ్ చేసుకొన్నట్లయితే ఆ ఫైల్ ని ఫోన్లో కి డాటా కేబుల్ ద్వారా కాపీ చేసుకోవాలి. .apk ఫైల్ ని ఇన్ స్టాల్ చేసుకొనే ముందు క్రింధి చిత్రంలో చూపినట్లు Settings - Security - Allow installing apps from unknown sources other than Google play అన్న ఆప్షన్ని టిక్ చేసుకోవాలి. తరువాత మనం డౌన్లోడ్ చేసుకొన్న .apk ఫైల్ ని రెండుసార్లు నొక్కినపుడు ఇన్ స్టాల్ చెయ్యాలా అని ఆడుగుతుంది. అప్పుడు ఇన్ స్టాల్ అన్న బటన్ ని నొక్కినపుడు అప్లికేషన్ మన ఫోన్ లో ఇన్ స్టాల్ చేయబడుతుంది.