ఎన్నో ఆపరేటింగ్ సిస్టంలకు మూలంగా నిలిచిన ఆపరేటింగ్ సిస్టం డెబియన్. ఉబుంటు, మింట్ వంటి ప్రముఖ ఆపరేటింగ్ సిస్టంలతో పాటు ఎన్నో గ్నూ లినక్స్ ఆపరేటింగ్ సిస్టంలు దీనిని ఆధారంగా తయారుచేయబడినాయి. ఉచిత స్వేచ్ఛా సాఫ్ట్వేర్ సిధ్దాంతాలకు అనుగుణంగా తయారుచేయబడిన డెబియన్ని లినక్స్ ఆపరేటింగ్ సిస్టంలలో కెల్ల స్థిరమైనదిగా, బధ్రత గలిగినదిగా చెబుతారు. అన్నిరకాల కంప్యూటర్లలో (టాబ్లెట్లు, డెస్క్ టాప్, సర్వర్,ఇంటెల్, ఎఎమ్ డి, ఎఆర్ ఎమ్) పని చేస్తుంది. కనుక దీనిని యూనివర్సల్ ఆపరేటింగ్ సిస్టం అంటారు. సుమారు రెండు సంవత్సరాల ఆభివృధ్ది తరువాత డెబియన్ యొక్క తాజా వెర్షను 7.0 నిన్న విడుదలైంది. ఆధికార విడుదల ప్రకటనని ఇక్కడ చూడవచ్చు.