నెట్ కనెక్షన్, కంప్యూటర్ లేకుండానే ఆండ్రాయిడ్ ఫోన్‌లో అప్లికేషన్‌లు ఇన్‌స్టాల్ చేయడానికి

  సాధారణంగా మన ఆండ్రాయిడ్ ఫోన్‌కి కావలసిన అప్లికేషన్‌లు గూగుల్  ప్లేస్టోర్‌లోకి వెళ్ళి ఇన్‌స్టాల్ చేసుకుంటాము. లేదా ఆ అప్లికేషన్ యొక్క .apk ఫైల్‌ని కంప్యూటర్‌లో డౌన్‌లోడ్ చేసుకొని ఫోనులోకి కాపీ చేసుకొని ఇన్‌స్టాల్ చేసుకొంటాము. దీనికి మన ఫోనుకు ఇంటర్‌నెట్ కనెక్షన్ లేదా ఇంటర్‌నెట్ కనెక్షన్ ఉన్న కంప్యూటర్ అయినా ఉండాలి. నెట్ కనెక్షన్, కంప్యూటర్ లేకుండానే ఆండ్రాయిడ్ ఫోన్‌లో అప్లికేషన్‌లు ఇన్‌స్టాల్ చేసుకోవడానికి మనకు కావలసిన అప్లికేషన్ లేదా గేమ్‌ ఇన్‌స్టాల్ చేయబడిఉన్న ఫోను మనకి అందుబాటులో ఉంటే చాలు. షేర్ ఆప్ అప్‌ని ఉపయోగించి ఒక ఫోన్‌ నుండి మరొక ఫోనుకి బ్లూటూత్ ద్వారా మనం ఫొటోలు మరియు వివిధ ఫైళ్ళను ఎలా అయితే పంపించుకుంటామో అలాగే అప్లికేషన్‌ల, గేమ్‌ల యొక్క .apk ఫైళ్లను కూడా పంపుకొని ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఈ షేర్‌ఆప్ అప్లికేషన్‌ని ఉపయోగించి యస్‌యమ్‌యస్(SMS) మరియు పేస్‌బుక్, గూగుల్ + వంటి వివిధ సామాజిక అనుసంధాన వేధికల ద్వారా వివిధ అప్లికేషన్‌ల యొక్క లంకెను పంచుకోవచ్చు, లేదా ఈమెయిల్‌లో అటాచ్‌మెంట్ వలే .apk ఫైళ్ళను పంపుకోవచ్చు మరియు అప్లికేషన్‌లని యస్‌డి కార్డులోకి బ్యాకప్ తీసుకోవచ్చు. ఈ ఆప్‌షేర్ ఆండ్రాయిడ్ ఆప్లికేషన్‌ని ప్లేస్టోర్ నుండి ఉచితంగాడౌన్‌లోడ్ చేసుకోవచ్చు. లేదా ఇక్కడ నుండి నేరుగా .apk ఫైల్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

షేర్‌ఆప్‌ 
 
ఒకేసారి మనకు కావలసిన అప్లికేషన్‌లన్నిటిని షేర్ చేసుకోవచ్చు
 
షేర్‌ఆప్‌ని ఉపయోగించి వివిధ రకాలుగా అప్లికేషన్‌లని షేర్‌ చేసుకోవచ్చు