చేతిలో స్కానర్ పెట్టుకొని ఊరంతా వెతకడం ఎందుకు?

 మనం ఏదైనా డాక్యుమెంట్ స్కాన్ చేసుకోవాలంటే బయట నెట్ సెంటర్ కి వెళ్ళడం కాని స్కానర్ ఉన్న చోటికి వెళ్ళి డాక్యుమెంట్ స్కాన్ చేసుకుంటాము. కానీ మన చేతిలోనే స్కానర్ ఉన్న విషయం తెలియక డబ్బు వృధా చేసుకుంటాము. స్మార్ట్ ఫోన్లు ఈ రోజుల్లో చాలా మంది దగ్గర కనిపిస్తున్నాయి. మన ఫోన్ లో ఒక చిన్న అప్లికేషన్ ఇంస్టాల్ చేసుకోవడం ద్వారా మన స్మార్ట్ ఫోన్ ని స్కానర్ గా మార్చుకోవచ్చు. కాం స్కానర్ అను ఈ సాఫ్ట్ వేర్ ని ప్లే స్టోర్ నుండి ఉచితంగా పొందవచ్చు. ఇక్కడ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు. కాం స్కానర్ ని ఉపయోగించి మనం ఏదైనా డాక్యుమెంట్ ని స్కాన్ చేసుకొని పిడియఫ్ గా లేదా జెపిజి గా బధ్రపరుచుకోవచ్చు. మామూలు స్కానర్ ని ఉపయోగించి స్కాన్ చేసిన డాక్యుమెంట్ వలే దీనిని కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు కాం స్కానర్ కొనే వెర్షన్ని ఉచితంగా పొందవచ్చు. చేయవలసిందల్లా కాం స్కానర్ సైటులో నమోదు చేసుకొని కాం స్కానర్ ని మితృలతో షేర్ చేసుకోవడమే.

రాంబాబు కూడా ఆండ్రాయిడ్ నిపూణుడు కావచ్చు

 ప్రపంచంలో ఎక్కువగా వాడబడుతున్న మొబైల్ ఆపరేటింగ్ సిస్టం ఆండ్రాయిడ్ గురించి తెలుసుకోవాలని మనకి ఆసక్తి ఉంటే చాలు. టన్నుల కొద్ది సమాచారం మనకి అంతర్జాలంలో దొరుకుతుంది. కానీ సగటు రోజువారి ఫోన్ వినియోగదారుడి నుండి కాకలు తీరిన డెవలపర్లకి కావలసిన సమాచారం ఇకే చోట అందించాలంటే,ఎన్నో కంపెనీలు, మరెన్నో రకాల డివైస్ లు ప్రతీదాని గురించి సమగ్ర సమాచారం ఒకచోట అందించడం అంటే కష్టంతో, కర్చుతో కూడిన వ్యవహారమే కాకుండా ఇంచుమించుగా అసాధ్యమే. అలాంటి అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన ఘనత ప్రపంచ వ్యాప్తంగా ఉన్న డెవలపర్లచే డెవలపర్ల కోసం ఏర్పరచబడిన ఒక సమూహం వలన జరిగింది. అదే XDA డెవలపర్స్.
 XDA డెవలపర్స్ అనబడు వెబ్ ఫోరంలో రోజువారి ఫోన్ వినియోగదారుడి ఉపయోగపడు చిట్కాలు,వీడియో పాఠాలు, విష్లేశణలు,వివరణలు, అప్లికేషన్లు, థీములు, రకరకాల కస్టం రాం లు, ఫోన్లు అన్ లాక్, రూట్ చేయు విధానము వాటికి కావలసిన సాఫ్ట్ వేర్లు మరియు అప్లికేషన్ డెవలపర్లకి మరియు ప్లాట్ ఫాం డెవలపరలి కావలసిన సమాచారం ఇలా సర్వం ఒకే వేధిక పై లభిస్తాయి. మనం ఈ ఫోరంలలో ఎర్పరచబడిన సౌలభ్యం వలన మన డివైస్ కి సంభందించిన సమాచారం సులభంగా వెతుక్కోవడానికి వీలుగా ఉంటుంది.
 XDA డెవలపర్స్ లో ఒక్క ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం మాత్రమే కాకుండా ఒపెన్ సోర్స్ ఆపరేటింగ్ సిస్టం లు అయిన ఫైర్ ఫాక్స్ ఒయస్, టైజెన్, బడా, ఉబుంటు టచ్, జోలా సైల్ ఫిష్, వెబ్ ఒయస్ మరియు వాణిజ్య ఆపరేటింగ్ సిస్టం అయిన విండోస్ మొబైల్ గురించిన సమగ్ర సమాచారం ఇక్కడ దొరుకును. యాబై రెండు లక్షల మందికి పైగా నమోదు చేసుకొన్న వాడుకర్లని కలిగి ఉన్న XDA డెవలపర్స్ కి ప్రయామ్నాయం లేదనే చెప్పుకోవచ్చు. ఇక్కడ ఉన్న సమాచారాన్ని వాడుకొని లక్షల టపాలు వేల బ్లాగులు రాయొచ్చు. దీనిని సరిగ్గా వాడుకొంటే రాంబాబే కాదు ఎవరైనా ఆండ్రాయిడ్ నిపూణుడు కావచ్చు.

