ఆండ్రాయిడ్ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
ఆండ్రాయిడ్ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

ఆండ్రాయిడ్ లాలిపప్ 5.1.1 తరువాతి వెర్షను

 
ప్రపంచంలో ఎక్కువ మొబైల్ పరికరాల్లో వాడబడుతున్న ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టము యొక్క తరువాతి వెర్షను డెవలపర్ కిట్ మరియు మూడొవ ప్రివ్యూను డెవలపర్ల కోసం గూగుల్ విడుదల్ చేసింది. మార్ష్‌మాలో(చెక్కరతో తయారుచేయబడివ మిటాయిని క్రింది చిత్రంలో చూడవచ్చు) గా వ్యవహరించే ఈ ఆండ్రాయిడ్ వెర్షను సంఖ్య 6. ఈ ఆపరేటింగ్ సిస్టము ప్రస్తుతం నెక్సస్ పరికరాలకు మాత్రమే అందుబాటులో ఉంది. గూగుల్ నెక్సస్ పరికరాను వాడేవారు క్రింది లంకె నుండి దింపుకొని ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. 

నెక్సస్ పరికరాలకు ఆండ్రాయిడ్ 6 డౌన్‌లోడ్


ఈ వెర్షనులో ముఖ్యంగా ఫింగర్ ప్రింట్ సెన్సర్ మరియు బ్యాటరీ సేవింగ్ మోడ్‌లను మెరుగుపరిచినట్లు గూగుల్ బ్లాగులో ప్రకటించారు.

తక్కువ డాటాతో వేగంగా ఫేస్‌బుక్

 సామాజిక అనుసంధాన వేధికల్లో మొదటి స్థానాన్ని ఆక్రమించిన పేస్‌బుక్ తన స్థానాన్ని మరింత పధిల పరచుకోవడానికి ఉచితంగా ఇంటర్ నెట్(ఫ్రీ ఇంటర్ నేట్. ఆర్గ్) ప్లాన్ జిరో (ఎయిర్ టెల్ తో కలిసి) వంటి పలు పధకాలను ప్రవేశపెడుతుంది. ఫేస్‌బుక్‌ని కంప్యూటరు కన్నా ఫోన్‌ ద్వారా వాడుతున్న వారే ఎక్కువగా ఉంటారు.  తాజాగా ఇపుడు తక్కువ వేగం కలిగిన మొబైల్ నేట్ ని వాడే వినియోగదారులకి కూడా ఫేస్‌బుక్ వేగంగా తెరుచుకోబోతుంది. దానికోసం ఫేస్‌బుక్ లైట్ అనే అప్లికేషనుని విడుదలచేసింది. 
 ఇప్పటికి ఎక్కువగా వాడబడుతున్న 2జి నెట్‌వర్క్‌ కోసం ప్రత్యేకంగా తయారుచేసిన ఈ ఫేస్‌బుక్ లైట్ అప్లికేషను సైజు యంబి కన్నా తక్కువ వుండటం వలన చాల త్వరగా ఇన్స్టాల్ అవుతుంది, తక్కువ మెమరీ ని ఆక్రమిస్తుంది. అంతేకాకుండా తక్కువ ఫోను వనరులని వాడుకుంటూ (ప్రాససర్, రామ్‌ మరియు బ్యాటరీ) దిగువ శ్రేణి మొబైళ్ళలో కూడా పనిచేసేలా దీనిని రూపొందించారు. మొబైల్ నెట్ వర్క్‌ల వాడేవారికి వేగంగా ఫేస్‌బుక్‌ను చూపించడమే కాకుండా డాటా తక్కువగా వాడుకుంటు సమయాన్ని, డబ్బులని ఆధా చేస్తుంది. ఆప్షన్ల విషయంలో సాధారణ వెర్షను ఫేస్‌బుక్ యాప్‌తో పోల్చలేనప్పటికి కనీస అవసరాలయిన అన్ని ఆప్షన్లు దీనిలో కూడా ఉందుబాటులో ఉన్నాయి.
 ఈ లైట్ యాప్‌ తెలుగు అక్షరాలను సరిగానే చూపుస్తున్నప్పటికి వత్తులు విడిపోయి అక్షరాల క్రింద కాకుండా ప్రక్కన కనిపిస్తున్నాయి.

ఈ ఫేస్‌బుక్ లైట్ అప్లికేషను ఆండ్రాయిడ్ మరియు విండోస్ మొబైళ్ళలో పనిచేస్తుంది. ఈ అప్లికేషను ను డౌన్లోడ్ చేస్కోనుటకు ఈ క్రింది లింకులకు వెళ్ళండి.

