గూగుల్ ఎర్త్ ప్రో వెర్షను ఉచితంగా

మనం గూగుల్ ఎర్త్‌ని ఉపయోగించి సముద్రాలను, పర్వతాలను, అంతరిక్షంలో గ్రహాలను, భూమి మీద ఉన్న కట్టడాలు మరియు రహదారులను పటాల రూపంలోను మరియు నిజమైన సాటిలైట్ ఇమేజిల రూపంలోను చూడవచ్చు. గూగుల్ ఎర్త్ ని ఇప్పుడు విద్యార్ధులు, సాధారణ ప్రజలు, మీడియా మరియు ప్రభుత్వాలు ఇలా అందరు వారివారి అవసరాలకు తరచు ఉపయోగించుకుంటున్నారు. అయితే గూగుల్ 399 డాలర్లు / సంవత్సరం విలువ చేసే
గూగుల్ ఎర్త్ ప్రో వెర్షనును ఉచితంగా అందిస్తున్నారు. దీనికి మనం చేయవలసిందల్లా ఇక్కడ నుండి గూగుల్ ఎర్త్ ప్రో వెర్షనును దింపుకోని ఇన్‌స్టాల్ చేసుకోని  ఇక్కడ మన వివరాలు ఇవ్వడం ద్వారా మనం ప్రో లైసెన్స్ కీని పొందవచ్చును.

గూగుల్ ఎర్త్ ఉచిత వెర్షనులో లేని ప్రో వెర్షనులో ఉండే ఫీచర్లలో ముఖ్యమైనవి.
  • 4800 x 3200 రిజల్యూషనుతో చిత్రాలను ముద్రించుకోవచ్చు.
  • మన గూగుల్ ఎర్త్ విహరణాన్ని హెచ్‌డి వీడియో రూపంలో చిత్రీకరించుకోవచ్చు.
  • ఒకేసారి 2500 చిరునామాలను స్ప్రెడ్ షీట్‌లోకి దింపుకోవచ్చు.
  • సమాంతరంగా రెండు ప్రదేశాల మధ్య దూరాన్ని మాత్రమే కాకుండా వివిధ ఆకారాల్లో మనం ఎంచుకొన్న ప్రదేశాన్ని కొలవవచ్చు.