మీ పిల్లల సృజనాత్మకతని వెలికితీయడం కోసం

చిన్నపిల్లల కోసం ఓపెన్ సోర్స్ ప్రపంచం అనేక సాఫ్ట్వేర్లని అందించింది. వాటిలో అత్యధిక ప్రజాధరణ పొందిన, పిల్లల మనసులని గెలిచిన, ప్రపంచవ్యాప్తంగా చాలా మంది విద్యార్ధులచే మరియు విద్యాసంస్థలచే వాడబడుతున్న, చాలా పత్రికల, వెబ్ సైట్ల రివ్యూలు, రేటింగ్లు పొందిన సాఫ్ట్వేర్, పూర్తిగా ఉచితంగా లభించే సాఫ్ట్వేర్ టక్స్ పెయింట్. ఉబుంటు వాడేవారు
ఉబుంటు సాఫ్ట్వేర్ సెంటర్ నుండి నేరుగా ఉచితంగా ఇన్స్టాల్ చేసుకోవచ్చు.

టక్స్ పెయింట్ యొక్క విశిష్టతలు:

  • అన్ని రకాల ఆపరేటింగ్ సిస్టంలలో (మాక్, విండోస్, లినక్స్) పనిచేస్తుంది.
  •  సులభమైన, ఆకర్షణీయమైన ఇంటర్ ఫేజ్.
  • అనేక భాషలలో లభిస్తుంది.
  • అనేక బ్రష్ లు
  • అనేక టూల్స్
టక్స్ పెయింట్
టక్స్ పెయింట్ ని ఉపయోగించి పిల్లలు వేసిన చిత్రాలని ఒకసారి చూడండి. టక్స్ పెయింట్ మీకు నచ్చితే మీ బంధు మితృలతో పంచుకోండి.