ఆండ్రాయిడ్ కోసం : డౌన్‌లోడ్

విండోస్ కోసం : డౌన్‌లోడ్

ఆండ్రాయిడ్ ఫోన్లలో తెలుగు టైపింగ్ కి మంచి కీబోర్డ్ అప్లికేషను

 ఆండ్రాయిడ్ ఫోన్లలో తెలుగులో టైప్ చెయ్యడానికి చాలా కీబోర్డులు ఉన్నప్పటికిని వాటిలో వత్తులు, పొల్లులు టైప్‌ చేయడం కొంత ఇబ్బందిగా ఉంటుంది. కానీ ఇప్పుడు తెలుసుకోబోయే కీబోర్డ్ యాప్ ను ఉపయోగించి ఎవరైనా సులభంగా టకాటకా తెలుగులో టైప్ చేయడానికి వీలవుతుంది. అంతేకాకుండా ఆండ్రాయిడ్ తో డిఫాల్ట్‌గా వచ్చే కీబోర్డ్ ని పోలిఉండి, దానిలో వలే మెటీరియల్ మరియు హలో లైట్, డార్క్ థీంలు కలిగిఉండి ప్రతిభాషకు నాలుగైదు లేఅవుట్లు కలిగిఉండడం దీని ప్రత్యేకత. మొత్తం 23 భారతీయ భాషలతో, 54 లేఅవుట్లతో లభించే ఈ కీబోర్డ్ యాప్ తెలుగుభాషకు వచ్చే సరికి 5 లేఅవుట్లతో అందుబాటులో ఉంది. ఈ యాప్ ఆండ్రాయిడ్ 4.1 మరియు దాని తరువాతి వెర్షనులలో పనిచేస్తుంది. ఒపెన్ సోర్స్ అప్లికేషను అయిన ఈ కీబోర్డ్ యాప్ ని మనం ఉచితంగా ప్లేస్టోర్ నుండి దింపుకోవచ్చు.



  కీబోర్డుని ఇన్‌స్టాల్ చేసిన తరువాత సెట్టింగ్స్ --లాంగ్వేజి &ఇన్‌పుట్ లోకి వెళ్ళి అక్కడ ఇండిక్ కీబోర్డు ని టిక్ చేసుకోవాలి. ఆ తరువాత ఏదైనా అప్లికేషనులో టైప్ చేయడానికి ప్రయత్నిస్తే నోటిఫికేషను ఏరియాలో కీబోర్డు సింబల్ కనిపిస్తుంది. దానిని తాకినపుడు మనకు అందుబాటులో ఉన్న కీబోర్డ్ లేఅవుట్లను చూపిస్తుంది. అపుడు మనం వాటినుండి ఇండిక్ కీబోర్డ్ ని ఎంచుకుంటే ఇండిక్ కీబోర్డ్ వస్తుంది. భాషను మార్చుకోవడానికి ఇండిక్ కీబోర్డు సెట్టింగులలోకి వెళ్ళి తెలుగు మరియు కావలసిన లేఅవుట్ (ఇన్ స్క్రిప్ట్, ఫోనెటిక్) సెలెక్ట్ చేసుకోవాలి.

ఇన్‌డిక్ కీబోర్డ్ లో తెలుగు లేఔట్లు

ఫేస్‌బుక్ మెసెంజర్ యాప్ ద్వారా ఇక వీడియో కాలింగ్

 ప్రపంచంలోనే అత్యధిక వాడుకరులు ఉన్న సామాజిక మాధ్యమం ఫేస్‌బుక్ ఇప్పటికే తన మొబైల్ మెసెంజర్ యాప్‌తో సందేశాలు పంపుకోవడంతో పాటు ఉచిత వాయిస్‌ కాల్ సదుపాయాన్ని కల్పించింది. తాజాగా ఇప్పుడు ఉచితంగా వీడియో కాల్ చేసుకోనే సౌలభ్యాన్ని కూడా కల్పించింది. ఈ సదుపాయాన్ని పొందడానికి మనం తాజా వెర్షను మెసెంజర్ యాప్ ఇన్‌స్టాల్ చేసుకొని ఉండడంతో పాటు మనం కాల్‌ చేయాలనుకునేవారు కూడా తాజా వెర్షను యాప్ ఇన్‌స్టాల్ చేసుకొని ఉండాలి. వీడియో కాలింగ్ ఆప్షను వచ్చిన తరువాత క్రింది చిత్రంలో వలే మనకు వాయిస్ మరియు వీడియో కాలింగ్ కొరకు వేరువేరు బటన్‌లు అందుబాటులో ఉంటాయి. 
 

మన ఫోన్‌ యొక్క రేడియేషన్ ఎంత అన్నది తెలుసుకోవడం ఎలా?

 ఈ మధ్యకాలంలో ఎక్కువ స్పెసిఫికేషన్ గల దేశీయ, చైనా తయారీ ఫోన్లు తక్కువ ధరల్లో లభిస్తున్నాయి. అయితే వీటిలో ఎన్ని ఫోన్లు భారత ప్రభుత్వం ప్రజల ఆరోగ్యం కొరకు జారీచేసిన రేడియోషన్ పరిమితులను గౌరవిస్తున్నాయి. దీనిని తెలుసుకోవడం ఎలా?  మనిషి ఆరోగ్యంపై ధుష్ప్రభావాలు లేకుండా ఉండడానికి మన ప్రభుత్వం మొబైల్ ఫోను యొక్క రేడియేషన్ పరిమితిని ( దీనిని షార్ వాల్యూ లేదా స్పెసిఫిక్ అబ్జార్బ్‌షన్ రేట్ అని అంటారు)1.6 W/Kg కన్నా తక్కువగా ఉండాలని నిర్ణయించినది.
  మన ఫోను యొక్క షార్ విలువను తెలుసుకోవడానికి *#07# అన్న నెంబరుకు డయల్ చేస్తే చాలు. మన ఫోను యొక్క షార్ విలువ తెరపై చూపించబడుతుంది.

