ఉబుంటు టచ్ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
ఉబుంటు టచ్ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

పైరేటెడ్ సాఫ్ట్వేర్ వాడుకర్లకి శుభవార్త ! ప్రపంచంలో ఎక్కువగా వాడబడుతున్న ఉచిత ఆపరేటింగ్ సిస్టం విడుదలైంది.

 ఇప్పుడే ప్రపంచంలో ఎక్కువగా వాడబడుతున్న ఉచిత ఒపెన్ సోర్స్ ఆపరేటింగ్ సిస్టం విడుదలైంది. దానితో పాటు ఫోన్లకి, టాబ్లెట్లకి, లాప్ టాప్, డెస్క్ టాప్, సర్వర్లలో వాడుకోవడానికి వివిధ ఆపరేటింగ్ సిస్టములు విడుదలైనాయి. విశేషం ఏమిటంటే వీటిని ఎవరైనా ఉచితంగా డౌన్లోడ్ చేసుకొని వాడుకోవచ్చు. చట్టపరంగానే డబ్బులు కట్టకుండా ఎన్ని కంప్యూటర్లలో అయిన ఇన్ స్టాల్ చేసుకోవచ్చు. ఎటువంటి లైసెన్స్ కీలు అవసరం లేదు. మీ ఆపరేటింగ్ సిస్టం నకిలీదని పదేపదే విసిగించదు. పైరేటెడ్ సాఫ్ట్వేర్ నుండి విముక్తి కావడానికి ఇదే సరైన అవకాశం.   
 ఉబుంటు 13.10 ఇప్పుడే విడుదలైంది. దానితో పాటు ఉబుంటు టచ్ 1.0(ఫోన్లకి మరియు టాబ్లెట్లకి), ఉబుంటు సర్వర్ మరియు లాప్ టాప్, డెస్క్ టాప్ కొరకు కుబుంటు, లుబుంటు, క్షుబుంటు, ఎడ్యుబుంటు, ఉబుంటు స్టుడియో, ఉబుంటు గ్నోం,  ఉబుంటు కైలిన్ లు కూడా విడుదలైనాయి. 
ఉబుంటు డెస్క్ టాప్

ఉబుంటు ఫోన్

 ఇప్పటికే ఉబుంటు వాడుతున్నవారు కొత్త వెర్షన్ కి డబ్బులు చెల్లించకుండానే ఉచితంగా అప్ గ్రేడ్ చేసుకోవచ్చు. ఎలా అనేది ఇక్కడ చూడవచ్చు. కొత్త ఫీచర్లతో విడుదలైన ఉబుంటు 13.10 గురించి పూర్తి విశేషాలు వీడియోలు ఇక్కడ చూడవచ్చు. మిగిలిన ఆపరేటింగ్ సిస్టములలో కొత్తగా వచ్చిన మార్పులని ఇక్కడ చూడవచ్చు.
 ఉబుంటు మరియు మిగిలిన ఆపరేటింగ్ సిస్టములు క్రింది లింకుల నుండి ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు.

ఉబుంటు టచ్ తొలి వెర్షన్ విడుదల కాబోతుంది

 ఉబుంటు టచ్ అంటే ప్రముఖ ఉచిత లినక్స్ డెస్క్ టాప్ ఆపరేటింగ్ సిస్టం అయిన ఉబుంటు యొక్క ఫోన్ మరియు టాబ్లెట్ల ఆపరేటింగ్ సిస్టం. గత కొంత కాలంగా వేగంగా అభివృధ్ది చేయబడుతున్న ఉబుంటు టచ్ ఆధికారికంగా గూగుల్ నెక్సాస్ పరికరాలకి (గెలాక్సి నెక్సస్, నెక్సస్4, నెక్సస్7, నెక్సస్10) మధ్దతు ఇవ్వడమే కాకుండా మూడు సంవత్సరాల పాటు అప్ డేట్స్ అందించబడును. ఉబుంటు డెస్క్ టాప్ ఆపరేటింగ్ సిస్టం తరువాతి వెర్షన్ అయిన 13.10 తో పాటు ఉబుంటు టచ్ 1.0 వెచ్చే నెల 17న విడుదలకాబోతుంది. అధికారికంగా గెలాక్సి నెక్సస్, నెక్సస్4, నెక్సస్7, నెక్సస్10 లకు మాత్రమే మధ్దతు కలిగి ఉన్నప్పటికి అనధికారికంగా వివిధ ఫోన్లకి టాబ్లెట్ కి కూడా అందుబాటులో ఉంది. ఉబుంటు టచ్ తో తయారు చేయబడిన తొలి ఫోను వచ్చే సంవత్సరం ఏప్రిల్లో విడుదల కాబోతుంది.
 
