బ్లాగులందు పుణ్య బ్లాగులు వేరయా!

 సాంకేతిక పరిజ్ఞానం ఎంతో అభివృధ్ధి చెందిన ఈ రోజుల్లో కూడా మనిషి ఒక అతీత శక్తి పై ఆధారపడుతూనే ఉన్నాడు. ముఖ్యంగా పురాతన ఆధ్యాత్మిక వారసత్వం గల భారతీయులలో ఇది మరి ఎక్కువ. మనిషి ఇప్పుడు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని మరియు ఆధ్యాత్మికతను మేళవించి సేధతీరుతున్నాడు. క్షణం తీరిక లేకపోయినప్పటికి తన ఆధ్యాత్మికచింతనను వివిధ రూపాల్లో వ్యక్త పరుచుకుంటూనే ఉన్నాడు. వీటిలో ఒకరూపం పుణ్యక్షేత్ర సంధర్శన. రవాణా మరియు మౌలిక వసతులు పెరగడం వలన చివరి మజిలీగా ఇంతకు మునుపు భావించిన పుణ్యక్షేత్ర సంధర్శన ఇప్పుడు కడు సులభమైంది. ఆ పుణ్యక్షేత్ర సంధర్శనని మనకు కళ్ళకు కట్టినట్లు తెలుగులో వివరించే ఈ బ్లాగు కూడా ఒక పుణ్యక్షేత్రమే.
 వ్యాపార ప్రకటనలు, ప్రచార పటొపాలు లేకుండా రాజచంద్ర అను ఒత్సాహిక బ్లాగరుచే నిర్వహించబడుతున్న తెలుగు ట్రావెల్ బ్లాగుగా పిలవబడు ఈ వెబ్ బ్లాగు నందు పసిధ్ద  పుణ్యక్షేత్రాల గురించి తెలుగులో సచిత్ర సహితంగా ఉన్నాయి. స్థల పురాణం, చేరుకొనే విధానం, వసతి, చుట్టుప్రక్కల చూడ దగ్గ ప్రధేశాలు వంటి విశేషాలతో ఇక్కడ పుణ్యక్షేత్రాలు కొలువై ఉన్నాయి.