మొబైళ్ళలో చేత్తో రాయడానికి


 ఈ మధ్యన గూగుల్ తన ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టములో వివిధ స్థానికభాషలకు మధ్దతును కల్పించడంతో పాటు ఇన్‌పుట్ టూల్స్ లో కూడా స్థానికభాషలను పరిగణలోకి తీసుకుని తగిన మధ్దతును అందిస్తుంది. మొబైళ్లలో సాధారణంగా మనం టైప్ చేయడానికి వాడే కీబోర్డ్ అప్లికేషన్‌తో పాటు అధనంగా నోటిమాటను కూడా అక్షరాలుగా మార్చగలిగే సదుపాయాన్ని ఇప్పటికే కల్పించిన గూగుల్ తాజాగా నేరుగా చేతివ్రాతను అక్షరాలుగా మార్చే అప్లికేషనును విడుదలచేసింది. గూగుల్ హాండ్‌రైటింగ్ ఇన్‌పుట్ గా వ్యవహరించే ఈ అప్లికేషనును ప్లేస్టోరు నుండి ఉచితంగా దింపుకోవచ్చు.


 అప్లికేషను తెరిచి సెట్టింగులలో మనకు కావలసిన భాషను ఎంచుకొని మనం పేపరుపై వ్రాసినట్లే వేలితో ఫోనులో వ్రాయడమే. మనం రాసిన చేతివ్రాతను అక్షరాలుగా మార్చుకోవడంతో పాటు తగిన సలహా అక్షరాలను కూడా చూపిస్తుంది. ఈ అప్లికేషనును ఉపయోగించి మెసెంజర్, పేస్‌బుక్ వంటి అన్ని అప్లికేషన్లలో మనం వ్రాసుకోవచ్చును. ఆండ్రాయిడ్ 4.0.3 మరియు ఆ పైన వెర్షను ఆండ్రాయిడ్ టాబ్లెట్లు, మొబైళ్లలో పనిచేసే ఈ అప్లికేషను తెలుగుతో పాటు మరో 81 భాషలకు మధ్దతునిస్తుంది. తెలుగు వంటి సంక్లిష్ట లిపి ఉన్న భాషలను వ్రాయడానికి ఈ ఆప్లికేషను బాగా ఉపయోగపడగలదు.

వాహనాల కోసం ఆండ్రాయిడ్

 ఫోన్లు, టాబ్లెట్లతో మొదలుపెట్టి టీవి, చేతిగడియరాలు, గేమింగ్ బాక్సులు మరియు కళ్ళజోళ్ళు వంటి పరికరాలను స్మార్ట్‌గా మార్చిన లినక్స్ ఆపరేటింగ్ సిస్టం ఆండ్రాయిడ్ ఇప్పుడు వాహనాలను కూడా స్మార్ట్ గా మార్చబోతుంది. వాహనాల డాష్‌బోర్డులో ఉండే ఆడియో ప్లేయర్లు ఇప్పుడు ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టముతో శక్తివంతమై పాటలు వినడానికి మాత్రమే కాకుండా దారిచూపడానికి, చిరునామా చెప్పడానికి, దగ్గరలో ఉన్న ప్రదేశాల వివరాలను తెలుసుకోవడానికి, వాతావరణ మరియు ట్రాఫిక్ వివరాలను తెలుసుకోవడానికి, ఫోను మాట్లాడుకోవడానికి మరియు సందేశాలను పంపుకోవడానికి (ఫోను డాక్ చేసినపుడు) మరియు పలు ఆండ్రాయిడ్ అప్లికేషన్‌లను వాడుకోవడానికి ఉపయోగపడే విధంగా రాబోతున్నాయి.
 వాహనాలకోసం గూగుల్ విడుదల చేసిన ఈ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమును ఆండ్రాయిడ్ ఆటోగా వ్యవహరిస్తారు. పయనీర్ ఎలక్ట్రానిక్స్ సంస్థతో కలిసి మూడూ మోడళ్లను అమెరికాలో విడుదలచేసింది. తొందరలో భారతదేశంలో కూడా లభించబోయో ఈ స్మార్ట్ డాష్‌బోర్డ్ పరికరాలు ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టముతో పనిచేస్తాయి. అన్ని ప్రముఖ వాహన తయారీదారులతో ఒప్పందం కుదుర్చుకొని రాబోయో రోజుల్లో కొత్తగా కొనే వాహనాల డాష్‌బోర్డులను ఆక్రమించడానికి ప్రణాళికలు సిద్దం చేసుకుంది. అలాగే పాత వాహనాల కోసం అధనపు సామాగ్రి తయారుచేసే సంస్థలతో ఒప్పందం కుదుర్చుకోబోతుంది. దానికి సంబందించిన ఆండ్రాయిడ్ ఆటో యాప్‌ను ప్లేస్టోర్‌లో విడుదలచేసింది. దానిని ఇక్కడ చూడవచ్చు. మరిన్ని వివరాలు ఆండ్రాయిడ్ ఆటో వెబ్‌సైటు నందు చూడవచ్చు. 

