కంప్యూటరు కొనాలనుకుంటున్నారా? తప్పని సరిగా మీకోసమే.

 సాధారణంగా ఇప్పటికి కూడా ఎక్కువగా కంప్యూటరు కొనాలనుకునే వారు అసెంబుల్డ్ కంప్యూటరు వైపే మొగ్గు చూపిస్తున్నారు. దానికి కారణం మన అవసరాలను తీర్చగల కంప్యూటరును మనకు వీలయిన ధరలోనే పొందగలిగే అవకాశం ఉంటుంది కనుక. అయితే అసెంబుల్డ్ కంప్యూటరు కొనేవారు మొదట కంప్యూటరు గురించి తెలిసినవారి దగ్గర కాని లేదా కంప్యూటరు కొట్టు వాడి దగ్గరకాని కాన్‌ఫిగరేషన్ తీసుకొని నాలుదైదు కొట్లు తిరిగి ధరను పోల్చుకొని ఎక్కడయితే తక్కువకి లభిస్తుందో అక్కడ కంప్యూటరును కొనుగోలు చేస్తారు. మనం ఎక్కడి తిరగకుండానే కంప్యూటరు కాన్‌ఫిగరేషన్ మరియు ధరలు మనం తెలుసుకోగలిగితే మనకు చాలా సమయం ఆధా అవుతుంది కదా. సరిగ్గా మనం ఇప్పుడు తెలుసుకోబోయో వెబ్‌సైటును ఉపయోగించి మనం ఇంట్లోనే ఉండి క్షణాల్లో కంప్యూటరు కాన్‌ఫిగరేషన్ మరియు ధరలు మనం తెలుసుకొని విడిబాగాలను నెట్ ద్వారా ఆర్డరు చేసుకోవచ్చు. 
 
అసెంబుల్ యువర్ పిసి డాట్ నెట్ అన్న సైటుకి వెళ్ళి బిల్డ్ పిసి లోకి వెళ్ళి మనకు వీలయిన ధరలో ప్రాససర్‌ని ఎంచుకోవాలి. 


తరువాతి మెట్టులో ఆ ప్రాససర్ కి నప్పే మధర్‌బోర్డులు చూపిస్తాయి. మనకు వీలయిన ధరలో మధర్ బోర్డును ఎంచుకోవాలి. 

 అలా మన కంప్యూటరుకి కావల్సిన అన్ని కంపాటిబుల్ విడిభాగాలను ఎంచుకోవాలి. ఈ పక్రియ పూర్తయిన తరువాత మొత్తం మన కంప్యూటరు కావలసిన విడిభాగాల ధర మరియు మొత్తం కంప్యూటరు ధర కనిపిస్తుంది. ఇక్కడి నుండే మనం నేరుగా ఫ్లిప్‌కార్ట్, అమేజాన్ మరియు స్నాప్‌డీల్ వంటి ప్రముఖ ఇ కామర్స్ సైటులలో విడిభాగాలను కొనుగోలు చేయవచ్చు. లేదా ధరలతో కూడిన సిస్టం కాన్‌ఫిగరేషన్ ని మనం పీడియఫ్‌గా డౌన్‌లోడ్ చేసుకునే సధుపాయం ఉండడం వలన దానిని ప్రింట్ తీసుకొని బయట కొట్లల్లో ధర ఎంత ఉందో కూడా పోల్చిచూసుకోవచ్చు.

 అయితే ఏటువంటి కంప్యూటరు పరిజ్ఞానం లేని వారు కూడా కంప్యూటరును ఎంచుకోవడానికి రికమండెడ్ రిగ్స్ లోకి వెళితే మనకు వీలయిన ధరలలో కంప్యూటరును నేరుగా ఎంచుకోవచ్చు.

 బయట కొనాలనుకున్నా ఒకసారి ధరను ఇక్కడ పోల్చిచూసుకోవడం వలన బుట్టలో పడే అవకాశాలు కూడా తగ్గుతాయి కదా! మరెందుకు ఆలస్యం మీ అభిరుచులకు, అవసరాలకు అనుగుణంగా మీకు వీలయిన ధరలోనే మీరే పిసిని తయారుచేసుకోండి. అలాగే మీ స్నేహితులకి కూడా సహాయం చెయ్యండి.

Printfriendly

Related Posts Plugin for WordPress, Blogger...

ఈ బ్లాగు ప్రముఖ పోస్ట్‌లు