పాఠశాలల కోసం ఒక ఆపరేటింగ్ సిస్టం

 ఎడ్యుబుంటు అనేది విద్యార్ధుల, పాఠశాలల అవసరాలకు అనుగుణంగా చేయబడిన ఉచిత స్వేచ్ఛా ఆపరేటింగ్ సిస్టం. అందుబాటులో ఉన్న విద్యా సంబంధిత ఉచిత స్వేచ్ఛా సాఫ్ట్వేర్లను ఉబుంటు ఆపరేటింగ్ సిస్టంతో కూర్చి ఆరు నుండి పద్దెనిమిది సంవత్సరాల వారు సులభంగా ఇళ్ళలో, తరగతిగదులలో ఇన్ స్టాల్ చేసుకొని వాడుకొనే విధంగా దీనిని తయారుచేసారు. ఆర్ధిక, సామాజిక పరిస్థితులతో నిమిత్తం లేకుండా జ్ఞానం మరియు నేర్చుకోవడం అనేవి ఉచితంగా అందరికి అందుబాటులో ఉండాలి అని నమ్మే విద్యార్ధుల, ఉపాధ్యాయుల, తల్లిదండ్రుల మరియు డెవలపర్లచే స్వచ్ఛందంగా అభివృధ్ది చేయబడుతుంది. ప్రతి ఆరు నెలలకొకసారి ఉబుంటుతో పాటు ఎడ్యుబుంటు కూడా విడుదలవుతుంది. ఎడ్యుబుంటు యొక్క 32 బిట్ 64 బిట్ డివిడీ ఇమేజిలను ఎవరైనా ఉచితంగా దింపుకోని వాడుకోవచ్చు. క్రింది లంకె నుండి ఎడ్యుబుంటుని నేరుగా లేదా టొరెంట్ ద్వారా దింపుకోవచ్చు.Printfriendly

Related Posts Plugin for WordPress, Blogger...

ఈ బ్లాగు ప్రముఖ పోస్ట్‌లు