ఆండ్రాయిడ్ 5.1 విడుదలైంది.

 ప్రస్తుత ఆండ్రాయిడ్ వెర్షను 5.0.2 లాలిపప్ తరువాతి వెర్షను  5.1 లాలిపప్ నెక్సస్ 5, నెక్సస్ 7(2012) మరియు నెక్సస్ 10 పరికరాల కోసం విడులైంది. మిగిలిన నెక్సస్ పరికరాలకోసం కూడా తొందరలోనే విడుదల కాబోతుంది. ఈ వెర్షనులో ముఖ్యంగా చెప్పుకోదగినవి పనితీరులో స్థిరత్వం, బహుళ సిమ్‌లకు మెరుగు పరిచిన మద్దతు, హెచ్‌డి వాయిస్ కాలింగ్ మరియు పరికరం రక్షణలో వృద్ది. కొత్త ఫీచర్లు కానీ సరిచేసిన బగ్లు కానీ మొత్తం కలుపుకొని సుమారు 14000 వరకు మార్పులతో వచ్చిన ఈ ఆండ్రాయిడ్ వెర్షను మిగిలిన కంపెనీల పరికరాలకు ఎప్పుడు విడులవుతుందో ఇంకా ఆయా తయారీదారులు ప్రకటించలేదు.
 
 

ఆండ్రాయిడ్ పరికరాలలో తెలుగు టైప్ చేయడం ఎలా?

 ఆండ్రాయిడ్ పరికరాలలో తెలుగు టైప్‌ చేయడానికి ప్లేస్టోర్‌లో దొరికే పలురకాల అప్లికేషనులు ఇన్‌స్టాల్ చేసుకోవలసివచ్చేది. ఇప్పుడు ఇవేమి అవసరం లేకుండానే కేవలం చిన్న సెట్టింగును మార్చుకోవడం ద్వారా తెలుగు సులభంగా ఏవిధంగా టైప్ చేసుకోవచ్చునో ఈ వీడియోలో చూడవచ్చు.

నోటిమాట ద్వారా ఇక ఆండ్రాయిడ్ ఫోను సెట్టింగులు మార్చుకోవచ్చు

 ఇప్పటికే ఆండ్రాయిడ్ పరికరాలలో నోటి మాట ద్వారా ఫోన్‌ చేయడం, అలారం సెట్ చేసుకోవడం, వెబ్ సెర్చ్ చేయడం వంటి ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు ఆండ్రాయిడ్ లాలిపప్ వెర్షనులో మరికొన్ని సెట్టింగులను నోటిమాట ద్వారా మార్చుకొనే వెసులుబాటు కల్పించారు. ఈ సదుపాయాన్ని ఉపయోగించి మనం ఫ్లాష్‌లైట్, వైఫై మరియు బ్లూటూత్ ని నేరుగా ఆన్‌ చేయవచ్చును లేదా ఆఫ్ చెయ్యవచ్చును. ఉదాహరణకు ఒకే గూగుల్ అన్న తరువాత లేదా గూగుల్ సెర్చ్ విడ్జెట్‌ని తాకిన తరువాత కాని టర్న్‌ ఆన్ వైఫై, టర్న్‌ ఆఫ్ వైఫై అని అనాలి. ఈ సౌకర్యాన్ని వాడుకోవడానికి నెట్ అనుసందానం ఉండాల్సిరావడం కొంత నిరుత్సాహకరమైన విషయం. తొదరలోనే నెట్ లేకుండా కూడా పనిచేయాలని అశిద్దాం.



పిల్లల కోసం ప్రత్యేకంగా యూట్యూబ్ అప్లికేషను

 వీడియోలను పంచుకోవడానికి ఉపయోగపడే వెబ్‌సైట్లలో గూగుల్ వారి యూట్యూబ్‌దే ప్రధమస్థానం. ఇప్పుడు గూగుల్ పిల్లల కోసం ప్రత్యేకంగా యూట్యూబ్ ఆండ్రాయిడ్ అప్లికేషనును అభివృద్ది చేస్తుంది. యూట్యూబ్ కిడ్స్ గా పిలవబడే ఈ అప్లికేషను కేవలం పిల్లలకు ఉపయోగపడే అంటే విద్యని, విజ్ఞానాన్ని మరియు వినోదాన్ని అందించే వీడియోలను మాత్రమే అందిస్తుంది. అంతేకాకుండా పెద్దలకు మాత్రమే వీడియోలు దీనిలో రావు. ఈ అప్లికేషను యొక్క రూపం కూడా పిల్లలను ఆకట్టుకునేటట్లు ఉండడమే కాకుండా వారు సులువుగా వెతకడానికి అనువుగా, టైప్ చేయనవసరం లేకుండా మాటల ద్వారా కూడా వీడియోలను వెతికే విధంగా ఉండబోతుంది. మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే పిల్లలు ఎంతసేపు వీడియోలు చూడవచ్చునో తల్లిదండ్రులు నియంత్రిచగలగడం.
 ఈ యూట్యూబ్ కిడ్స్ ఆండ్రాయిడ్ అప్లికేషను ఈ నెల 23 నుండి ఉచితంగా ప్లేస్టోర్‌లో అందుబాటులోకి రానుంది.



