ఒపెన్ సోర్స్ మాయాజాలం

 మొదట క్రింది విడియోని చూసి ఆనందించండి.

ఈ అద్బుతమైన చిట్టి యానిమేషన్ వీడియోని పూర్తిగా ఒపెన్ సోర్స్ సాఫ్ట్ వేర్లని ఉపయోగించి  బ్లెండర్.ఆర్గ్ వారు నిర్మించారు.చలనచిత్రం చివరలో నిర్మాణంలో ఉపయోగించిన సాఫ్ట్ వేర్ల పేర్లని కూడా మనం గమనించవచ్చు.

 బ్లెండర్ అనేది 3D చిత్రాలను తయారుచేయడానికి ఉపయోగించే ఉచిత ఒపెన్ సోర్స్ అనువర్తనము. యానిమేషన్ సినిమాలు,ఆటలు నిర్మించడానికి కావలసిన చిత్రాలను బ్లెండర్ ని ఉపయోగించి తయారు చేయవచ్చు.బ్లెండర్ని ఉబుంటు వాడేవారు ఉచితంగా ఉబుంటు సాఫ్ట్ వేర్ సెంటర్ నుండి స్థాపించుకోవచ్చు.

 

బ్లెండర్ యొక్క విశిష్టతలు

 

బ్లెండర్ .ఆర్గ్ వారు నిర్మించిన చలనచిత్రాలు

యూనిటీ డెస్క్ టాప్ తో మీ పనులు సులభతరం చేసుకోండి

 ఉబుంటు యూనిటీ డెస్క్ టాప్ సులభంగా,వేగంగా కంప్యూటర్ మీద పనులు చేయడానికి అనుగుణంగా తీర్చిదిద్దారు. కొత్త కావడం వలన వాడుకరులు కొంత తికమక పడడానికి అవకాశం ఉంది.అందువలన ఉబుంటు కొత్తగా వాడేవారి కోసం యూనిటీ డెస్క్ టాప్ వాడకాన్ని గూర్చి సులభంగా వివరిస్తున్న ఈ వీడియో అందరికి ఉపయేగాపడుతుందని భావిస్తు.

ఉబుంటు 12.04 విడుదల వేడుక హైదరాబాద్ విశేషాలు

 ఓపెన్ సోర్స్ అభిమానులు ఉబుంటు 12.04 విడుదల వేడుక హైదరాబాద్ యొక్క విశేషాలు క్రింది లంకె నందు గమనించగలరు.

                   ఉబుంటు 12.04 విడుదల వేడుక హైదరాబాద్ విశేషాలు

నావలన అయితే కాదు మరి మీ వలన అవుతుందా?

 సాధారణ కంప్యూటర్ వాడుకరి లేదా ఒక విద్యార్ధి నిజంగా సాఫ్ట్వేర్ కొని వాడగలడా?
 
-->
Microsoft Windows 7 Home Basic - 5777.00

Microsoft Windows 7 Home Premium - 6775.00

Microsoft Windows 7 Professional - 10759.00

Microsoft Windows 7 Ultimate - 11448.00

Microsoft Office Home and Student 2010 - 3,999.00

Microsoft Office Home & Business 2010 - 9,499.00

Microsoft Office Professional 2010 -19,009.00

Microsoft Visio Professional 2010 - 27,200.00

Microsoft Publisher 2010 - 6,479.00

ఏదైనా ఒక కనీస యాంటి వైరస్ - 300.00/ఒక సంవత్సరం 

ఇక ఆపిల్ (మాక్)అయితే?

ఉబుంటు నెట్ వర్క్ అప్ గ్రేడ్

 ఉబుంటు ప్రతి ఆరు నెలలకి ఒక కొత్త వెర్షన్ విడుదల అగును.కొత్త విడుదలలో పాత దానిలో ఉన్న దోషాలను సరిచేసి, కొత్త ఫీచర్స్ తో అందిస్తారు.కనుక కొత్త వెర్షన్ ని వాడడం మంచిది.విడుదల అయిన ప్రతి సారి మనం ఇన్ స్టాల్ చెయ్యడం కష్టం కాబట్టి ఉబుంటు నెట్ వర్క్ అప్ గ్రేడ్ చేసుకోవచ్చు.కొత్త వెర్షన్ అందుబాటు లో ఉన్నపుడు అప్ డేట్ మేనేజర్ మనకి చూపిస్తుంది.మొదట పాత వెర్షన్ కి సంబందించిన అప్ డేట్ లన్ని ఇన్ స్టాల్ చేసుకొని ఆ తరువాత వెర్షన్ అప్ గ్రేడ్ ని చేసుకోవాలి.క్రింది చిత్రాల్లో అప్ గ్రేడ్ చేసే విధానము,అప్ గ్రేడ్ అయిన తరువాత మార్పులని గమనించవచ్చు. అప్ గ్రేడ్ అవడానికి 600MB నుండి మనం ఇన్ స్టాల్ చేసుకొన్న అప్లికేషన్ లని బట్టి 1GB వరకు డౌన్ లోడ్ చేసుకోవలసి వచ్చును.కనుక ఇంటర్ నెట్ నెమ్మది గా ఉంటే నెట్ వర్క్ అప్ గ్రేడ్ ప్రయత్నించకపోవడం మంచిది.కొత్త వాటినిడౌన్ లోడ్ చేసుకొంటున్నపుడు కంప్యూటర్ ఆగిపోయిన పర్వాలేదు మరలా అప్ గ్రేడ్ ని ప్రయత్నించవచ్చు.కాని ఇన్ స్టాల్ అయ్యేటపుడు కంప్యూటర్ ఆగిపోతే ఆపరేటింగ్ సిస్టం పాడయ్యే అవకాశాలు ఎక్కువ కాబట్టి కరెంటు పోని సమయాల్లో లేదా ప్రత్యామ్నాయం(UPS,Inverter) ఉన్నపుడే ప్రయత్నించండి.