మన కంప్యూటర్ ని ఇంటర్ నెట్ ప్రపంచంతో అనుసంధానించే నెట్ పోర్ట్ పని చేయకపోతే మనం పిసిఐ నెట్ కార్డులను వాడుతుంటాము. మన ఆపరేటింగ్ సిస్టలో పనిచేసే నెట్ కార్డు మనకి దొరకనపుడు, లాప్‌టాప్ నెట్ పోర్ట్ చెడిపోయినపుడు లేదా మన కంప్యూటర్ యొక్క మధర్‌బోర్డ్ లో పిసిఐ స్లాట్‌లు అందుబాటులో లేనపుడు ఈ పిసిఐ కార్డులు మనకి ఉపయోగపడవు. ఈ పిసిఐ నెట్ కార్డులకి చవకైన,సులభమైన ప్రత్యామ్నాయాన్ని ఈ వీడియోలో చూడవచ్చు. ఎటువంటి కంప్యూటరు పరిజ్ఞానం లేనివారుకూడా వాడుకోవచ్చు.
మొబైళ్ళు,టాబ్లెట్లలో పెన్ డ్రైవ్ వాడుకోడానికి
మొబైళ్ళు మరియు టాబ్లెట్లలో డాటా స్టోరేజ్ పరిమితులను అధికమించడానికి చవకైన(కేవలం 20 రూపాయలు) ప్రత్యామ్నాయాన్ని ఈ వీడియోలో చూడవచ్చు.
ఉచిత తెలుగు ఆన్‌లైన్ రేడియో
ఉచితంగా తెలుగు ఆన్‌లైన్ రేడియో స్టేషన్‌లను మన డెస్క్‌టాప్ మ్యూజిక్ ప్లేయర్లలో జతచేసుకొని మనకు కావలసినప్పుడు వినడం ఎలాగో ఈ వీడియోలో చూడవచ్చు.
వెబ్ సైట్లలో లో ఉండే అవాంచిత వ్యాపార ప్రకటనలను నివారించండిలా
మనం ఒక వెబ్ సైట్ ని సందర్శించినపుడు మనకి కావలసిన విషయాలతో పాటుగా
చాలారకాల ప్రకటనలు(flash adds,text adds,popup) కనిపిస్తుంటాయి. వీటివలన
వాడుకరికి విసుగు తో పాటు ఆ వెబ్ పేజి నెమ్మదిగా లోడ్ కావడం,విలువైన సమయం
మరియు బాండ్ విడ్త్ వృధా అవుతాయి. ఈ సమస్యకు చక్కని పరిష్కారం ఈ వీడియోలో చూడవచ్చు.
వికీపీడియాలో ఉన్న సమాచారాన్ని పిడియఫ్ ఫైల్‌గా మార్చడం
అంతులేని సమాచారాన్ని మనకు ఉచితంగా అందించే వికీపీడియాలోని వ్యాసాలను నెట్ లేనపుడు చదువుకోవడానికి మరియు వివిధ పరికరాలలో చదువుకోవడానికి అనుగుణంగా పిడియఫ్ లేధా ఇ బుక్ గా మార్చుకునే విధానమును ఈ వీడియోలో చూడవచ్చు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు
(
Atom
)