ఉచితంగా పిల్లల వినోదం కోసం హెచ్ డి వీడియోలు

 పిల్లలు ఏ విషయాన్నయినా తొందరగా నేర్చుకోవాలంటే అది వారికి ఆసక్తిని రేకెత్తించే విధంగా ఉంటు వినోదాన్నిచ్చేదిగా ఉండాలి. పిల్లలు వినడం, చూడడం ద్వారా నేర్చుకుంటారు. అయితే చూడడం అన్నది వినడం కన్నా ఎక్కువ ప్రభావవంతంగా ఉంటుంది. అందువలన ఈ రోజుల్లో పిల్లలకు పాఠశాలలో కూడా వీడియోలను చూపిస్తు నేర్పిస్తున్నారు. కాని పిల్లలు తొందరగా టీవీలకి అతుక్కుపోయి కార్టున్ లు వంటి వాటికి అలవాటు పడుతున్నారు. ఎందుకంటే అవి వారికి వినోదాన్ని ఇస్తాయి, కాని ఎటువంటి విజ్ఞానాన్ని ఇవ్వవు. మనం వినోదంతో పాటు విజ్ఞానాన్ని కలిపి చూపిస్తే వారు వాటిని ఇష్టంగా చూస్తారు.
 టుటిటు టీవి అనేది ఒక ఆన్ లైన్ చానల్. ఇక్కడ వివిధ వస్తువులు ఎలా నిర్మితమవుతాయో, ఆంగ్ల అక్షరాలు, అంకెలు గురించి టుటిటు పిల్లలకి అర్ధమగు రీతిలో చెబుతుంది. వీడియోలు మంచి నాణ్యతతో ఉండడమే కాకుండా పిల్లలను ఆకట్టుకుంటాయి. వీటి ద్వారా వారు సులభంగా నేర్చుకుంటారు. ఈ చానల్ లో వీడియోలే కాకుండా పిల్లల ఆటలు, వివిధ యాక్టివిటి ఓరియంటెడ్ ఆటలు మరియు బొమ్మలకు రంగులు వేయడం వంటివి కూడా ఉన్నాయి.


టుటిటు రైలు గురించి చెబుతుంది