ఉబుంటు టచ్ ఇన్ స్టాల్ చేయు విధానము


గెలాక్సి నెక్సస్ ఫోన్ లో ఇన్ స్టాల్ చేయబడిన ఉబుంటు టచ్

స్వేచ్ఛా సాఫ్ట్వేర్ల వెలుగులు

 మొబైల్ వరల్డ్ కాంగ్రేస్ 2013 లో ప్రదర్శించిన స్వేచ్ఛా సాఫ్ట్వేర్లకి ఆమోఘమైన ప్రతిస్పందన లభించింది. డెస్క్ టాప్ రంగంలో పోటీని ఇవ్వనప్పటికి, సాఫ్ట్ వేర్ దిగ్గజాలే తయారీదారులు దొరక్క చతికిలపడిన ఈరంగంలో ఎటువంటి లాభాపేక్షా లేని స్వేచ్ఛా సాఫ్ట్వేర్ల సంస్థలు అన్ని వర్గాల నుండి సానుకూలతను, మన్ననలను అందుకోవడం నిజంగా అద్బుతమే. 
 ఇక్కడ మొదట చెప్పుకోవలసింది ఖచ్చితంగా ఫైర్ ఫాక్స్ మొబైల్ ఆపరేటింగ్ సిస్టం గురించే. మొదట్లో అంతగా ఆకర్షించనప్పటికి రానురాను తయారీదారులను,మొబైల్ ఆపరేటర్ల ఆదరణను బాగానే సంపాదించుకోగలిగింది. లినక్స్ పై HTML5 తో మొజ్జిల్లా వారు నిర్మించిన ఈ స్వేచ్ఛా మొబైల్ ఆపరేటింగ్ సిస్టం తక్కువ సామర్ధ్యం గల ఫోన్లలో కూడా సమర్దవంతంగా పనిచేయగలదు. ఇప్పటికే ఆల్కాటెల్ మరియు ZTE ఫోన్లని ప్రదర్శించగా హువాయ్, యల్ జి మరియు సోనిలు కూడా విడుదలచేయడానికి ముందుకు వచ్చాయి.
 తరువాత చెప్పుకోవలసింది ప్రతిష్టాత్మకమైన టైజెన్. లినక్స్ ఫౌండేషన్ సారధ్యంలో సాంసంగ్, ఇంటెల్, పానాసోనిక్ మరియు హువాయ్ వంటి తయారీదారుల, డొకోమో,ఆరెంజ్ మరియు స్ప్రింట్ వంటి మొబైల్ ఆపరేటర్ దిగ్గజాల కలయికతో ఏర్పడిన టైజెన్ ఒక్క మొబైల్ ఫోన్ కే కాకుండా టాబ్లెట్, నెట్ బుక్, టీవీ మరియు వాహనాల సమాచారాన్ని,వినోదాన్ని అందించే పరికరాలలో పనిచేసే విదంగా రూపొందిస్తున్నారు. భవిష్యత్తులో ఆండ్రాయిడ్ ని అధిగమించగల సత్తా ఉన్నదని దీని వెనుక గల సంస్థలని బట్టే చెప్పవచ్చు.
 ప్రపంచంలో ఎక్కువగా వాడే ఆపరేటింగ్ సిస్టం లలో మూడవది, స్వేచ్ఛా ఆపరేటింగ్ సిస్టంలలో మొదటిది అయిన ఉబుంటు తయారీదారులచే ప్రకటించబడిన ఉబుంటు టచ్ (ఫోన్లు,టాబ్లెట్ల కోసం ఉబుంటు ఆపరేటింగ్ సిస్టం) కూడా మొబైల్ వరల్డ్ కాంగ్రేస్ 2013 లో అత్యధిక ఆదరణ పొందినది. తెరపై ఎటువంటి మీటలు లేకుండా తెర అంచులనే వాడుకోగల ఈ ఆపరేటింగ్ సిస్టం ఉత్తమ ఆవిష్కరణగా కూడా గుర్తింపు పొందినది.
 ఇక ఈ రంగంలో అగ్రస్థానంలో ఉన్న ఆండ్రాయిడ్ తన ప్రస్థానాన్ని కొనసాగిస్తూ తన ఆధిపత్యాన్ని నిలుపుకుంది.

చేతు(త)ల్లో స్వేచ్ఛా సాఫ్ట్వేర్

 తొందరలో రాబోతున్న స్వేచ్ఛా మొబైల్ ఆపరేటింగ్ సిస్టంల నమూనా ఫోన్లని క్రింది వీడియోలలో చూడవచ్చు.
ఫైర్ ఫాక్స్

ఉబుంటు


టైజెన్

CNET మొబైల్ వరల్డ్ కాంగ్రేస్ 2013 ఉత్తమం గా ఎంపికైన


 ఈరోజు ముగిసిన మొబైల్ వరల్డ్ కాంగ్రేస్ 2013 లో CNET వారి ఉత్తమ ఎంపికగా ఉబుంటు టచ్ ఎన్నికయినట్లు ప్రకటించారు. తయారీదారుల, మొబైల్ ఆపరేటర్ల ఆదరణ పొందిన ఫైర్ ఫాక్స్ చివరి వరకు పోటీలో నిలిచి రెండో స్థానంలో నిలిచినది.
ఉబుంటు టచ్ గురించిన CNET విశ్లేషణ క్రింది వీడియోలో చూడవచ్చు.