వాట్స్‌యాప్ వాయిస్ కాలింగ్ అందరికి అందుబాటులోకి

 కొన్ని రోజుల క్రితం కొంత మంది వాడుకర్లకి మాత్రమే అందుబాటులోకి వచ్చిన వాట్స్‌యాప్ వాయిస్ కాలింగ్ ఇప్పుడు అందరికి అందుబాటులోకి వచ్చింది. ఈ సదుపాయాన్ని వాడుకోవడానికి మన ఫోనులో వాట్స్‌యాప్ యొక్క సరికొత్త వెర్షను అనగా ప్లేస్టోర్ నుండి ఇన్‌స్టాల్ చేయబడిన 2.11.528 వెర్షను గాని లేదా వాట్స్‌యాప్ వెబ్‌సైటు నుండి దింపుకొన్న 2.11.531 వెర్షను గాని ఇన్‌స్టాల్ చేయబడి ఉండాలి. అంతేకాకుండా ఇప్పటికే వాయిస్ కాలింగ్ సదుపాయం వాడుతున్నవారు మనకు కాల్ చేయవలసి ఉంటుంది. మొదటిసారి మనం కాల్ అందుకున్న తరువాత ఒక్క చాట్ ఆప్షనును చూపించే అప్లికేషను కాస్తా క్రింది చిత్రంలో చూపించినట్లు కాల్స్, చాట్ మరియు కాంటాట్స్ అని మూడు టాబ్‌లుగా విడిపోతుంది. అప్పటినుండి మనం కూడా వాయిస్ కాలింగ్ సదుపాయాన్ని వాడుకోగలుగుతాము. మనం కాల్ చేసే వారికి కూడా తప్పని సరిగా పైన పేర్కొన్న సరికొత్త వెర్షను ఉండాలి. 


ఆండ్రాయిడ్ ఫోను స్క్రీన్‌ని రికార్డ్ చేయడం ఎలా?

 ఆండ్రాయిడ్ ఫోన్‌ని రూట్ చేయవనసరం లేకుండానే ఉచిత అప్లికేషను ఉపయోగించి ఫోను యొక్క స్క్రీన్‌ని రికార్డ్ చేస్తూ సులభంగా వీడియో ట్యుటోరియళ్ళు తయారుచేయడం ఎలానో ఈ వీడియోలో చూడవచ్చు.

ఫేస్‌బుక్ మెసెంజర్ యాప్ తో ఇప్పుడు వాయిస్ కాల్‌ చేసుకోవచ్చు.

 పేస్‌బుక్ మెంసెంజర్ యాప్‌ను ఉపయోగించి ఇప్పుడు సందేశాలను పంపుకోవడంతో పాటు ఇప్పుడు వాయిస్ కాల్‌లు కూడా చేసుకోవచ్చు. దీనికి మనం చేయవలసిందల్లా ఫేస్‌బుక్ మెసెంజర్ యాప్‌ సరికొత్త వెర్షనుని ఇక్కడ నుండి మన ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసుకోవాలి. ఇప్పటికే ఇన్‌స్టాల్ చేయబడి ఉంటే కొత్త వెర్షనుకి అప్‌డేట్‌ చేసుకోవాలి. చాట్‌ విండోకి కుడి ప్రక్కన ఫోన్‌ బొమ్మని నొక్కడం ద్వారా మనం మన మిత్రులకి ఫోన్ చేసుకోవచ్చు. ఫోను గుర్తు నీలి రంగులో ఉంటే మనం కాల్ చేసుకోవచ్చు. నీలిరంగులో లేకపోతే మనం కాల్ చేయాలనుకున్న వారు పాత వెర్షనులో ఉన్నట్లు. వైఫై మరియు 3జి నెట్‌వర్క్‌ని ఉపయోగించి కాల్ చేసినపుడు కాల్ నాణ్యత సాధారణ ఫోన్‌ కాల్ కంటే చాలా రెట్లు బాగుంది. ఈ సౌకర్యం వాడుకోవడానికి ఇరువురు సరికొత్త వెర్షను ఇన్‌స్టాల్ చేయబడిన ఆండ్రాయిడ్ ఫోన్ కలిగి ఉండాలి. 


మీ మోటోజి లో ఆండ్రాయిడ్ 5.0.2 (లాలిపప్) ఇన్‌స్టాల్ చేసుకోండిలా.

