మన ఫోన్‌ యొక్క రేడియేషన్ ఎంత అన్నది తెలుసుకోవడం ఎలా?

 ఈ మధ్యకాలంలో ఎక్కువ స్పెసిఫికేషన్ గల దేశీయ, చైనా తయారీ ఫోన్లు తక్కువ ధరల్లో లభిస్తున్నాయి. అయితే వీటిలో ఎన్ని ఫోన్లు భారత ప్రభుత్వం ప్రజల ఆరోగ్యం కొరకు జారీచేసిన రేడియోషన్ పరిమితులను గౌరవిస్తున్నాయి. దీనిని తెలుసుకోవడం ఎలా?  మనిషి ఆరోగ్యంపై ధుష్ప్రభావాలు లేకుండా ఉండడానికి మన ప్రభుత్వం మొబైల్ ఫోను యొక్క రేడియేషన్ పరిమితిని
( దీనిని షార్ వాల్యూ లేదా స్పెసిఫిక్ అబ్జార్బ్‌షన్ రేట్ అని అంటారు)1.6 W/Kg కన్నా తక్కువగా ఉండాలని నిర్ణయించినది.
  మన ఫోను యొక్క షార్ విలువను తెలుసుకోవడానికి *#07# అన్న నెంబరుకు డయల్ చేస్తే చాలు. మన ఫోను యొక్క షార్ విలువ తెరపై చూపించబడుతుంది.