మరికొన్ని ఫోన్లు, టాబ్లెట్ల కోసం ఊబుంటు టచ్ ఆందుబాటులోకి రానుంది.

 మొదట గూగుల్ నెక్సాస్ ఫోన్లు టాబ్లెట్లలో మాత్రమే ఇన్ స్టాల్ చేయడానికి విడుదల అయిన ఉబుంటు టచ్(ఫోన్లు, టాబ్లెట్ల కోసం ఊబుంటు ఆపరేటింగ్ సిస్టం) ఇప్పుడు మరికొన్ని ఫోన్లు, టాబ్లెట్ల కోసం ఆందుబాటులోకి రానుంది. ఉబుంటు టచ్ ఇన్ స్టాల్ చేయదగిన ఫోన్లు, టాబ్లెట్ల పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి.

మొబైల్ వరల్డ్ కాంగ్రేస్ 2013 లో ప్రదర్శించబడిన ఉబుంటు టాబ్లెట్ వీడియో

 ఇప్పటికే ప్రకటించిన ఉబుంటు టచ్ (మొబైల్ మరియు టాబ్లెట్ల కోసం ఉబుంటు) ఆపరేటింగ్ సిస్టం తో నడిచే గూగుల్ నెక్సాస్ ఫోన్లు మరియు టాబ్లెట్లను మొబైల్ వరల్డ్ కాంగ్రేస్ 2013 లో ప్రదర్శించబడినవి. క్రింది వీడియోలో ఉబుంటు ఇన్ స్టాల్ చేసిన నెక్సాస్ 10 టాబ్లెట్ ని  ఉబుంటు టచ్ ఆపరేటింగ్ సిస్టం ముఖ్య విశిష్టతలను చూడవచ్చు.


ఉబుంటు టచ్ సాఫ్ట్వేర్ డెవలపర్ కిట్ ఆల్ఫా విడుదలైంది

 ఉబుంటు టచ్ (ఉబుంటు ఫోన్ మరియు టాబ్లెట్ ఆపరేటింగ్ సిస్టమ్) కి అనువర్తనాలు తయారుచేయడాని ఉబుంటు సాఫ్ట్వేర్ డెవలపర్ కిట్ ఆల్ఫా విడుదలైంది. ఉబుంటు సాఫ్ట్వేర్ డెవలపర్ కిట్ ని మన ఉబుంటు డెస్క్ టాప్ నందు ఇన్ స్టాల్ చేసు కొని ఉబుంటు ఫోన్ మరియు టాబ్లెట్ ఆపరేటింగ్ సిస్టమ్ కి అనువర్తనాలు తయారుచేయవచ్చు. ఉబుంటు సాఫ్ట్వేర్ డెవలపర్ కిట్ ని ఇన్ స్టాల్ చేయుడం మరియు అనువర్తనాల తయారి ఇక్కడ వివరించబడినది. ఉబుంటు ఫోన్ మరియు టాబ్లెట్ ఆపరేటింగ్ సిస్టమ్ కి మొదటి అప్లికేషన్ మీదే కావచ్చు ప్రయత్నించండి.

ఫోన్లు,టాబ్లెట్ల కోసం ఉబుంటు ఆపరేటింగ్ సిస్టం విడుదలైంది

 ఫోన్లు,టాబ్లెట్ల కోసం కనోనికల్ వారు ఉబుంటు ఆపరేటింగ్ సిస్టం యొక్క డెవలపర్ ప్రివ్యు ని విడుదలచేసారు. ఫోన్ మరియు టాబ్లెట్ ఆపరేటింగ్ సిస్టం రెండిటిని సంయుక్తంగా ఉబుంటు టచ్ అని నామకరణం చేసారు. గెలాక్సి నెక్సస్, నెక్సస్ 4, నెక్సస్7 మరియు నెక్సస్10 ఫోన్ మరియు టాబ్లెట్ల లలో ఉబుంటు ఆపరేటింగ్ సిస్టం(ఉబుంటు టచ్ డెవలపర్ ప్రివ్యు) ని ఇన్ స్టాల్ చేసుకోవచ్చు. ఆయా ఇన్ స్టాలేషన్ ఇమేజి లను ఇక్కడ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇన్ స్టాల్ చేయు విధానమును సవివరంగా ఇక్కడ చూడవచ్చు.


ఉబుంటు టాబ్లెట్

 తొందరలో ఉబుంటు టాబ్లెట్ ఆపరేటింగ్ సిస్టం ని విడుదలచేయబోతుంది. దానికి సంబంధించిన చలన చిత్రాన్ని మరియు చ్రిత్రాలను విడుదల చేసారు. ఆకర్షణీయమైన ఉబుంటు టాబ్లెట్ ఆపరేటింగ్ సిస్టం గురించిన మరింత సమాచారం కోసం ఇక్కడ చూడండి.