 మోటోజి గత సంవత్సరం అత్యధిక ప్రజాధరణ పొందిన ఫోన్. అందుబాటు ధరలో మంచి ఫీచర్లతో లభిస్తుండడమే కాకుండా కొత్త ఆండ్రాయిడ్ వెర్షనుకి తొందరగా అప్‌డేట్స్ పొందడం దీని ప్రత్యేకత. మోటోజికి ఇప్పటికే ఆండ్రాయిడ్ 5 (లాలిపప్) అప్‌డేట్ రావల్సిఉంది. లాలిపప్‌లో ఉన్న మెమోరీ లీకేజి సమస్య కారణంగా జాప్యం జరిగింది. గూగుల్ సమస్యలను సరిచేసి 5.0.2 విడుదల చేసిన తరుణంలో మోటోజి లాలిపప్ అప్‌గ్రేడ్ తొందరలోనే రాబోతుంది. మోటోరోలా అధికారికంగా ఒటిఎ అప్‌డేట్ విడుదల చేయకముందే ఇప్పుడే మనం మన మోటోజిని లాలిపప్‌కి అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు. ఈ పద్దతి ద్వారా వారెంటీ పోగుట్టుకోనక్కర లేకుండానే (మనం ఫోను రూట్‌ చేసి, బూట్‌లోడర్ అన్‌లాక్ చేసి, కస్టమ్ రామ్‌ ఇన్‌స్టాల్ చేసి) మనం మన మోటోజిని లాలిపప్‌కి అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు.


 మోటోరోలా తన పరికరాలకు కొత్త ఆండ్రాయిడ్ వెర్షను విడుదలచేసే ముందు ఆపరేటింగ్ సిస్టమును పరిక్షించడానికి రిజిస్టరు చేసుకున్న వాడుకర్లకు మాత్రం రాబోయే ఆపరేటింగ్ సిస్టము యొక్క ఒటిఎ అప్‌డేట్‌ని అందిస్తుంది. ఈ పక్రియను సోక్‌ టెస్ట్ అంటారు. ఈ సోక్‌టెస్ట్‌లో భాగంగా వచ్చిన ఒటిఎ అప్‌డేట్‌ ఫైల్‌ని ఉపయోగించి మనం కూడా మోటోజిని లాలిపప్‌కి అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు. ఈ పద్దతి 4.4.4 కిట్‌కాట్ ఇన్‌స్టాల్ చెయ్యబడి, భారతదేశంలో కొన్న ఫోన్‌లకు పనిచేస్తుంది. మనం చేయవలసిందల్లా క్రింది లింకు ఇవ్వబడిన ఒటిఎ అప్‌డేట్‌ ఫైల్‌ని మన కంప్యూటరు ద్వారా దింపుకొని ఫోను స్టోరేజి లోకి (ఈ జిప్ ఫైల్‌ని ఫోల్డర్లలో కాకుండా అంటే మ్యూజిక్, డౌన్‌లోడ్స్ వంటి ఫోల్డర్లలో కాకుండా నేరుగా స్టోరేజి లోకి) కాపీ చేసుకోవాలి. తరువాత సెట్టింగ్స్- అబవుట్ ఫోన్‌- సిస్టం అప్‌డేట్ లోకి వెళ్ళినపుడు మన ఫోనుకి ఆండ్రాయిడ్ 5.0.2 అప్‌డేట్ అందుబాటులో ఉందని చూపిస్తుంది. ఆ తరువాత తెరపై చూపించిన సూచనలను పాటిస్తే సరి. ఫోను తిరిగి ప్రారంబించబడి లాలిపప్ 5.0.2 మన ముందుంటుంది. ఈ పద్దతిలో మన డాటా కూడా అలానే ఉండడమే కాకుండా రాబోయో రోజుల్లో మన ఫోనుకు అధికారికంగా విడుదల చేసిన అప్‌డేట్స్ కూడా పొందవచ్చు.




వాట్స్‌యాప్‌ ని మించిన ఫీచర్లతో టెలిగ్రామ్‌

 ఏ స్మార్ట్‌ఫోన్ చూసినా వాట్స్‌యాప్ అప్లికేషను తప్పనిసరిగా ఉంటుంది. సందేశాలను పంపడానికి ఉపయోగించే అప్లికేషన్‌లలో వాట్స్‌యాప్‌దే ప్రధమస్థానం. వాట్స్‌యాప్‌కి దీటయిన ప్రత్యామ్నాయంగా ఇప్పుడు టెలిగ్రామ్‌ వేగంగా విస్తరిస్తుంది. ప్రధానిచే ప్రస్తావించబడిన ఈ టెలిగ్రామ్‌ మెసెంజర్ యాప్ ఒపెన్‌సోర్స్ సాఫ్ట్‌వేర్ కావడం విశేషం. వాట్స్‌యాప్‌ని ఫేస్‌బుక్ కొనుగోలు చేసినప్పటికి టెలిగ్రామ్‌ ఇంత పోటి ఇవ్వడానికి కారణం వాట్స్‌యాప్‌ ని మించిన ఫీచర్లే అని చెప్పుకోవచ్చు.



