నెక్సాస్ 5 లో ఉండే లాంచర్ ఇప్పుడు అన్ని ఆండ్రాయిడ్ పరికరాల్లో ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు.

గూగుల్ యొక్క నెక్సాస్ పరికరాలను ఇతర పరికరాలతో వేరుచేసేది లేటెస్ట్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం, ఎటువంటి తయారీదారు అప్లికేషన్‌లు, మార్పులు లేని శుద్దమైన ఆండ్రాయిడ్ మరియు గూగుల్ ఎక్స్‌పిరియన్స్ లాంచర్. ఈ గూగుల్ ఎక్స్‌పిరియన్స్ లాంచర్ ని గూగుల్ నౌ లాంచర్ అని కూడా అంటారు. హోం స్క్రీన్ కి ఎడమ వైపుకి లాగినపుడు
నేరుగా గూగుల్ నౌకి వెళ్ళవచ్చు. దీనిని మనం నెక్సస్ 5 ఫోన్ లో మాత్రమే మనం చూడవచ్చు. దీని వలన నెక్సస్ 5 ఫోన్ చూడడానికి ఇతర ఫోన్లకన్నా బిన్నంగా, ఆకర్షణీయంగా ఉంటుంది. ఇతర ఫోన్‌లలో ఉండే లాంచర్‌కి మరియు గూగుల్ నెక్సస్ 5 లాంచర్ కి ఉంటే తేడా మనం క్రింది చిత్రాలలో చూడవచ్చు.

మోటో జి హోమ్‌
నెక్సస్ 5 హోమ్‌
ఇతర ఆండ్రాయిడ్ ఫోన్‌లలో మెనూ

నెక్సస్ 5 లో మెనూ
హోమ్‌ స్క్రీన్ పై టచ్ చేసి పట్టుకున్నపుడు ఇతర ఫోన్‌లలో
హోమ్‌ స్క్రీన్ పై టచ్ చేసి పట్టుకున్నపుడు నెక్సస్ 5 లో
నెక్సస్ లో కాకుండా ఈ గూగుల్ నౌ లాంచర్ సైనోజెన్‌మోడ్ లో కూడా వస్తుంది. మిగిలిన ఫోన్‌లు వాడేవారు ఈ ఎక్స్‌పిరియన్స్ లాంచర్ ని వాడడం కోసం గోలాంచర్ వంటి ఆప్లికేషన్‌లను లేదా వివిధ థీమ్‌ ప్యాక్‌లు వాడుతుంటారు. ఇప్పుడు అవేవి ఇన్‌స్టాల్ చేసుకోకుండానే నేరుగా గూగుల్ నౌ లాంచర్ మన ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. గూగుల్ తన గూగుల్ నౌ లాంచర్‌ని ఆండ్రాయిడ్ 4.1 మరియు తరువాతి వెర్షన్‌లు ఉన్న అన్ని పరికరాలలో పనిచేసే విధంగా, ఇన్‌స్టాల్ చేసుకోవడానికి ప్లేస్టోర్ ఉంచారు. దానిని మనం ఇక్కడ నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
సైనోజెన్‌మోడ్ హోమ్‌ స్క్రీన్ లో ఎక్స్‌పీరియన్స్ లాంచర్, వాతావరణాన్ని చూపించే క్లాక్ విడ్జెట్