అత్యుత్తమ ఆండ్రాయిడ్ రామ్ ఉచితంగా

  
 తయారీదారు మనం కొన్న తరువాత ఆపరేటింగ్ సిస్టం కి సంబంధించిన అప్ డేట్ కొన్ని రోజుల పాటు మాత్రమే విడుదల చేస్తుంటారు. తయారీదారు అప్ డేట్ నిలిపివేసిన తరువాత ఆండ్రాయిడ్ లో వచ్చిన తాజా వెర్షన్ వాడాలనుకొంటే మనం తప్పకుండా ఇలా తయారు చేయబడిన ఆండ్రాయిడ్ రామ్ ల పై ఆధారపడ వలసిందే. ఎన్నో ఆండ్రాయిడ్ రామ్ లు మనకి దొరుకుతున్నప్పటికి వాటిలో నమ్మకమైనది ఎక్కువ గా వాడబడుతున్న ఆండ్రాయిడ్ రామ్ సైనోజెన్ మోడ్.
 గూగుల్ చే తయారుచేయబడిన ఆండ్రాయిడ్ మొబైల్ ఆపరేటింగ్ సిస్టం ప్రపంచంలో ఎక్కువ పరికరాల్లో ఇన్ స్టాల్ చేయబడిన మొబైల్ ఆపరేటింగ్ సిస్టం గా అనతికాలం లోనే రికార్డు సృష్టించింది. వాడుకరి అందుబాటులో అనేక అప్లికేషన్లు, సులభంగా ఇష్టం వచ్చినట్లు మార్చుకోగల గుణం, వెల విషయానికొస్తే అందరికి అందుబాటులో వివిధ శ్రేణుల్లో ఆండ్రాయిడ్ పరికరాలు లభించడం వలన ఆండ్రాయిడ్ ప్రపంచంలోనే ఎక్కువగా వాడబడుతుంది. అందువలన ప్రపంచవ్యాప్తంగా డెవలపర్లు వివిధ రకాల ఆండ్రాయిడ్ రామ్ లను తయారు చేస్తున్నారు. కనీస పరిజ్ఞానం ఉన్నవారు కూడా ఆండ్రాయిడ్ పరికరాల్లో కంప్యూటర్లలో ఎలా అయితే ఆపరేటింగ్ సిస్టం ఇన్ స్టాల్ చేసుకొంటామో అదే విధంగా ఈ ఆండ్రాయిడ్ రామ్ లను ఇన్ స్టాల్ చేసుకోవచ్చు.
 సైనోజెన్ మోడ్ అనేది ఆండ్రాయిడ్ ఒపెన్ సోర్స్ ని ఉపయోగించుకొని తయారుచేయబడిన ఆండ్రాయిడ్ రామ్. ఇది కూడా ఉచితంగా లభించే ఒపెన్ సోర్స్ సాఫ్ట్ వేర్. దీని ముఖ్యోధ్దేశం తయారీదారు అందించిన దానికన్నా అత్యుత్తమ పనితీరు, విశ్వసనీయత  అందించడమే. అంతేకాకుండా  తయారీదారు యొక్క ఆపరేటింగ్ సిస్టం లో లేనటువంటి అధనపు విశిష్టతలను మరియు మనకి నచ్చినట్లు ఎన్నో విధాలుగా అనుకూలీకరించుకునే అవకాశాన్ని మనకిస్తుంది. ఎక్కువ పరికరాలకి మధ్దతు నివ్వడం, అధికారిక ఆండ్రాయిడ్ విడుదలను అనుసరించి వెంటవెంటనే విడుదల చేయడం దీని ప్రత్యేకత.
  సైనోజెన్ మోడ్ మనకి నాలుగు రకాలు గా లభిస్తున్నప్పటికి రోజువారి వాడకం కోసం ఉద్దేశించిన స్టెబుల్ వెర్షన్ని వాడడం ఉత్తమం. సైనోజెన్ మోడ్ పనిచేసే పరికరాల చిట్టా ఇక్కడ చూడవచ్చు, డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీ మొబైల్ లేదా టాబ్లెట్ కి కావలసిన సైనోజెన్ మోడ్ అధికారిక చిట్టాలో లేకపోతే అనధికార చిట్టాని ఇక్కడ చూడండి. డౌన్లోడ్ పేజి నందే ఇన్ స్టాల్ చేయు విధానము వివరించు లంకె ఉంటుంది.
సైనోజెన్ మోడ్ 10 హోమ్

ఉచిత ఒపెన్ సోర్స్ ఆండ్రాయిడ్ అప్లికేషన్లు ఇన్ స్టాల్ చేయడానికి

 ఆండ్రాయిడ్ ఫోన్లు మరియు టాబ్లెట్లలో ఒపెన్ సోర్స్ అప్లికేషన్లు ఇన్ స్టాల్ చేయడానికి వాటిని ఆటో అప్ డేట్ చేయడానికి ఉపయోగపడు అప్ స్టోర్ అప్లికేషన్ F-Droid. తాజా వెర్షను F-Droid.apk ఫైల్ ని ఇక్కడ నుండి డౌన్లోడ్ చేసుకొని ఇన్ స్టాల్ చేసుకోవచ్చు. పూర్తిగా ఒపెన్ సోర్స్ అప్లికేషన్లు మాత్రమే దొరకడమే ఈ F-Droid అప్ స్టోర్ ప్రత్యేకత. అంతేకాకుండా గూగుల్ ప్లే స్టోర్ లో స్థానం కోల్పోయిన కొన్ని ఉపయోగపడే అప్లికేషన్లు కూడా దీనిలో దొరుకుతాయి.
F-Droid ఆప్ స్టోర్