  • వాట్స్‌యాప్ కన్నా వేగవంతంమైనది, తేలికైనది.
  • కొంతకాలం తర్వాత కొనుక్కోమని అనదు. ఉచితం మరియు ప్రకటనలు(యాడ్స్) ఉండవు.
  • వాట్స్‌యాప్ వలే కాకుండా ఎన్ని పరికరాలలో అయినా ఇన్‌స్టాల్ చేసుకొని ఏకకాలంలో వాడుకోవచ్చు.
  • ప్రముఖ మొబైల్ ఆపరేటింగ్ సిస్టములతో పాటు అన్ని డెస్క్‌టాప్ ఆపరేటింగ్ సిస్టములలో కూడా ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. ఇక్కడ నుండి ఇన్‌స్టాల్ చేసుకోండి.
  • ఇన్‌స్టాల్ చేసుకోకుండా వాడుకోవడానికి వెబ్‌వెర్షను కూడా అందుబాటులో ఉంది. ఇక్కడ చూడండి.
  • బద్రతకి ప్రాధాన్యతనివ్వడంతో పాటు నిర్ణీత సమయంలో చెరిగిపోయేటట్లు రహస్య సందేశాలను పంపుకునే సౌలభ్యం.
  • వాట్స్‌యాప్‌ని పోలిన అలవాటయిన ఇంటర్‌పేజ్‌తో వాడడం సులభం.
  • 200 సభ్యులతో పెద్ద గ్రూప్‌ తయారుచెసుకోవచ్చు. గ్రూపులో ఆన్‌లైన్‌లో ఉన్నవారిని సులభంగా గుర్తించవచ్చు.
  • 1జిబి పెద్దపరిమాణం గల ఫైళ్ళను కూడా పంపుకోవచ్చు. వీడియోలు మరియు చిత్రాలే కాకుండా ఎటువంటి పైల్ అయినా పంపుకోవచ్చు. 
  • పూర్తిగా క్లౌడ్ అధారిత సర్వీసు కావడం వలన ఏ పరికరం నుండయినా ఫైళ్ళను తెరవవచ్చు.
  • మెరుగైన నోటిఫికేషన్ సెట్టింగులు.

ఇక ఇంటర్ నెట్ కాల్స్ పై చార్జ్ వసులు

రెండు నెలల క్రితం ఇంటర్ నెట్ కాల్స్ పై చార్జ్ వసులుచేసుకుంటాము అన్న భారత టెలికాం ఆపరేటర్ల ప్రతిపాదనని ట్రాయ్ బుట్టదాఖలు చేసినప్పటికి వారి ఏర్పాట్లలో వారుఉన్నారు. వాట్స్‌అప్‌, స్కైప్, వైబర్, హాంగవుట్స్ వంటి అప్లెకేషన్‌లు ద్వారా వాడుకున్న డాటా మన ప్రస్తుత డాటా పధకంలోకి రాకుండా దానికి ప్రత్యేకమైన చార్జిలు విదిస్తారు. భారత అగ్రగామి నెట్‌వర్క్ ఏయిర్ టెల్ ఎప్పటిలాగే ముందు బాదడానికి ముందుకు రాగా మిగిలినవారు దానిని అనుసరించబోతున్నారు. దానికి సంభందించిన చిత్రాలు చూడండి.ఆ చార్జీలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. మీరు మొబైల్ నెట్‌వర్క్‌ పై ఎక్కువ గా పై అప్లికేషన్‌లు ఉపయోగిస్తున్నవారయితే జాగ్రత్త.




ఫైర్‌ఫాక్స్ వీడియో చాట్

ఎటువంటి అకౌంట్ మరియు సాఫ్ట్‌వేరు అవసరం లేకుండానే వీడియో చాట్ చేయడానికి ఫైర్‌ఫాక్స్ కొత్తగా ఫైర్‌ఫాక్స్ హల్లో సర్వీసును ప్రారంభించింది. ఫైర్‌ఫాక్స్ వెబ్‌బ్రౌజరు వాడేవారు ఎటువంటి అధనపు సాఫ్ట్‌వేరు ఇన్‌స్టాల్ చేసుకోకుండానే ఫైర్‌ఫాక్స్ లేదా క్రోమ్‌ ఇన్‌స్టాల్ చేయబడిన కంప్యూటరు లేదా మొబైల్ ఉన్నవారితో ఉచితంగా వీడియో కాల్ మాట్లాడుకోవచ్చు.  ప్రస్తుతానికి ఇద్దరు మాత్రమే మాట్లాడుకొనే వీలు ఉన్న ఫైర్‌ఫాక్స్ హలో తరువాతి వెర్షనులో గ్రూప్‌ వీడియో చాట్ సదుపాయాన్ని కూడా తీసుకురాబోతుంది. ఫైర్‌ఫాక్స్ వారి ఈ వీడియో చాట్ సదుపాయం గురించి మరింత సమాచారం క్రింది లింకులలో తెలుసుకోవచ్చు. 
 
 
మొబైల్‌లో ఫైర్‌ఫాక్స్ హలో వీడియో చాట్ చిత్రాలను క్రింద చూడవచ్చు.
 
