Mac కేనా డాక్?

 మన సిస్టంలో ఇన్ స్టాల్ చేయ్బడిఉన్న వివిధ అప్లికేషన్లు తెరవడానికి  సాధారణంగా డెస్క్ టాప్ ఇకాన్, మెనూ, టాస్క్ బార్, లాంచర్ వంటి వివిధ పధ్ధతులు వాడుతుంటాము. అప్లికేషన్లు తెరవడానికి తమాషా అయిన కంటికి ఇంపైన మరొక విధానమే డాక్. ఆపిల్ వాడి ఖరీదైన ఆపరేటింగ్ సిస్టం అయిన మాక్ ద్వారా ఈ డాక్ బాగా ప్రసిధ్ది చెందినది. అంత ఖరీదు పెట్టలేని, ఉచిత ఆపరేటింగ్ సిస్టం వాడేవారికి డాక్ లేదా? 
 ఉచితంగా దొరికే డాక్ లు చాలా ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనది కైరో డాక్. ఇది పూర్తిగా ఉచితమే. ఇది ఉచిత స్వేచ్చా సాఫ్ట్ వేర్. ఎవరైనా ఉచితంగా ఇన్ స్టాల్ చేసుకోవచ్చు. ఇది డెబియన్, ఉబుంటు, మింట్, మరియు ఫెడోరా వంటి అన్ని ఉచిత ఆపరేటింగ్ సిస్టం లలో పనిచేస్తుంది. దీనిని మనం వాడుతున్న ఆపరేటింగ్ సిస్టం యొక్క సాఫ్ట్ వేర్ సెంటర్ అప్లికేషన్ నుండి ఇన్ స్టాల్ చేసుకోవచ్చు. కైరో డాక్ కి రకరకాల థీంలు అందుబాటులో ఉన్నాయి. అంతేకాకుండా ఇకాన్లు రూపం,పరిమాణం, కదలికలు, వాటిని నొక్కినపుడు అవి ప్రవర్తించే విధానం మరియు విండో తెరవబడు విధానం వంటి అన్ని లక్షణాలు మనకు నచ్చినట్లు మార్చుకోగలగడం లెక్కలేనన్ని ఆప్షన్లు కలిగి ఉండడం కైరో డాక్ ని మిగిలిన వాటి నుండి ప్రత్యేకంగా నిలబెడుతున్నాయి. కైరో డాక్ తక్కువ కాన్ఫిగరేషన్ గల సిస్టం లలో కూడా బాగా పనిచేస్తుంది.
ఉబుంటులో కైరో డాక్
గ్నోం డెస్క్ టాప్ పై కైరో డాక్