వీడియో చాట్ ప్రారంబించడం
కెమేరా, మైక్రోఫోను వాడుకోవడానికి అనుమతి
వీడియో చాట్‌

ఈ స్మార్ట్‌ఫోన్ ధర కొంచెం, ఫీచర్లు ఘనం

 వేగంగా వృద్ది చెందుతున్న, ఇంకా వృద్ది చెందడానికి అవకాశం ఉన్న భారత స్మార్ట్‌ఫోన్ విపణి ఇప్పుడు అన్ని కంపెనీలకు ప్రధాన లక్ష్యంగా మారింది. చిన్న, మధ్యతరగతి తయారీదారులే కాకుండా దిగ్గజసంస్థలు కూడా మన దేశవిపణి పై ఆశక్తి చూపిస్తూ వారి ఉత్పత్తులతో ఆకట్టుకుంటున్నాయి. ఫలితంగా తక్కువ ధరలో మంచి ఫీచర్లను అందించే స్మార్ట్‌ఫోన్‌లు అందుబాటులోకి వచ్చాయి, భవిష్యత్తులో మరిన్ని ఫోన్‌లు రాబోతున్నాయి. రాబోతున్న ఫోన్‌లలో ముఖ్యంగా చెప్పుకోవలసిన స్మార్ట్‌ఫోన్ "యురేకా". 

ఈ యోరెకా ఫోన్‌ని దేశియ అతిపెద్ద ఫోన్ల తయారీదారు మైక్రోమ్యాక్స్‌, ఆండ్రాయిడ్ అధారిత ఒపెన్‌సోర్స్ ఆపరేటింగ్ సిస్టం సయనోజెన్‌మోడ్ కలిసి తయారుచేస్తున్నాయి. దీనిని మైక్రోమాక్స్ బ్రాండ్‌పై కాకుండా"యు" అనే మరొక బ్రాండ్ పై విడుదలచేస్తుంది.
  ఆండ్రాయిడ్ 4.4 (కిట్‌కాట్) అధారిత సైనోజెన్‌మోడ్ 11 ఆపరేటింగ్ సిస్టంతో విడుదలయ్యే ఈ ఫోను వచ్చే సంవత్సరం జనవరి రెండోవారం నుండి అమేజాన్ ద్వారా అందుబాటులోకి రానుంది. ఈ ఫోన్ యొక్క ముఖ్య ఫీచర్లు.
  • క్వాల్‌కం 1.5 GHz ఆక్టకోర్ 64 బిట్ ప్రాససర్.
  • 2జిబి రామ్‌.
  • 16 జిబి నిల్వ సామర్ధ్యం, 32 జిబి వరకు పెంచుకునేందుకు మెమోరీ కార్డు స్లాట్.
  • గొరిల్లా గ్లాస్ 3 రక్షణతో 5.5 అంగుళాల హెచ్‌డి (1280*720) తెర.
  • ఆండ్రాయిడ్ 4.4 (కిట్‌కాట్) అధారిత సైనోజెన్‌మోడ్ 11 ఆపరేటింగ్ సిస్టం.
  •  ముందు 5 వెనుక 13 మెగాపిక్సెళ్ళ కెమేరాలు.
  • రెండు సిమ్‌లు, 4జి నెట్‌వర్క్‌కి మద్దతు.
  • 2500 యమ్‌ఎహెచ్ బ్యాటరీ.
  • ధర 8999 రూపాయలు.
 కొసమెరుపు: రూట్‌ చేసినప్పటికి వారెంటీ వర్తిస్తుందంట.

మీ మోటోజి ని లాలిపప్‌ అప్‌గ్రేడ్‌కి సిద్దం చెయ్యండి

 మోటోజి ఈ ఏడాది అధికంగా అమ్ముడుపోయిన మొబైళ్ళలో ఒకటిగా చెప్పుకోవచ్చు. ఆండ్రాయిడ్ 4.3 తో విడుదలైన ఈ బడ్జెట్ మొబైల్ ఆండ్రాయిడ్ అప్‌డేట్ విడుదలైన ప్రతిసారి వేగంగా అప్‌డేట్ పొందడంలో ముందుంది. తాజాగా విడుదలైన ఆండ్రాయిడ్ 5.0 లాలిపప్ కూడా మోటోజికి తొందరలోనే రాబోతుంది. అయితే లాలిపప్ అప్‌డేట్ పొందడానికి ముందుగా మనం మోటోరోలా అప్‌డేట్ సర్వీస్ అన్న అప్లికేషనుని అప్డేట్ చేసుకోవాలి. రెండు రోజుల క్రితం విడుదలైన ఈ సర్వీస్ అప్‌డేట్ లాలిపప్‌కి అప్‌గ్రేడ్ అవ్వాలంటే తప్పనిసరి. కనుక మోటోజి వాడుతున్నవారు తప్పకుండా మోటోరోలా అప్‌డేట్ సర్వీస్ అన్న అప్లికేషనుని ప్లేస్టోర్ ద్వారా అప్డేట్ చేసుకొని తమ ఫోన్‌లను లాలిపప్‌కి అప్‌గ్రేడ్‌కి సిద్దంగా ఉంచుకోగలరు. 

Printfriendly

Related Posts Plugin for WordPress, Blogger...

ఈ బ్లాగు ప్రముఖ పోస్ట్‌లు